Director Sai Rajesh: బేబీ డైరెక్టర్ సాయి రాజేష్ చేసిన పని తెలిస్తే మెచ్చుకోకుండా ఉండలేరు!

దర్శకుడు సాయి రాజేష్ ఈ పోస్ట్ చూసి వెంటనే స్పందించాడు. ఆ పసివాడి వైద్యానికి తన వంతు సాయంగా రూ. 50 వేలు ఆర్థిక సహాయం చేశాడు.

Written By: Shiva, Updated On : August 3, 2023 3:12 pm

Director Sai Rajesh

Follow us on

Director Sai Rajesh: బేబీ చిత్ర దర్శకుడు సాయి రాజేష్ తన ఔదార్యం చాటుకున్నాడు. ఓ కుర్రాడి వైద్యం కోసం వెంటనే ఆర్థిక సహాయం చేశాడు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గల అంబాజీపేట మండలం, గంగలకుర్రు గ్రామానికి చెందిన ఏడాది వయసున్న బాలుడు ప్రమాదవశాత్తు వేడి నూనులో పడ్డాడు. దీంతో తీవ్ర గాయాల పాలయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న మహేష్ బాబు అభిమానులు సోషల్ మీడియాలో ఆదుకోవాలని ట్రెండ్ చేశారు.

దర్శకుడు సాయి రాజేష్ ఈ పోస్ట్ చూసి వెంటనే స్పందించాడు. ఆ పసివాడి వైద్యానికి తన వంతు సాయంగా రూ. 50 వేలు ఆర్థిక సహాయం చేశాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేశాడు. సాయి రాజేష్ ఔదార్యం చూసిన నెటిజెన్స్ కొనియాడుతున్నారు. గొప్పపని చేశారని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

మనకు ఎంత సంపాదన ఉన్నా ఆర్థిక సహాయం చేయాలనే మంచి మనసు ఉండాలి. కోట్లు ఉన్నా ఈ రోజుల్లో కూడబెట్టుకునేవారే కానీ రూపాయి దానం చేసేవాళ్ళు లేరు. సాయి రాజేష్ తనకున్న దాంట్లో ఇలా సహాయం చేశాడు. సాయి రాజేష్ బేబీ చిత్రంతో భారీ విజయం అందుకున్నాడు. చిన్న సినిమాగా విడుదలైన బేబీ రూ. 80 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.

ట్రైయాంగిల్ లవ్ డ్రామాగా బేబీ తెరకెక్కింది. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ ప్రధాన పాత్రలు చేశారు. యూత్ కి కంటెంట్ విపరీతంగా కనెక్ట్ కావడంతో వసూళ్ల వాన కురిసింది. ఎస్కేఎన్ ఈ చిత్ర నిర్మాతగా ఉన్నారు. ఇక సాయి రాజేష్ గతంలో హృదయ కాలేయం అనే చిత్రానికి దర్శకత్వం వహించాడు. తన ఊర్లో కంసాలి పని చేసుకునే నరసింహాచారిని సంపూర్ణేష్ బాబుగా పరిచయం చేశాడు. అప్పట్లో ఈ మూవీ ఓ సెన్సేషన్.