YEAR ENDER 2024: ఇంకొన్ని రోజుల్లో 2024 పూర్తి కాబోతుంది. ఈ ఏడాది కొందరికి కలసి వస్తే మరికొందరికి విషాదాన్ని మిగిల్చింది. ఈ ఏడాదిలో చాలా మంది పెళ్లిళ్లు చేసుకోవడం, కెరీర్, వ్యాపారాల్లో కొందరు ప్రముఖులు మంచి గుర్తింపు తెచ్చుకుంటే.. మరికొందరు మాత్రం ఈ ఏడాది మరణించారు. అనారోగ్య సమస్యల కారణంగా కొందరు ఈ ఏడాది ఎందరో ప్రముఖులు మృతి చెందారు. కేవలం ఒక రంగానికి చెందిన వారే కాకుండా సినీ ప్రముఖులు, వ్యాపారులు ఇలా వేర్వేరు రంగాల నుంచి ప్రముఖులు మరణించారు. మరి ఈ ఏడాది మరణించిన ప్రముఖులు ఎవరెవరో ఈ ఆర్టికల్‌లో చూద్దాం.
రతన్ టాటా
టాటా సన్స్ మాజీ ఛైర్మన్ రతన్ టాటా ఈ ఏడాది అక్టోబర్‌లో మృతి చెందారు. అనారోగ్య సమస్యల కారణంగా ముంబైలోని బ్రీచ్ కాండీ హాస్పిటల్‌లో చేరారు. చికిత్స తీసుకుంటూనే అక్కడ రతన్ టాటా మరణించారు. రతన్ టాటా మరణంతో యావత్తు భారత్ శోకసంద్రంలోకి మునిగిపోయింది. భారత గొప్ప పారిశ్రామిక వేత్తను కోల్పోవడంతో భారత్ దేశం మొత్తం బాధపడింది.
జాకీర్ హుస్సేన్
ప్రముఖ భారతీయ తబలా విద్వాంసుడు జాకీర్ హుస్సేన్ డిసెంబర్ శాన్ ఫ్రాన్సిస్కోలో మరణించారు. అనారోగ్య సమస్యల కారణంగా జాకీర్ హుస్సేన్ మృతి చెందారు. ఇతను తన కెరీర్‌లో మొత్తం నాలుగు గ్రామీ అవార్డులను గెలుచుకున్నారు. ఎన్నో సంగీత కార్యక్రమాలు నిర్వహించారు. ఇతనికి భారత ప్రభుత్వం పద్మశ్రీ (1988), పద్మ భూషణ్ (2002), పద్మవిభూషణ్ (2023), సంగీత నాటక అకాడమీ అవార్డు (1990), ఫెలోషిప్ (2018) వంటి అవార్డులతో సత్కరించింది.
శ్యామ్ బెనగల్
ప్రముఖ డైరెక్టర్ అయిన శ్యామ్ బెనగల్ ఇటీవల మృతి చెందారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న అతను ముంబైలో మరణించారు. హైదరాబాద్‌కి చెందిన శ్యామ్ బెనగల్ బాలీవుడ్‌లో దిగ్గజ సినిమాలను తీశాడు. మొదటి సినిమాతోనే అందరిని ఆకర్షించాడు. అంకుర్ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి బ్లాక్ బ్లస్టర్ సినిమాలను తీశాడు.
మొగిలయ్య
బలగం మొగిలయ్య గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వేణు డైరెక్షన్‌లో వచ్చిన బలగం మూవీ ఎంత హిట్ అయ్యిందో తెలిసిందే. ఇందులో చివరిలో పాడిన పాటతో మొగిలయ్య మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. అనారోగ్య సమస్యల కారణంగా ఇటీవల వరంగల్‌లో మృతి చెందారు.
గద్దర్
ప్రజాగాయకుడు గద్దర్ ఆగస్టులో మృతి చెందారు. అనారోగ్య కారణాల వల్ల చికిత్స పొందుతూ మరణించారు తన పాటతో గద్దర్ అందరినీ మెప్పించాడు. తెలంగాణ ఉద్యమంలో పాటల ద్వారా తెలిపేవారు.
రామోజీరావు
ఈనాడు సంస్థల అధినేత, రామోజీ ఫిల్మ్ సిటీ స్థాపకుడు రామోజీ రావు ఈ ఏడాది జూన్‌లో మరణించారు. ఎన్నో చిత్రాలను నిర్మించడంతో పాటు ఈనాడు సంస్థలను స్థాపించి ఉన్నత స్థాయికి తీసుకెళ్లారు.