Samantha second husband Raj: నాగ చైతన్య(Naga Chaitanya) తో విడాకులు తీసుకున్న తర్వాత కొత్త కాలం సింగల్ గా జీవితాన్ని గడిపిన సమంత(Samantha Ruth Prabhu), ఆ తర్వాత ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమోరు(Raj Nidimoru) తో ప్రేమలో పడింది. అతనితో గత కొంతకాలం నుండి డేటింగ్ చేస్తూ వచ్చిన సమంత, నేడు ఉదయం కోయంబత్తూరు లోని ఇషా ఫౌండేషన్ లో పెళ్లి చేసుకుందని విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం. అభిమానులు వీళ్లిద్దరి పెళ్లి ఫోటోల కోసం ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు. సమంత రాజ్ తో డేటింగ్ చేస్తున్నట్టు అభిమానులకు తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా అభిమానులకు ఎన్నో హింట్స్ ఇచ్చింది. విదేశాలకు వీళ్లిద్దరు టూర్స్ కి వెళ్లిన ఫోటోలను కూడా అప్లోడ్ చేస్తూ ఉండేది సమంత. ఇదంతా పక్కన పెడితే, ఇంతకీ ఈ రాజ్ నిడిమోరు ఎవరు?, బాలీవుడ్ దర్శకుడు అంటున్నారు కదా, ఇంతకు ముందు ఆయన తీసిన సినిమాలు, వెబ్ సిరీస్ లు ఏంటి? అనేది ఇప్పుడు మనం చూద్దాం.
రాజ్ నిడిమోరు మన ఆంధ్ర ప్రదేశ్ లోని తిరుపతి ప్రాంతానికి చెందిన వ్యక్తి. 1975 వ సంవత్సరం లో జన్మించిన ఈయన SVU కాలేజీ లో బీటెక్ లో చేరి, కంప్యూటర్ సైన్స్ కోర్స్ లో శిక్షణ పొందాడు. చిన్నతనం నుండి సినిమాల్లోకి రావాలని రాజ్ నిడిమోరు కి కోరిక ఉండేది అట. తన కోరిక ని నెరవేర్చుకునేందుకు ఆయన పడిన కష్టాలు సాధారణమైనవి కావు. బాలీవుడ్ లో అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ని మొదలు పెట్టిన ఆయన, 2002 వ సంవత్సరం లో షాదీ డాట్ కామ్ అనే సినిమా ద్వారా బాగా ఫేమస్ అయ్యాడు. ఇక ఆ తర్వాత పలు తెలుగు, హిందీ సినిమాలను తెరకెక్కించాడు కానీ, అవి ఎందుకో అవి ఆశించిన స్థాయిలో సక్సెస్ అవ్వలేదు. ఎప్పుడైతే ఆయన అమెజాన్ ప్రైమ్ ల ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ చేసాడో, అప్పటి నుండి ఆయ్హన పేరు మారు మ్రోగిపోయింది.
ఫ్యామిలీ మ్యాన్ సీజన్ లో సమంత విలన్ గా నటించిన సంగతి తెలిసిందే. ఈ వెబ్ సిరీస్ సమయం లోనే వీళ్లిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఈ వెబ్ సిరీస్ తర్వాతనే నాగ చైతన్య , సమంత విడాకులు తీసుకున్నారు. కానీ సమంత విడాకుల తర్వాత మయోసిటిస్ వ్యాధికి గురై తీవ్రమైన ఇబ్బంది పడుతున్న సమయం లో ఆమెకు రాజ్ అండగా నిలిచాడు. అప్పుడు వీళ్లిద్దరు మరింత చేరువయ్యారు, నేడు గ్రాండ్ గా పెళ్లి కూడా చేసేసుకున్నారు. ఇక జంట కలియిక రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో చూడాలి.