Ustad Bhagat Singh Teaser: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ టీజర్ లో ఉండబోయ్యే ముఖ్యమైన హైలైట్స్ ఇవే!

బ్లాక్ బస్టర్ కాంబినేషన్ నుండి వస్తున్న సినిమా కావడం తో ఈ మూవీ పై కేవలం ఫ్యాన్స్ లోనే కాదు, ఆడియన్స్ లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలను అందుకునేందుకు డైరెక్టర్ హరీష్ శంకర్ ఎలాంటి కృషి చెయ్యబోతున్నాడో ఈ గ్లిమ్స్ తో ఒక ఉదాహరణగా ఫ్యాన్స్ కి చూపించబోతున్నాడట.

Written By: Vicky, Updated On : May 6, 2023 7:37 am

Ustad Bhagat Singh Teaser

Follow us on

Ustad Bhagat Singh Teaser: ‘పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు హరీష్ శంకర్ కాంబినేషన్ లో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ అనే చిత్రం తెరకెక్కుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇటీవలే రెగ్యులర్ షూటింగ్ ని ప్రారంభించుకొని మొదటి షెడ్యూల్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్రం, ఇప్పుడు రెండవ షెడ్యూల్ కి సిద్ధం అవ్వబోతుంది. ఇది ఇలా ఉండగా ఈ సినిమాకి సంబంధించిన చిన్న గ్లిమ్స్ వీడియో ని ఈ నెల 11 వ తేదీ గబ్బర్ సింగ్ రిలీజ్ అయ్యి 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా విడుదల చేయబోతున్నామని మైత్రీ మూవీ మేకర్స్ ట్విట్టర్ ద్వారా అధికారిక ప్రకటన చేసారు.

బ్లాక్ బస్టర్ కాంబినేషన్ నుండి వస్తున్న సినిమా కావడం తో ఈ మూవీ పై కేవలం ఫ్యాన్స్ లోనే కాదు, ఆడియన్స్ లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలను అందుకునేందుకు డైరెక్టర్ హరీష్ శంకర్ ఎలాంటి కృషి చెయ్యబోతున్నాడో ఈ గ్లిమ్స్ తో ఒక ఉదాహరణగా ఫ్యాన్స్ కి చూపించబోతున్నాడట.

ముందుగా గ్లిమ్స్ ప్రారంభం లో గబ్బర్ సింగ్ 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ సినిమాలో నుండి కొన్ని షాట్స్ ని చూపిస్తారట.ఆ తర్వాత ‘ఇప్పుడే మొదలైంది’ దగ్గర నుండి ప్రారంభించి, ‘మళ్ళీ మొదలైంది’ అనే టైటిల్ తో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గ్లిమ్స్ వస్తుందట. ఈ గ్లిమ్స్ లో పవన్ కళ్యాణ్ రెండు పవర్ డైలాగ్స్ మరియు యాక్షన్ షాట్ కూడా ఉండబోతుందట, గబ్బర్ సింగ్ టీజర్ అప్పుడు ఫ్యాన్స్ కి ఎలాంటి అనుభూతి అయితే కలిగిందో, దానికి మించేలా ఈ గ్లిమ్స్ వీడియో ఉండబోతుందని సమాచారం.

మరి ఈ రేంజ్ లో నిజంగా గ్లిమ్స్ వీడియో ఉందా లేదా అనేది తెలియాలంటే మరో వారం రోజులు ఆగాల్సిందే. ఈ వీడియో కి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రికార్డు స్థాయి వ్యూస్ మరియు లైక్స్ ని రప్పించేందుకు ఇప్పటి నుండే సన్నాహాలు మొదలు పెట్టారు. ఈ గ్లిమ్స్ వీడియో తో వాళ్ళు ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేయబోతున్నారో చూడాలి.