https://oktelugu.com/

Balakrishna: డైరెక్టర్ బాబీని వెనక్కి నెట్టిన బాలయ్య.. ముందుగా ఈ డైరెక్టర్ మూవీనే..

వాస్తవానికి అనిల్ రావిపూడి సినిమా తరువాత బాబితో కలిసి సినిమా తీయాలనుకున్నారు. కానీ మధ్యలో బోయపాటి ఎంట్రీ ఇచ్చారు. ఇప్పటికే వీరి కాంబినేసన్లో వచ్చిన అఖండ బంపర్ హిట్టు కొట్టిన విషయం తెలిసిందే.

Written By: , Updated On : May 22, 2023 / 04:39 PM IST
Balakrishna

Balakrishna

Follow us on

Balakrishna: వీరసింహారెడ్డి హిట్టు తరువాత నందమూరి నటసింహం మంచి ఫాంలో ఉన్నారు. ఏమాత్రం ఖాళీగా ఉండకుండగా సినిమాలతో బిజీగా మారాడు. వరుసబెట్టి సినిమాలు చేస్తూ ఫ్యాన్స్ ను అలరిస్తున్నాడు. ప్రస్తుతం అనిల్ రావిపూడితో చేస్తున్న సినిమాకు సంబంధించిన లుక్స్ ఇప్పటికే రిలీజ్ అయ్యాయి. ఇందులో బాలయ్య కొత్తగా కనిపిస్తున్నాడు. ఈ మూవీ తరువాత బోయపాటితో కలిసి చేయనున్నాడు. ఇప్పటికే వీరి కాంబినేషన్లో వచ్చిన సినిమాలన్నీ సక్సెస్ అయ్యాయి. ఇప్పుడు అఖండ2 కోసం రెడీ అవుతున్నారు. అయితే ఇంతలో బాలయ్య బాబుకు సంబంధించిన ఓ హాట్ టాపిక్ సినీ సర్కిల్లో చక్కర్లు కొడుతోంది.

ఈ సినిమా తరువాత బాలకృష్ణ మరో మూవీకి కమిట్ అయ్యారు. అది డైరెక్టర్ బాబీతో ఉంటుందని ఇప్పటికే ప్రచారం సాగింది. అయితే బాబీ ఇటీవల మెగాస్టార్ చిరంజీవితో కలిసి ‘వాల్తేరు వీరయ్య’ సినిమా తీసిన విషయం తెలిసిందే. సంక్రాంతి సందర్భంగా రిలీజైన ఈ మూవీ సక్సెస్ సాధించింది. ఆ సమయంలోనే బాబీ తన తరువాత సినిమా బాలయ్య బాబుతో ఉంటుందని ప్రకటించారు. అయితే తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం బాబీతో చేసే సినిమా క్యాన్సల్ అయిందని తెలుస్తోంది.

వాస్తవానికి అనిల్ రావిపూడి సినిమా తరువాత బాబితో కలిసి సినిమా తీయాలనుకున్నారు. కానీ మధ్యలో బోయపాటి ఎంట్రీ ఇచ్చారు. ఇప్పటికే వీరి కాంబినేసన్లో వచ్చిన అఖండ బంపర్ హిట్టు కొట్టిన విషయం తెలిసిందే.ఈ సినిమా కోసం బోయపాటి బాలయ్యను కలవగా వెంటనే ఒప్పేసుకున్నారు. దీంతో బాబీ సినిమాను కాస్త వెనక్కి జరిపారు. అంతే బాబీ సినిమా కంటే ముందే బోయపాటి సినిమా వచ్చే అవకాశం ఉంది.

ప్రస్తుతం బాలయ్య అనిల్ రావిపూడి డైరెక్షన్లోని సినిమాలో నటిస్తున్నారు. ఇందులో కాజల్ కథానాయక. శ్రీలీల కూడా నటిస్తుంది. ఇప్పటికే బాలయ్య వీర ఎమోషన్లో ఉన్న పిక్స్ బయటకు వచ్చాయి. అయితే గెటప్ వెరైటీగా ఉండడంతో ఇందులో ప్రత్యేకంగా కనిపిస్తారని అంటున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. దసరా సందర్భంగా అక్టోబర్ 21న దీనిని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.