https://oktelugu.com/

Venkatesh: వెంకీ వలన ఆ స్టార్ హీరోకు రెండు సార్లు స్ట్రోక్… మూడోసారి కూడా సీన్ రిపీట్ కానుందా…

స్టార్ హీరోలు వెంకటేష్ మరియు బాలకృష్ణ చాలా సార్లు సంక్రాంతి బరిలో నిలిచిన సంగతి అందరికీ తెలిసిందే. ఇక రాబోయే సంక్రాంతికి కూడా ఈ ఇద్దరు స్టార్ హీరోలు పోటీ పడనున్నారు. గతంలో రెండుసార్లు హీరో వెంకటేష్ వలన బాలకృష్ణకు గట్టిగా స్ట్రోక్ తగిలిందని చెప్పడంలో సందేహం లేదు.

Written By:
  • Mahi
  • , Updated On : December 26, 2024 / 02:18 PM IST

    Venkatesh

    Follow us on

    Venkatesh: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం సక్సెస్ ఫుల్ గా దూసుకెళ్తున్న సీనియర్ హీరోలలో విక్టరీ వెంకటేష్, నందమూరి బాలకృష్ణ కూడా ఒకరు. తన సినిమా కెరియర్ లో విక్టరీ వెంకటేష్ ఇప్పటివరకు ఎక్కువగా ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాలలో నటించి ఎన్నో సూపర్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నారు.విక్టరీ వెంకటేష్ ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రెస్ గా నిలిచారు అని చెప్పడం లో సందేహం లేదు.అంతగా ఆయన సినిమాలు ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అవుతాయి. వెంకటేష్ తన ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాలతో ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా దగ్గరయ్యారు. ఇప్పటివరకు వెంకటేష్ నటించిన ఎన్నో సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఇది ఇలా ఉంటే టాలీవుడ్ లో నందమూరి నటసింహం బాలకృష్ణ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాలకృష్ణ కూడా తన సినిమా కెరియర్ లో ఇప్పటివరకు చాలా బ్లాక్ బస్టర్ సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. అయితే బాలకృష్ణ ఎక్కువ శాతం మాస్ ,యాక్షన్ సినిమాలలో నటించి మాస్ హీరోగా మంచి గుర్తింపును మరియు క్రేజ్ ను సొంతం చేసుకున్నారు. ఈ ఇద్దరు స్టార్ హీరోలు వెంకటేష్ మరియు బాలకృష్ణ చాలా సార్లు సంక్రాంతి బరిలో నిలిచిన సంగతి అందరికీ తెలిసిందే. ఇక రాబోయే సంక్రాంతికి కూడా ఈ ఇద్దరు స్టార్ హీరోలు పోటీ పడనున్నారు. గతంలో రెండుసార్లు హీరో వెంకటేష్ వలన బాలకృష్ణకు గట్టిగా స్ట్రోక్ తగిలిందని చెప్పడంలో సందేహం లేదు. 2000 వ సంవత్సరంలో నందమూరి బాలకృష్ణ నటించిన వంశోద్ధారకుడు అనే సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

    ఇక అదే సంవత్సరం వెంకటేష్ నటించిన కలిసుందాం రా సినిమా కూడా సంక్రాంతి కానుకగా విడుదల అయింది. ఆ సంవత్సరం సంక్రాంతి బరిలో నిలిచిన వంశోద్ధారకుడు, కలిసుందాం రా సినిమాలలో బాలకృష్ణ నటించిన వంశోద్ధారకుడు సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదని తెలుస్తుంది. బాక్స్ ఆఫీస్ దగ్గర వెంకటేష్ నటించిన కలిసుందాం రా సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకొని సంక్రాంతి బరిలో హిట్టు సాధించింది. ఇక 2019 సంవత్సరంలో కూడా హీరో బాలకృష్ణ నటించిన ఎన్టీఆర్ కథానాయకుడు సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

    ఇక అదే సంవత్సరం వెంకటేష్ హీరోగా నటించిన ఎఫ్2 సినిమా కూడా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సంవత్సరం కూడా హీరో బాలకృష్ణకు సంక్రాంతికి చేదు అనుభవం మిగిలిందని చెప్పడంలో సందేహం లేదు. వెంకటేష్ నటించిన ఎఫ్2 సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ విజయం సాధించింది. ఇక ప్రస్తుతం వచ్చే ఏడాది సంక్రాంతికి బాలకృష్ణ మరియు వెంకటేష్ నటించిన సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఇక రాబోయే ఈ సంక్రాంతి బరిలో ఏ హీరో ఖాతాలో హిట్ పడుతుందో వేచి చూడాల్సి ఉంది.