Oo Antava..Oo Oo Antava: ‘ఊ అంటావా…ఊ హూ అంటావా’ అంటూ సమంత చేసిన సాంగ్ పుష్ప సినిమాకే స్పెషల్ అట్రాక్షన్ అయింది. అయితే ఈ ఐటం సాంగ్ లిరిక్స్ పై చాలామంది విమర్శలు చేశారు. పురుషులను కించపరిచేలా ఈ సాంగ్ ఉందని కామెంట్స్ చేశారు. మరికొంతమంది నెటిజన్లు మాత్రం మగాళ్ల గురించి నిజాలను బయట పెట్టింది ఈ సాంగ్ అంటూ సామ్ ను మెచ్చుకున్నారు.

అసలు ఈ పాటలో సాహిత్యాన్ని సమర్థించేవారు కానీ, వ్యతిరేకించి కేసులు వేసేవారు కానీ ఈ పాట పరిధిని దాటి ప్రవర్తిస్తున్నారు అనుకోవచ్చు. ఇలాంటి పాటల విషయంలో అనవసర చర్చలు వృధా. సాహిత్యం అనేది పాత్రలను బట్టి వస్తుంది. అలాగే ఈ పాటలో సాహిత్యాన్ని మాత్రమే కాకుండా పాడిన విధానం. ఇక సింగర్ మూడ్ ను కూడా లెక్కిస్తున్నారు. అలాగే సామ్ ను తెరపై చూపించన విధానం పై కూడా ఫీల్ అవుతున్నారు.
“ఊ అంటావా మావా, ఊఊ అంటావా మావా” అనే పాటను ఒక సైద్ధాంతిక ప్రాతిపదికన సమర్థించడం గానీ, వ్యతిరేకించడం గానీ చేస్తూ పొతే మన సమయమే వృధా అవుతుంది. అయినా ఇలాంటి పాటలు గతంలో కూడా చాలా వచ్చాయి. ఉదాహరణకు “లే లే లే లేలేలే నా రాజా” అంటూ ప్రేమనగర్ లో ఇంతకు మించిన పాట ఉంది.
సరే ఈ మధ్య కాలంలో చూసుకున్నా.. “జిగేలు రాణి” అంటూ రంగస్థలంలో ఓ అదిరిపోయే ఐటమ్ సాంగ్ ఉంది. అయినా ఇలాంటి సాంగ్స్‌లో పాట రాత, తీత అనేది అంతా మగ ప్రేక్షకులకు ఎన్ని రకాలుగా ఊపు తీసుకురావచ్చు అన్న దృష్టితోనే ప్రధానంగా సాగుతుంది. కచ్చితంగా ఇలాంటి పాటల్లో అచ్చంగా బూతుల నుంచి ద్వంద్వార్థాలు వరకూ వినిపిస్తాయి.
Also Read: Writer Movie: సమాజాన్ని రిఫ్లెక్ట్ చేసే కథలే నేను తీస్తా- పా.రంజిత్
ఆత్రేయ, వేటూరి మొదలుకొని చంద్రబోస్ వరకు చాలామంది రచయితలూ ఈ రకం పాటలు రాసి సంప్రదాయవాదుల నుంచి స్త్రీవాదులు వరకూ అన్ని రకాల మేధావి వర్గం నుంచి విమర్శలు మూటగట్టుకున్నవారే. కానీ తెలుగు సినిమా సాహిత్యంలో చాలా రకాల కొత్త ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది. అలాంటి సమయాల్లోనే ఇలాంటి పాటలు వస్తాయి. అందుకే ఇలాంటి పాటలు సర్వసాధారణం.