https://oktelugu.com/

ఆ హోంగార్డు చేసిన పనికి శభాష్ అనాల్సిందే..!

భారత్-చైనా సరిహద్దుల్లో యుద్ధమేఘాలు కమ్ముకొన్నాయి. ఎప్పుడేం జరుగుతోందోనని సరిహద్దుల గ్రామాల ప్రజలతో యావత్ ప్రపంచం ఉత్కంఠతో ఎదురుచూస్తోంది. గడిచిన నెలరోజులుగా చైనా-భారత్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొంటూనే ఉన్నాయి. జూన్ 15న అర్ధరాత్రి 3గంటల సమయంలో సరిహద్దుల్లోని గాల్వానాలోయలో ఇరుదేశాల మధ్య ఘర్షణ నెలకొంది. చైనా సైనికులు భారత్ సైనికులపై రాళ్లు, రాడ్లతో దొంగదెబ్బతీయడంతో 20మంది భారత జవాన్లు అమరులయ్యారు. చైనా దాడిని తిప్పికొట్టే క్రమంలో తెలంగాణకు చెందిన కల్నల్ సంతోష్ బాబు సహా 19మంది జవాన్లు […]

Written By:
  • Neelambaram
  • , Updated On : June 23, 2020 5:17 pm
    Follow us on


    భారత్-చైనా సరిహద్దుల్లో యుద్ధమేఘాలు కమ్ముకొన్నాయి. ఎప్పుడేం జరుగుతోందోనని సరిహద్దుల గ్రామాల ప్రజలతో యావత్ ప్రపంచం ఉత్కంఠతో ఎదురుచూస్తోంది. గడిచిన నెలరోజులుగా చైనా-భారత్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొంటూనే ఉన్నాయి. జూన్ 15న అర్ధరాత్రి 3గంటల సమయంలో సరిహద్దుల్లోని గాల్వానాలోయలో ఇరుదేశాల మధ్య ఘర్షణ నెలకొంది. చైనా సైనికులు భారత్ సైనికులపై రాళ్లు, రాడ్లతో దొంగదెబ్బతీయడంతో 20మంది భారత జవాన్లు అమరులయ్యారు. చైనా దాడిని తిప్పికొట్టే క్రమంలో తెలంగాణకు చెందిన కల్నల్ సంతోష్ బాబు సహా 19మంది జవాన్లు వీరమరణం పొందారు.

    రెండు పడవల ప్రయాణంలో ఉనికిని కోల్పోతున్న పవన్

    చైనా సైనికులు పక్కా ప్లాన్ తో దొంగదెబ్బ తీసినప్పటికీ భారత్ సైన్యం సమర్ధవంతంగా అడ్డుకుంది. 300మంది చైనా సైనికుల వందమంది భారత జవాన్లపై దాడి చేసినప్పటికీ వెనుకడుగు వేయకుండా చైనాను సరిహద్దుల్లోనే నిలువరించినట్లు తెలుస్తోంది. అయితే ఘర్షణలో భారత జవాన్లు మృతిచెందాడంపై కేంద్రం ప్రభుత్వం సీరియస్ అయింది. ఓవైపు శాంతి చర్చల పేరుతో భారత జవాన్లపై దాడికి యత్నించాన్ని తీవ్రంగా ఖండించింది. ఈనేపథ్యంలో సరిహద్దుల్లో కమాండర్ స్థాయి అధికారులకు పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకునే అధికారం కల్పించింది. త్రివిధ దళాలను సంసిద్ధంగా ఉండాలని ఆదేశించిన సంగతి తెల్సిందే. అంతేకాకుండా సరిహద్దుల్లోని జవాన్లు ఆయుధాలు ఉపయోగించుకునేందుకు అధికారం కల్పించినట్లు తెలుస్తోంది. సరిహద్దుల్లో చైనా బరితెగిస్తే భారత సైన్యం తిప్పేకొట్టేలా కేంద్రం సైనికులకుు అన్ని అధికారులు ఇచ్చి వారిలో ఆత్మస్థైర్యం పెంచుతోంది.

    జగన్, వైసీపీ ఎమ్మెల్యేలకు కరోనా భయం?

    భారత్ జవాన్ల మృతితో యావత్ దేశం రగిలిపోతుంది. వీరజవాన్లకు భారతీయులంతా ఘనంగా నివాళ్లర్పించారు. వీరజవాన్ల మృతి వృథాగాపోదని నినదిస్తున్నారు. ఈమేరకు చైనా వస్తువుల బహిష్కరణకు ప్రజలు పిలుపునిస్తున్నారు. సోషల్ మీడియాలో చైనా వస్తువులు బహిష్కరించాలంటూ ఉద్యమిస్తున్నారు. కేంద్రం కూడా చైనాకు చెందిన పలు కాంట్రాక్టులను రద్దుచేస్తూ షాకిస్తోంది. తాజాగా ఓ హోంగార్డు రక్తంతో రాష్ట్రపతికి లేఖరాసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. చైనాతో యుద్ధం వస్తే తనకు అవకాశం కల్పించాలని లేఖలో పేర్కొనడం ఆసక్తిని రేపుతోంది.

    108 స్కామ్ విజయ సాయిరెడ్డి మెడకు చుట్టుకుంటుందా?

    రాయచూర్ జిల్లా మస్కీలో లక్ష్మణ్ హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్నాడు. అంతేకాకుండా తనవంతు సాయంగా పేద విద్యార్థులకు స్పోకెన్‌ ఇంగ్లీష్, కన్నడ వ్యాకరణం, గణితం, సైన్స్‌ సబ్జెక్టులను బోధిస్తున్నాడు. గ్రామీణ పిల్లలకు క్రీడా మనోభావం, దేశభక్తి గురించి చెబుతున్నాడు. ఈక్రమంలోనే భారత్-చైనా సరిహద్దుల్లో భారత జవాన్లు వీరమరణం పొందాడంపై లక్ష్మణ్ చలించిపోయాడు. వెంటనే భారత రాష్ట్రపతికి రక్తంతో కూడిన లేఖను రాశాడు. చైనాతో భారత్ యుద్ధం చేయాల్సి వస్తే తనకు అవకాశం కల్పించాలని రక్తంతో కూడిన మూడుపేజీల లేఖను రాష్ట్రపతికి రాశాడు. ఈ విషయం తెలుసుకున్న ప్రతీఒక్కరు అతడిని అభినందిస్తున్నారు. ఈ ఒక్క సంఘటన చైనా పట్ల భారతీయులు ఎలా స్పందిస్తున్నారనే దానికి అర్థంపడుతుందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.