https://oktelugu.com/

‘అ!’ దర్శకుడికి మాటిచ్చిన చిరంజీవి

టాలీవుడ్‌లో ఈ మధ్య యువ దర్శకుల హవా కొనసాగుతోంది. షార్ట్‌ ఫిల్మ్స్‌తో సత్తా నిరూపించుకొని వెండితెరపై అవకాశాలు దక్కించుకుంటున్నారు. తమ క్రియేటివీతో చిన్న హీరోలనే కాదు పెద్ద హీరోలను కూడా డైరెక్ట్‌ చేస్తున్నారు. ఈ లిస్ట్‌లో సుజీత్‌, ప్రశాంత్‌ వర్మ ముందుంటారు. ‘రన్‌ రాజా రన్‌’తో టాలీవుడ్‌లో అడుగు పెట్టిన సుజీత్‌.. తన సెకండ్‌ మూవీనే ప్రభాస్ తో చేశాడు. ‘సాహో’ను పాన్‌ ఇండియా మూవీగా తెరకెక్కించి శభాష్ అనిపించుకున్నాడు. ఇప్పుడు ‘లూసిఫర్’ రీమేక్‌లో లెజెండ్‌ చిరంజీవిని […]

Written By: , Updated On : July 11, 2020 / 03:35 PM IST
Follow us on


టాలీవుడ్‌లో ఈ మధ్య యువ దర్శకుల హవా కొనసాగుతోంది. షార్ట్‌ ఫిల్మ్స్‌తో సత్తా నిరూపించుకొని వెండితెరపై అవకాశాలు దక్కించుకుంటున్నారు. తమ క్రియేటివీతో చిన్న హీరోలనే కాదు పెద్ద హీరోలను కూడా డైరెక్ట్‌ చేస్తున్నారు. ఈ లిస్ట్‌లో సుజీత్‌, ప్రశాంత్‌ వర్మ ముందుంటారు. ‘రన్‌ రాజా రన్‌’తో టాలీవుడ్‌లో అడుగు పెట్టిన సుజీత్‌.. తన సెకండ్‌ మూవీనే ప్రభాస్ తో చేశాడు. ‘సాహో’ను పాన్‌ ఇండియా మూవీగా తెరకెక్కించి శభాష్ అనిపించుకున్నాడు. ఇప్పుడు ‘లూసిఫర్’ రీమేక్‌లో లెజెండ్‌ చిరంజీవిని డైరెక్ట్‌ చేసే చాన్స్‌ కొట్టేశాడు. మలయాళంలో సూపర్ హిట్‌ అయిన లూసిఫర్ను  తెలుగు నేటివిటీకి తగ్గట్టు మార్పులు చేసిన సుజీత్‌ ఇప్పుడు చిరు డేట్స్‌ కోసం ఎదురు చూస్తున్నాడు. మరోవైపు ‘అ!’ చిత్రంతో దర్శకుడిగా తన ప్రతిభను కనబరిచిన ప్రశాంత్ వర్మ తర్వాత సీనియర్ హీరో రాజశేఖర్ తో ‘కల్కి’ చేసి మెప్పించాడు. ఇప్పుడు ‘కరోనా వ్యాక్సిన్‌’ అనే సినిమా తీస్తున్నాడు. డైరెక్టర్ కాకముందు ప్రశాంత్‌ పలు చిత్రాలకు కథలు అందించి రచయితగా మంచి పేరు తెచ్చుకున్నాడు.అంతేకాదు అతను మెగాస్టార్ చిరంజీవి కూడా కథ వినిపించాడు. ఈ విషయాన్ని ప్రశాంతే స్వయంగా వెల్లడించాడు. కథ నచ్చడంతో సినిమా చేద్దామని చిరు తనకు మాట కూడా ఇచ్చాడని తెలిపాడు. ఇది ‘సైరా నరసింహారెడ్డి’కి ముందే జరిగిందన్నాడు. సైరా కంటే ముందు చిరు చాలా వేగంగా ఓ సినిమా చేయాలని భావించారన్నాడు. కానీ, సైరా కథ కొలిక్కి వచ్చాక ఆ ఆలోచనను విరమించుకున్నాడని తెలిపాడు. కానీ, సైరా చిత్రీకరణ ప్రారంభమవడానికి ముందే చిరుకు తాను కథ వినిపించానని ప్రశాంత్‌ వెల్లడించాడు.

త్వరలోనే ఏపీలో ఉప ఎన్నికలు..!

కథ చాలా బాగుందని చిరు ప్రశంసిచడంతో పాటు తప్పకుండా మూవీ చేద్దాం అని తనకు మాట కూడా ఇచ్చారని తెలిపాడు. దాంతో చిరు నుంచి పిలుపు కోసం ఎదురు చూస్తున్నానని అన్నాడు. మెగాస్టార్ నుంచి ఎప్పుడు పిలుపు వచ్చినా.. సినిమా చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశాడు. కాగా, ఖైదీ నం.150తో రీ ఎంట్రీ ఇచ్చిన చిరు… తర్వాత ‘సైరా’లో స్వాతంత్ర్య సమరయోధుడిగా ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఆ వెంటనే స్టార్ డైరెక్టర్ కొరటాల శివతో ‘ఆచార్య’ చేస్తున్నారు. కరోనా కారణంగా ఈ మూవీ షూటింగ్‌ ఆగిపోయింది. ఇక ‘లూసిఫర్’ రీమేక్‌కు ఓకే చెప్పిన చిరు దాని దర్శకత్వ బాధ్యతలు సుజీత్‌కు అప్పగించారు. ఈ రెండు చిత్రాలు పూర్తయిన తర్వాత ప్రశాంత్‌తో మూవీ చేసే అవకాశం కనిపిస్తోంది.