అరె.. ఇంకా ఈ రేంజ్ ఫాలోయింగ్ ఉందా ?

మొత్తానికి చాల సంవత్సరాల తరువాత బాలయ్య తన పంజా రుచి చూపించాడు. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను డైరెక్షన్ లో వస్తోన్న మూడో సినిమా ‘అఖండ’ నుండి నిన్న చిన్నపాటి టీజర్ ను వదిలారు. అయితే అనూహ్యంగా రిలీజ్ అయిన ఈ టీజర్ అదరగొట్టింది. బాలయ్య అభిమానులతో పాటు యావత్తు ప్రేషకులను ఆకట్టుకుంది. బాలయ్యకి స్టార్ డమ్ ఉన్నా… బాలయ్య సినిమాలు ఈ మధ్య ఒక స్టార్ హీరో సినిమాల లాగా చలామణి అవ్వడం లేదు. దాంతో […]

Written By: Bhaskar, Updated On : April 14, 2021 2:45 pm
Follow us on


మొత్తానికి చాల సంవత్సరాల తరువాత బాలయ్య తన పంజా రుచి చూపించాడు. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను డైరెక్షన్ లో వస్తోన్న మూడో సినిమా ‘అఖండ’ నుండి నిన్న చిన్నపాటి టీజర్ ను వదిలారు. అయితే అనూహ్యంగా రిలీజ్ అయిన ఈ టీజర్ అదరగొట్టింది. బాలయ్య అభిమానులతో పాటు యావత్తు ప్రేషకులను ఆకట్టుకుంది. బాలయ్యకి స్టార్ డమ్ ఉన్నా… బాలయ్య సినిమాలు ఈ మధ్య ఒక స్టార్ హీరో సినిమాల లాగా చలామణి అవ్వడం లేదు. దాంతో బాలయ్య పని అయిపొయింది అనుకున్నారు అంతా. ఇక బోయపాటి చేస్తోన్న ఈ సినిమాని కూడా పెద్దగా ఎవ్వరూ పట్టించుకోరు అనుకున్నారు.

కానీ అందుకు విరుద్ధంగా అఖండ టీజర్ ఒక రేంజ్ లో దూసుకుపోతుంది. సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అసలు బాలయ్యకి ఇంకా ఈ రేంజ్ ఫాలోయింగ్ ఉందా అని ట్రేడ్ వర్గాలు షాక్ అవుతున్నాయట. మొత్తానికి తనకు సరైన సినిమా పడితే.. రికార్డ్స్ ను బ్రేక్ చేయగల సత్తా తనలో ఉందని బాలయ్య నిరూపించాడు ఈ ‘అఖండ’ టీజర్ తో. ఇక టీజర్ లో బాలయ్య నుండి వైవిధ్యంతో పాటు బాలయ్య గెటప్ సెటప్ అందరిపోయాయి. అయితే ఇప్పుడు ఈ టీజర్ భారీ హిట్ అవ్వడం బాలయ్యకు కొత్త సమస్య తెచ్చి పెట్టింది.

బాలయ్య ఇక కేవలం సినిమాల్లో నటించడం బెటర్ అని, ఆయనకు రాజకీయాలు అనవసరం అంటూ బాలయ్య అభిమానులే అభిప్రాయపడుతున్నారు. టీడీపీ నేతగా బాలయ్య ఎప్పుడూ ప్రభావం చూపలేదు అని ఫ్యాన్స్ కూడా ఫీల్ అవుతున్నారు. అలాగే తమ ఎమ్మెల్యేగా నందమూరి బాలకృష్ణ పై నియోజకవర్గ ప్రజల్లో కూడా ఇవే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయట.

మరి తెలుగుదేశం పార్టీ శ్రేణులదీ కూడా ఇదే అభిప్రాయం అయితే, ఇక బాలయ్య రాజకీయాలు వదిలేసి..సినిమాలు చేసుకోవడం బెటర్. కానీ ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి ఊపిరిలూదాల్సిన బాద్యత బాలకృష్ణ మీదనే ఉన్నా.. ఎందుకో రాజకీయాల పై మాత్రం బాలయ్య తన మార్క్ ను చూపించలేకపోతున్నాడనేది వాస్తవమే.