Fish Venkat Big Heart: ఎన్నో వందల సినిమాల్లో కమెడియన్ గా, క్యారక్టర్ ఆరిస్టుగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ఫిష్ వెంకట్(Fish Venkat), రీసెంట్ గానే అనారోగ్యం తో చనిపోయిన ఘటన యావత్తు సినీ లోకాన్ని శోకసంద్రం లోకి నెట్టేసింది. ఇక్కడ సినీ లోకం అంటే సినిమా ఇండస్ట్రీ కి చెందిన వాళ్ళు కాదు, సినిమాని ఇష్టపడే అభిమానులు అని చెప్పొచ్చు. ఫిష్ వెంకట్ ఇండస్ట్రీ లో ఉన్న అందరి హీరోల సినిమాల్లో నటించాడు. ఒకటి రెండు కూడా కాదు, పాన్ ఇండియన్ సినిమాల ట్రెండ్ మొదలయ్యే ముందు దాదాపుగా ప్రతీ స్టార్ హీరో సినిమాలో కనిపించేవాడు. అలాంటి నటుడు చనిపోతే కనీసం ఒక్కరు కూడా సంతాపం వ్యక్తం చేయకపోవడం దురదృష్టకరం. ఆయన ఇంటికి వెళ్లి చివరి చూపు చూడకపోయినా పర్వాలేదు, కనీసం సోషల్ మీడియా ద్వారా కూడా సంతాపం వ్యక్తం చేయలేదు.
సినిమాకు వంద కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని అందుకునే హీరోలు ఉన్నారు మన ఇండస్ట్రీ లో. పది లక్షలు ఎవరైనా ఫిష్ వెంకట్ కి దానం చేసి ఉండుంటే , ఈరోజు ఆయన బ్రతికి ఉండేవాడు పాపం. హీరోలు కోట్లు పెట్టుకొని కూడా చూపించని మానవత్వం, ఫిష్ వెంకట్ తనకు అనారోగ్యం ఉన్నప్పటికీ కూడా తన తోటి మనిషిని ఆదుకునేందుకు ముందుకు వచ్చాడు. పూర్తి వివరాలోకి వెళ్తే ఫిష్ వెంకట్ ఆరోగ్యం సరిగా లేదని తెలుసుకున్న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan), ఆయన్ని తన ఆఫీస్ కి పిలిపించి రెండు లక్షల రూపాయిలు తన చికిత్స కోసం విరాళం అందించిన సంగతి తెలిసిందే. ఈ డబ్బులను ఫిష్ వెంకట్ తన ఆరోగ్య పరిస్థితిని మెరుగు పరుచుకోవడానికి ఉపయోగిస్తాడేమో అని అంతా అనుకున్నారు. కానీ అది జరగలేదు. తనకు తెలిసిన ఒక వ్యక్తి అనారోగ్యం తో బాధ పడుతున్నాడని తెలుసుకొని పవన్ కళ్యాణ్ ఇచ్చిన రెండు లక్షలు అతనికి ఇచ్చాడట.
Also Read: పవన్ కళ్యాణ్ ఓవర్సీస్ ఫ్యాన్స్ కి చేదువార్త.. నిర్మాత AM రత్నం మామూలోడు కాదు!
కేవలం పవన్ కళ్యాణ్ ఇచ్చిన డబ్బులు మాత్రమే కాదు,తన వద్ద ఉన్నటువంటి మరో రెండు లక్షల రూపాయిలను కూడా ఆయన అతనికి ఇచ్చాడట. ఎంత గొప్ప మనసు ఉంటే ఇలాంటి పని చేస్తాడు చెప్పండి. కిడ్నీ సమస్య ఫిష్ వెంకట్ కి మొదటి నుండి ఉంది. అందుకు ఆయన డయాలసిస్ ట్రీట్మెంట్ ప్రతీ రోజు తీసుకుంటూ ఉండేవాడు అప్పట్లో. అందుకు డబ్బులు చాలా ఖర్చు అయ్యేవి. తనకు ఎంతో అవసరం అయినప్పటికీ కూడా ఎదుటి వ్యక్తి కి సహాయం చెయ్యాలనే విశాల హృదయం ఉన్నోడిని ఆ దేవుడు ఎందుకు తీసుకెళ్లిపోయాడో అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కనీసం ఈ విషయం మన స్టార్ హీరోల వరకు వెళ్తే, కాస్త అయినా ఫిష్ వెంకట్ ని చూసి మారుతారేమో చూద్దాం అని అంటున్నారు.