https://oktelugu.com/

Balagam Director Venu: స్టార్ హీరో కి దర్శకత్వం వహించే ఛాన్స్ కొట్టేసిన ‘బలగం’ డైరెక్టర్ వేణు..ఇక అతని టైం స్టార్ట్ అయ్యినట్టే!

తెలంగాణ పల్లెల్లో సంస్కృతి మరియు సంప్రదాయాలను ఎంత నిక్కచ్చిగా ఫాలో అవుతారు అనేది కూడా చూపించాడు. ఆయన ప్రతిభ కి తార్కాణం లాగ నిల్చిన 'బలగం' సినిమాని చూసి మెగాస్టార్ చిరంజీవి లాంటి వాళ్ళు కూడా వేణు ని ప్రత్యేకంగా అభినందించారు.ఇప్పుడు వేణు కి డైరెక్టర్ గా అవకాశాల వెల్లువ కురుస్తుంది.

Written By:
  • Vicky
  • , Updated On : May 6, 2023 / 07:41 AM IST
    Follow us on

    Balagam Director Venu: జబర్దస్త్ కమెడియన్ గా మంచి పాపులారిటీ మరియు క్రేజ్ ని దక్కించుకున్న వేణు, రీసెంట్ గానే ‘బలగం’ అనే చిత్రం తో దర్శకుడిగా మారి భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. వేణు లో ఇంత గొప్ప టాలెంట్ దాగుందా అని ప్రేక్షకులతో పాటుగా ఇండస్ట్రీ మొత్తం షాక్ అయ్యారు. చిన్నతనం నుండి తను పుట్టి పెరిగిన ఊరు లోని సంప్రదాయాలను, బంధాలు మరియు ఎమోషన్స్ ఎలా ఉంటాయి అనేది కళ్ళకి కట్టినట్టు చూపించారు.

    తెలంగాణ పల్లెల్లో సంస్కృతి మరియు సంప్రదాయాలను ఎంత నిక్కచ్చిగా ఫాలో అవుతారు అనేది కూడా చూపించాడు. ఆయన ప్రతిభ కి తార్కాణం లాగ నిల్చిన ‘బలగం’ సినిమాని చూసి మెగాస్టార్ చిరంజీవి లాంటి వాళ్ళు కూడా వేణు ని ప్రత్యేకంగా అభినందించారు.ఇప్పుడు వేణు కి డైరెక్టర్ గా అవకాశాల వెల్లువ కురుస్తుంది.

    రీసెంట్ గానే ఆయన న్యాచురల్ స్టార్ నాని ని కలిసి ఒక అద్భుతమైన కథని వినిపించాడట, నాని ఆ కథ విన్న తర్వాత భావోద్వేగానికి లోనై, ఈ సినిమా మనం తప్పకుండ చేస్తున్నాము, ఫుల్ బౌండెడ్ స్క్రిప్ట్ ని సిద్ధం చెయ్యి,నాకు ఉన్న కమిట్మెంట్స్ పూర్తి అవ్వగానే ఈ సినిమాకి డేట్స్ ఇస్తాను అన్నాడట.

    ఇప్పుడు వేణు ఆ స్క్రిప్ట్ ని డెవెలప్ చేసే పనిలో నిమగ్నమై ఉన్నాడట. కొత్త టాలెంట్ ని ప్రోత్సహించడం లో ఎప్పుడూ ముందు ఉండే నాని, ఈ ఏడాది ‘దసరా’ అనే చిత్రం ద్వారా టాలీవుడ్ కి శ్రీకాంత్ ఓడేలా లాంటి టాలెంట్ ఉన్న డైరెక్టర్ ని ఇండస్ట్రీ కి పరిచయం చేసాడు.ఈ డైరెక్టర్ స్కిల్స్ ని చూసి విమర్శకులు సైతం నోరెళ్లబెట్టారు.ఇప్పుడు వేణు లాంటి టాలెంట్ ఉన్న డైరెక్టర్ ని కూడా నాని ప్రోత్సహిస్తున్నాడు.ఈ సినిమా కూడా ‘దసరా’ లాగ హిట్ అయితే వేణు కెరీర్ డైరెక్టర్ గా ఎవ్వరూ ఊహించని రేంజ్ కి చేరుకుంటుందని చెప్పడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.