Baby Movie Collections: మొదటి రోజుని మించిన 5వ రోజు వసూళ్లు..స్టార్ హీరోలకు కూడా సరికొత్త బెంచ్ మార్క్ పెడుతున్న ‘బేబీ’ చిత్రం!

కానీ ఇక్కడ విడుదలైన మూడు రోజుల తర్వాత కూడా అదే రేంజ్ జోరుని కొనసాగిస్తూ ముందుకు దూసుకోవడం అనేది గడిచిన 10 ఏళ్ళల్లో ఎప్పుడూ కూడా జరగలేదు. మొట్టమొదటిసారి ఈ చిత్రం విషయం లోనే జరిగింది. ఈ స్థాయి సక్సెస్ వస్తుందని మేకర్స్ కూడా ఊహించి ఉండరు. విచిత్రం ఏమిటంటే సోమవారం వచ్చిన వసూళ్లు ఆదివారం వచ్చిన వసూళ్లకంటే ఎక్కువ ఉండడమే. ఇలాంటి అద్భుతాలు ఇప్పటి వరకు పొంగల్ సమయం లోనే జరిగేది. మామూలు సమయం లో ఇలాంటి వింత జరగడం ఇదే తొలిసారి.

Written By: Vicky, Updated On : July 18, 2023 4:43 pm

Baby Movie Collections

Follow us on

Baby Movie Collections: బాక్స్ ఆఫీస్ వద్ద ఎన్నడూ చూడండి అద్భుతాలను చూపిస్తూ ట్రేడ్ పండితులు సైతం ఆశ్చర్యపోయే రేంజ్ వసూళ్లను రాబడుతున్న చిత్రం ‘బేబీ’. ఎలాంటి స్టార్ కాస్ట్ లేకుండా ఇలాంటి అద్భుతాలను జరగడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు బేబీ విషయం లో అదే జరుగుతుంది. మొదటి రోజు కంటే రోజు , మూడవ రోజు ఎక్కువ వసూళ్లు రావడం మనం గతం లో చాలానే చూసాము.

కానీ ఇక్కడ విడుదలైన మూడు రోజుల తర్వాత కూడా అదే రేంజ్ జోరుని కొనసాగిస్తూ ముందుకు దూసుకోవడం అనేది గడిచిన 10 ఏళ్ళల్లో ఎప్పుడూ కూడా జరగలేదు. మొట్టమొదటిసారి ఈ చిత్రం విషయం లోనే జరిగింది. ఈ స్థాయి సక్సెస్ వస్తుందని మేకర్స్ కూడా ఊహించి ఉండరు. విచిత్రం ఏమిటంటే సోమవారం వచ్చిన వసూళ్లు ఆదివారం వచ్చిన వసూళ్లకంటే ఎక్కువ ఉండడమే. ఇలాంటి అద్భుతాలు ఇప్పటి వరకు పొంగల్ సమయం లోనే జరిగేది. మామూలు సమయం లో ఇలాంటి వింత జరగడం ఇదే తొలిసారి.

ఇప్పటి వరకు ఈ సినిమాకి 15 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయి. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాకి 5 వ రోజు కూడా అదే జోరు కొనసాగుతుంది. మొదటి రోజు ఈ చిత్రానికి 2 కోట్ల 60 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వస్తే, 5 వ రోజు మూడు కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయట. వర్కింగ్ డేస్ లో ఇలాంటి జోరు స్టార్ హీరోలు సైతం చూపించలేకపోయారు.

యూత్ ఆడియన్స్ ఒక్క సినిమాకి కనెక్ట్ అయితే ఏ స్థాయి వసూళ్లు వస్తాయో చెప్పడానికి ఈ సినిమా ఒక నిదర్శనం. 7 కోట్ల 40 లక్షల రూపాయిల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ ని జరుపుకున్న ఈ సినిమాకి 5 రోజుల్లో 20 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. పెద్ద సినిమాలన్నీ వరుసగా బాధ్జ కొడుతున్న ఈ సమయం లో చిన్న సినిమా అయినా బేబీ ఈ స్థాయి వసూళ్లను రాబట్టడం బయ్యర్స్ కి కాస్త ఉపశమనం కలిగించింది.