https://oktelugu.com/

Acharya: చిరు, చరణ్ ను భయపెడుతున్న బ్యాడ్ సెంటిమెంట్.. ఆచార్య విషయంలో ఆందోళన

Acharya: సినిమా రంగం అనేది హిట్, ఫ్లాప్ అనే సెంటిమెంట్ చుట్టూ తిరుగుతుంది. ఓ సినిమా హిట్ అయిందంటే ఆ మూవీ విషయంలో పనిచేసిన సెంటిమెంట్లను తర్వాత సినిమాలకు కంటిన్యూ చేస్తుంటారు మన స్టార్ హీరోలు. అదే ఒక సినిమా ఫ్లాప్ అయితే మాత్రం ఆ మూవీ విషయంలో జరిగిన సెంటిమెంట్లను తర్వాత సినిమా విషయాల్లో జరగకుండా జాగ్రత్త పడుతున్నారు. ప్రస్తుతం భారీ అంచనాలతో రిలీజ్ కాబోతున్న ఆచార్య మూవీ విషయంలో కూడా కొన్ని గుడ్, బ్యాడ్ […]

Written By:
  • Mallesh
  • , Updated On : April 13, 2022 / 01:01 PM IST
    Follow us on

    Acharya: సినిమా రంగం అనేది హిట్, ఫ్లాప్ అనే సెంటిమెంట్ చుట్టూ తిరుగుతుంది. ఓ సినిమా హిట్ అయిందంటే ఆ మూవీ విషయంలో పనిచేసిన సెంటిమెంట్లను తర్వాత సినిమాలకు కంటిన్యూ చేస్తుంటారు మన స్టార్ హీరోలు. అదే ఒక సినిమా ఫ్లాప్ అయితే మాత్రం ఆ మూవీ విషయంలో జరిగిన సెంటిమెంట్లను తర్వాత సినిమా విషయాల్లో జరగకుండా జాగ్రత్త పడుతున్నారు. ప్రస్తుతం భారీ అంచనాలతో రిలీజ్ కాబోతున్న ఆచార్య మూవీ విషయంలో కూడా కొన్ని గుడ్, బ్యాడ్ సెంటిమెంట్లు ఉన్నాయి.

    Acharya

    ముందుగా గుడ్ సెంటిమెంట్ల విషయానికొస్తే డైరెక్టర్ కొరటాల శివ ఇప్పటివరకు అపజయమెరుగని దర్శకుడిగా దూసుకుపోతున్నారు. రాజమౌళి తర్వాత ఆ రేంజ్ లో విజయాలను అందుకుంటున్న దర్శకుడు ఆయనే. ఈ సెంటిమెంట్ ఆచార్యకు కూడా పనికొస్తుందని మెగా ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఇందులో రామ్ చరణ్ నటిస్తున్న సిద్ధ పాత్ర చనిపోతుందని టాక్. గతంలో రామ్ చరణ్ చేసిన ఎవడు, మగధీర సినిమాలో కూడా చనిపోయి పాత్రలో నటించారు. ఆ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాయి. ఆ సెంటిమెంట్ ఇప్పుడు కలిసొస్తుందని అనుకుంటున్నారు.

    ఇక హీరోయిన్ల విషయానికి వస్తే కాజల్ అగర్వాల్, చిరంజీవి కాంబినేషన్ లో వచ్చిన ఖైదీ నెంబర్ 150 సూపర్ హిట్ అయింది. అంతకు ముందు రామ్ చరణ్ తో ఆమె చేసిన మగధీర, నాయక్ సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. రంగస్థలం సినిమాలో పూజా హెగ్డే ఐటెం సాంగ్ చేయగా ఆ మూవీ కూడా మంచి హిట్ కొట్టింది. కాబట్టి ఈ హీరోయిన్లు మెగా ఫ్యామిలీకి గోల్డెన్ లెగ్ గా ఉన్నారు. ఆ సెంటిమెంట్ ఇప్పుడు పనికి వస్తుందేమో అని భావిస్తున్నారు.

    Acharya

    ఇక అసలు సిసలైన బ్యాడ్ సెంటిమెంట్ విషయానికి వస్తే.. రాజమౌళితో సినిమా చేసిన తర్వాత ఏ స్టార్ హీరో కూడా ఇప్పటివరకు తన తర్వాతి సినిమాతో హిట్ కొట్టలేదు. ప్రస్తుతం ఆర్.ఆర్ ఆర్ మూవీతో సెన్సేషనల్ హిట్ కొట్టిన రామ్ చరణ్.. ఇప్పుడు ఆచార్యతో రాబోతున్నాడు. దీంతో ఆ బ్యాడ్ సెంటిమెంట్ ఇప్పుడు కంటిన్యూ అవుతుందేమో అని మెగా ఫ్యాన్స్ భయపడుతున్నారు.

    అయితే ట్రైలర్ చూస్తే కొరటాల శివ ఈ మూవీని అద్భుతంగా తెరకెక్కించాడని అర్థమవుతోంది. ఇప్పటివరకు ఆయన తెరకెక్కించిన సినిమాల్లో కథ కీలకంగా ఉంది. ఇప్పుడు ఆచార్య మూవీ విషయంలో కూడా ఆయన ఎంతో జాగ్రత్త తీసుకున్నట్లు అర్థమవుతుంది. మరి ఈ సినిమాతో ఆ బ్యాడ్ సెంటిమెంట్ కు బ్రేక్ పడుతుందో లేదో అనేది చూడాలి.

    Tags