Bad news for Pawan Kalyan fans: పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu) మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రొమోషన్స్ లో ఫుల్ బిజీ గా ఉన్నారు. నిన్న హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ని కూడా విజయవంతంగా నిర్వహించారు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది కానీ, మేకర్స్ ఓవర్సీస్ కి పంపాల్సిన సినిమా కంటెంట్ ని ఇంకా పూర్తి స్థాయిలో పంపలేదట. ఫస్ట్ హాఫ్ కి సంబంధించిన కంటెంట్ ని నిన్ననే డెలివరీ చేశారట. కానీ సెకండ్ హాఫ్ మాత్రం ఇంకా కొన్ని చిన్న చిన్న మార్పులు చేర్పులు చేసి పంపుతున్నారట. మరో రెండు గంటల్లోపు సెకండ్ హాఫ్ కంటెంట్ డెలివరీ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ సమయానికి డెలివరీ జరగకపోతే ప్రీమియర్ షోస్ కొన్ని రద్దు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇదే ఇప్పుడు ఓవర్సీస్ ఫ్యాన్స్ ని టెన్షన్ పెడుతున్న విషయం.
ప్రస్తుతానికి ప్రీమియర్ షోస్ కి 15 వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోయాయి. గ్రాస్ 4 లక్షల 50 వేల వరకు వచ్చింది. ఎలాంటి ప్రీమియర్ షోస్ అదనంగా షెడ్యూల్ చేయకపోయినా కూడా నిన్న ఒక్క రోజే ఈ చిత్రానికి లక్ష డాలర్లకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇది సాధారణమైన విషయం కాదు. ఇప్పటి వరకు కేవలం 1200 షోస్ ని మాత్రమే షెడ్యూల్ చేసి ఉన్నారు. కంటెంట్ రాగానే మరో 800 కి పైగా షోస్ ని షెడ్యూల్ చేసే అవకాశం ఉంది. అదే కనుక జరిగితే కచ్చితంగా నార్త్ అమెరికా నుండి 1 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లు వస్తాయని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. మరి ఇది ఎంత వరకు నిజం అవుతుందో చూడాలి. నిన్నటి ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత ఇప్పుడు నార్త్ అమెరికా లో అడ్వాన్స్ బుకింగ్స్ ర్యాంపేజ్ మోడ్ లో ఉన్నాయి.
Also Read: ఒక్క థియేటర్ లో 1000 కేజీల పేపర్లు.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రచ్చ మొదలైంది!
అనుకున్న సమయం లో నేడు కంటెంట్ ని డెలివరీ చేస్తే, కచ్చితంగా రెండు లక్షల 50 వేలకు పైగా గ్రాస్ వసూళ్లు కేవలం ఒక్క రోజులోనే వస్తుందని అంటున్నారు. ఇక అంతా నిర్మాత చేతుల్లోనే ఉంది. ఇదంతా పక్కన పెడితే నేడు సాయంత్రం నుండి అన్ని ప్రాంతాల్లో ప్రీమియర్ షోస్ నుండి, మొదటి రోజు రెగ్యులర్ షోస్ వరకు అడ్వాన్స్ బుకింగ్స్ ని అన్ని యాప్స్ లో పూర్తి స్థాయిలో ప్రారంభిస్తారని తెలుస్తుంది. ముఖ్యంగా సాయంత్రం నాలుగు గంటలకు హైదరాబాద్ మెయిన్ థియేటర్స్ సంధ్య కాంప్లెక్స్ మరియు ప్రసాద్ మల్టీప్లెక్స్ లలో బుకింగ్స్ ప్రారంబిస్తారట. ఇవి ఫ్యాన్స్ లో మంచి డిమాండ్ ఉన్న థియేటర్స్. కాబట్టి బుక్ మై షో ట్రెండ్ వేరే లెవెల్ కి వెళ్తుందని ఆశిస్తున్నారు ఫ్యాన్స్. ఇప్పటికే నైజాం ప్రాంతానికి చెందిన అడ్వాన్స్ బుకింగ్స్ ని డిస్ట్రిక్ట్ యాప్ లో మొదలు పెట్టారు, రెస్పాన్స్ అదిరిపోయింది.
Still awaiting second half content to be sent. Expected to be sent to overseas distributors by early morning Tuesday (US time) and then will need to be shipped to theaters. Very last minute delivery and will need to see how fast shipping can be done. #HHVM https://t.co/wLV3TrvN45
— Venky Box Office (@Venky_BO) July 22, 2025