Balakrishna And Prabhas
Balakrishna And Prabhas: టాప్ సెలబ్రిటీస్ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయడం పై పోలీసులు వరుసగా కేసులు నమోదు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 25 మందిపై పోలీస్ కేసులు నమోదు చేసారు. బిగ్ బాస్ సీజన్ 8(Bigg Boss Telugu *) కంటెస్టెంట్స్ దగ్గర నుండి విజయ్ దేవరకొండ(Vijay Devarakonda), ప్రకాష్ రాజ్(Prakash Raj), రానా దగ్గుబాటి(Rana Daggubati) రేంజ్ స్టార్స్ వరకు ఈ లిస్ట్ లో ఉన్నారు. ఎవరికి వారు తమ వివరణ సోషల్ మీడియా ద్వారా ఇచ్చారు కానీ, పోలీసులు మాత్రం యాక్షన్ తీసుకునే దాకా ఊరుకునేలా లేరు. ఎంత పెద్ద సినీ సెలబ్రిటీ అయినా, వెనుక ఎంత పెద్ద రాజకీయ బ్యాక్ గ్రౌండ్ ఉన్నా పోలీసులు అసలు వెనకాడడం లేదు. కేసు నమోదైన 25 మందిలో వైసీపీ పార్టీ కి చెందిన యాంకర్ శ్యామల కూడా ఉంది. ఇప్పుడు అధికార పార్టీ లో ఉన్న తెలుగు దేశం పార్టీ కి చెందిన, హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) కూడా ఈ బెట్టింగ్ యాప్ కేసు లో చిక్కుకున్నాడు.
Also Read: పూరి జగన్నాధ్ విజయ్ సేతుపతి కాంబోలో రానున్న సినిమా స్టోరీ ఇదేనా..?
ప్రముఖ ఓటీటీ సంస్థకు ఆయన వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఒక టాక్ షోలో బెట్టింగ్ యాప్స్ కి సంబంధించిన యాప్ ప్రమోషన్ కూడా ఉంది. అంతే కాకుండా ఆ షోలో అతిథులుగా పాల్గొన్న ప్రభాస్(Rebel Star Prabhas), గోపీచంద్(Gopichand) లు Fun88 అనే చైనీజ్ బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేసారని, మారేడ్ పల్లి పోలీస్ స్టేషన్ లో రామారావు ఇమ్మనేని అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేసారు. బెట్టింగ్ యాప్స్ ప్రొమోషన్స్ ద్వారా వీళ్ళు రాష్ట్రంలోని లక్షలాది మందిని మోసం చేసారని, పైన పేర్కొన్న వ్యక్తులపై సమాచార సాంకేతిక చట్టం లోని సెక్షన్స్ కింద కేసుని నమోదు చేయాలని రామారావు ఫిర్యాదు లో పేర్కొన్నారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియా లో సెన్సేషనల్ టాపిక్ గా మారింది.
ప్రభాస్, గోపీచంద్, బాలయ్య ఎప్పుడూ కూడా ఉద్దేశపూర్వకంగా ప్రమోట్ చేయడం మేమెప్పుడూ చూడలేదని అభిమానులు సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు. హైదరాబాద్ లో తిరిగే మెట్రో ట్రైన్స్ పై బహిరంగంగా బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్నారు, ప్రభుత్వానికి సంబంధించిన మెట్రో మీదనే అలాంటి ప్రొమోషన్స్ చేస్తుంటే , ఇక సెలబ్రిటీలకు అవి ప్రమోట్ చేయడం తప్పు అని ఎలా తెలుస్తుంది? అంటూ ఇటీవలే యంగ్ హీరోయిన్ అనన్య నాగేళ్ల ఇన్ స్టాగ్రామ్ లో రెస్పాన్స్ ఇచ్చింది. మెట్రో పై బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్న ఫోటోని కూడా ఆమె ఈ సందర్భంగా షేర్ చేసింది. ఇది సెలబ్రిటీలకు బ్రహ్మాస్త్రం గా మారింది. భవిష్యత్తులో దీనిపై సెలబ్రిటీలు తిరుగుబాటు చేసి ప్రభుత్వాన్ని ప్రశ్నించినా ఆశ్చర్యపోనక్కర్లేదు అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.