కేసీఆర్ ఆందోళన అందుకేనా?

సచివాలయం కూల్చివేతలో.. కొత్త సెక్రటేరియట్ నిర్మాణంలో ఆది నుంచి సీఎం కేసీఆర్ కు ఆటంకాలు ఏర్పడుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే ఆయన ఎంత సైలెంట్ గా పనిచేద్దామనుకుంటున్నా ఏదో ఒక వివాదం ఆయనను అప్రతిష్టపాలు చేస్తోంది. తాజాగా హిందుత్వ దెబ్బ సీఎం కేసీఆర్ పై బాగానే పడిందట.. అందుకే అజ్ఞాతంలో ఉన్న ఆయన సచివాలయం కూల్చివేతలో నల్లపోచమ్మ టెంపులపై పెచ్చులు పడ్డాయని విచారం వ్యక్తం చేశారట.. సచివాలయం ఆవరణలో పెద్ద టెంపుల్ కట్టిస్తానని హామీ కూడా ఇచ్చారు. […]

Written By: NARESH, Updated On : July 11, 2020 4:05 pm
Follow us on


సచివాలయం కూల్చివేతలో.. కొత్త సెక్రటేరియట్ నిర్మాణంలో ఆది నుంచి సీఎం కేసీఆర్ కు ఆటంకాలు ఏర్పడుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే ఆయన ఎంత సైలెంట్ గా పనిచేద్దామనుకుంటున్నా ఏదో ఒక వివాదం ఆయనను అప్రతిష్టపాలు చేస్తోంది.

తాజాగా హిందుత్వ దెబ్బ సీఎం కేసీఆర్ పై బాగానే పడిందట.. అందుకే అజ్ఞాతంలో ఉన్న ఆయన సచివాలయం కూల్చివేతలో నల్లపోచమ్మ టెంపులపై పెచ్చులు పడ్డాయని విచారం వ్యక్తం చేశారట.. సచివాలయం ఆవరణలో పెద్ద టెంపుల్ కట్టిస్తానని హామీ కూడా ఇచ్చారు.

సచివాలయం కూల్చివేతకు.. కేటీఆర్ కు లింకేంటీ?

నిజానికి కేసీఆర్ సచివాలయం కూల్చివేతలో భాగంగా గుట్టుచప్పుడు కాకుండా నల్లపోచమ్మ ఆలయం.. పక్కనే ఉన్న మసీదును తెల్లవారుజామున సైలెంట్ గా కూల్చివేయించారు. అయితే ఈ ఆలయం, మసీదు స్థానాల్లో కొత్తవి కట్టిస్తానని హామీ ఇచ్చారు.

మసీదును కట్టిస్తానని కేసీఆర్ హామీ ఇవ్వడంతో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఇప్పటికే సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. అయితే నల్లపోచమ్మ ఆలయం పునర్మిర్నిస్తానని చెప్పినా కూడా బీజేపీ , వీహెచ్.పీ హిందూ సంస్థల నుంచి అలాంటి స్పందన రాలేదు. దీంతోపాటు కేసీఆర్ హిందుత్వ వ్యతిరేకి అని ఆలయం కూలగొట్టగానే సచివాలయ కూల్చివేతకు హైకోర్టులో బ్రేక్ పడిందని బీజేపీ నేతలు ప్రచారం మొదలుపెట్టారు.

ఇప్పటికే హిందువులు బొందువులు అన్నందుకు కేసీఆర్ కు బాగా డ్యామేజ్ జరిగింది. హిందువుల్లోని మెజార్టీ వర్గం ఆగ్రహించింది. ఈ క్రమంలోనే కేసీఆర్ ఇప్పుడు విచారాలు వ్యక్తం చేస్తూ మళ్లీ ఆలయం నిర్మిస్తానంటున్నారు.

జాతీయ స్థాయిలో జగన్ ఇమేజ్ డ్యామేజ్..!

ఇక అన్నింటికంటే ముఖ్యమైనది కొత్త సచివాలయం నమూనా ముస్లిం శైలిలో ఉందంటూ హిందుత్వవాదులు మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే కేసీఆర్, టీఆర్ఎస్, దాని అనుకూల మీడియా తాజాగా కొత్త వాదన మొదలు పెట్టారు. నిజామాబాద్ లోని ప్రముఖ నీల కంఠేశ్వర్ స్వామి ఆలయ నమూనాను పోలి ఉందని హిందుత్వ శైలినే అన్న వాదన తెరపైకి తెచ్చారు. ఇలాంటిది కేవలం ఫ్రాన్స్ లోని వెర్సైల్లెస్ ప్యాలెస్ నమూనాగా మాత్రమే ఉందని ప్రచారం మొదలుపెట్టాయి. ఇది యూరోపియన్ -సారాసెనిక్ శైలి అని వాదిస్తున్నారు.

ఇలా సచివాలయం కూల్చివేత, డిజైన్ తో దెబ్బతిన్న పరువును కవర్ చేయడానికి సీఎం కేసీఆర్ ఆపసోపాలు పడుతున్నాడని గులాబీ పార్టీలో చర్చ జరుగుతుంది.