https://oktelugu.com/

కరోనా – బాలయ్య మధ్యలో బోయపాటి !

బాలయ్య అంతే.. ఒక్కసారి ఆయన ముహూర్తం పెట్టుకుని ఓ పని చేయాల్సిందే అంటే… ఇక ఎవరు చెప్పినా, ఏం జరిగినా వెనుకడుగు వేయరు. ఇప్పుడు ఇదే పెద్ద బాధ అయిపోయింది బోయపాటి టీంకి. షూటింగ్ ఇప్పుడు వద్దులేండి అంటే.. హే.. కరోనా నన్ను ఏమి చేయలేదు అంటున్నాడట. సరే, మీరు కారణ జన్ములు గనుక మిమ్మల్ని ఏమి చేయకపోయినా.. మమ్మల్ని ఏమైనా చేస్తే అనే అనుమానం వ్యక్తం చేస్తే.. నేను ఉన్నాను కదా కరోనా మీ జోలికి […]

Written By:
  • admin
  • , Updated On : August 10, 2020 / 04:05 PM IST
    Follow us on


    బాలయ్య అంతే.. ఒక్కసారి ఆయన ముహూర్తం పెట్టుకుని ఓ పని చేయాల్సిందే అంటే… ఇక ఎవరు చెప్పినా, ఏం జరిగినా వెనుకడుగు వేయరు. ఇప్పుడు ఇదే పెద్ద బాధ అయిపోయింది బోయపాటి టీంకి. షూటింగ్ ఇప్పుడు వద్దులేండి అంటే.. హే.. కరోనా నన్ను ఏమి చేయలేదు అంటున్నాడట. సరే, మీరు కారణ జన్ములు గనుక మిమ్మల్ని ఏమి చేయకపోయినా.. మమ్మల్ని ఏమైనా చేస్తే అనే అనుమానం వ్యక్తం చేస్తే.. నేను ఉన్నాను కదా కరోనా మీ జోలికి రాదు అన్నాడట. బాలయ్య ఉద్దేశ్యంలో కరోనా కూడా బాలయ్యకు భయపడాలి అన్నమాట. నిజానికి ఈ యవ్వారాన్ని మొత్తం ఒక షార్ట్ ఫిల్మ్ లా తీస్తే మంచి ఫన్ దొరుకుతుంది ఆడియన్స్ కి. ఏది ఏమైనా బాలయ్య షూట్ చేయకుండా ఉండేలా లేడు. కానీ, మిగిలిన నటీనటులు వస్తారా అంటే డౌటే. అసలుకే సంవత్సరం నుండి వెతుకుతున్నా ఇంతవరకూ బాలయ్యకి హీరోయిన్ దొరకలేదు. దొరికినా బాలయ్య అనేసరికి మొహం చాటేస్తున్నారు.

    Also Read: స్టార్ హీరో కుమారుడితో సోషల్ మీడియా బ్యూటీ!

    ఇప్పుడు బాలయ్య గనుక షూటింగ్.. మనల్ని కరోనా ఏమి పీకలేదు.. కరోనాని నలిపేస్తాను అని తన రెగ్యులర్ సినిమా డైలాగ్ లు చెబితే.. ఇక క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు కూడా బాలయ్య సినిమాకి దొరకరు. ఒకపక్క కరోనా మహమ్మారి దెబ్బకు దేశవ్యాప్తంగా సినీ లోకం అల్లాడిపోతోంది. మొత్తం స్తంభించిపోయి షూటింగ్ లన్నీ ఆపేసుకుని కూర్చుంటే.. అరవై ఏళ్ల బాలయ్య మాత్రం షూటింగ్ మొదలుపెట్టడానికి తెగ ఆవేశ పడుతున్నాడు. ఇప్పటికే స్టార్ హీరోలందరూ ఈ సంవత్సరం మొత్తం తమ షూటింగ్ షెడ్యూల్స్ ను మరియు విదేశీ షెడ్యూల్‌ లను పూర్తిగా రద్దు చేసుకున్నారు. అయినప్పటికీ బాలయ్య మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు.

    Also Read: రూ. 200 కోట్లతో ఎన్టీఆర్ మూవీ?

    సినిమాలోని ప్రీ క్లైమాక్స్ కు వచ్చే ఓ సీక్వెన్స్ ను విస్తృతంగా షూట్ చేయాలి. ఆ సీక్వెన్స్ కథకు చాలా కీలకమైనదట.
    అందుకే ఎట్టి పరిస్థితుల్లో ఆ సీక్వెన్స్ ను ఇప్పుడే షూట్ చేసేద్దాం అంటున్నాడు బాలయ్య. బాలయ్యకి ఆ సీక్వెన్స్ బాగా నచ్చిందని.. ఎప్పుడెప్పుడూ ఆ సీక్వెన్స్ లో నటించాలా అని ఎప్పటి నుండో బాగా ఆత్రుతగా ఉంటున్నాడట. మరి ఇప్పుడు బోయపాటి బృందం ఏమి చేస్తోందో.. ఏది ఏమైనా జాగ్రత్తగా డీల్ చేయకపోతే కరోనా ఎఫెక్ట్ కంటే ముందు, వారికి బాలయ్య ఎఫెక్ట్ తగులుతుంది. అన్నట్టు ఈ సినిమాని మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించనుండగా తమన్ సంగీతం సమకూరుస్తున్నాడు.