100 Crore Club Movies: వంద కోట్లు కొల్లగొట్టిన ఆవరేజ్ సినిమాలు

మహేష్ బాబు హీరోగా వచ్చిన మహర్షి సినిమా అంత పెద్దగా నచ్చదు. కానీ సూపర్ డూపర్ హిట్ అయింది.ఈ సినిమాను చూస్తున్నంత సేపు శ్రీమంతుడు, భరత్ అనే నేను సినిమాలు చూస్తున్నామా? లేదా మహర్షినా అనే డౌట్ కూడా వచ్చిందట కొందరికి.

Written By: Suresh, Updated On : October 5, 2023 2:53 pm

100 Crore Club Movies

Follow us on

100 Crore Club Movies: కొన్ని సార్లు స్టార్ హీరోల సినిమాలు కూడా బొక్క బోర్లా పడుతుంటాయి. స్టార్లు అయితే ఏంటి.. ప్రతి ఒక్క సినిమా హిట్ అవ్వాలని ఏమైనా రూల్ ఉందా అనుకుంటున్నారా? అది నిజమే అనుకోండి. కానీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఫుల్ గా ఉంటుంది కాబట్టి హిట్ అనుకోవడంలో తప్పు లేదు. అయినా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమాలే ఈ మధ్య డిజాస్టర్ గా నిలుస్తున్నాయి.. ఈ ఉదాహరణ సరిపోదా అనుకుంటున్నారా? అది నిజమే అనుకోండి.. మరి ఇప్పుడు ఈ మ్యాటర్ ఎందుకు అనుకుంటున్నారా? స్టార్ హీరోల సినిమాలు అందూలోనూ వంద కోట్ల వరకు కలెక్షన్లు సాధించి కూడా నార్మల్ టాక్ ను సొంతం చేసుకున్న సినిమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం…

మహేష్ బాబు హీరోగా వచ్చిన మహర్షి సినిమా అంత పెద్దగా నచ్చదు. కానీ సూపర్ డూపర్ హిట్ అయింది.ఈ సినిమాను చూస్తున్నంత సేపు శ్రీమంతుడు, భరత్ అనే నేను సినిమాలు చూస్తున్నామా? లేదా మహర్షినా అనే డౌట్ కూడా వచ్చిందట కొందరికి. రోటీన్ స్టోరీతో వచ్చిన ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరించి బానే కలెక్షన్లు వచ్చేలా దీవించారు. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ఈ‘మహర్షి’ సినిమాలో గ్లామర్ బ్యూటీ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించగా.. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించారు. దిల్ రాజు, పీవీపీ, అశ్వనీదత్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం తొలిరోజు రికార్డ్ కలెక్షన్లను రాబట్టింది. అంతే అనుకోకండి ఏకంగా సినిమా కలెక్షన్లు ముగిసేసరికి రూ. 200 కోట్లను కొల్లగొట్టింది. ముందు రోజు నుంచే మంచి హైప్ ను సంపాదించిన ఈ సినిమా 20వ రోజు వరకే రూ. 200 వరకు రావడం అంటే మాటలా? కానీ సినిమా మాత్రం ఆవరేజ్ టాక్..

క్రిష్ డైరెక్షన్ లో బాలయ్య హీరోగా వచ్చిన గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా కూడా చూడ్డానికి చాలా బోరింగ్ గా ఉంటుంది. ఆ సినిమాలో డైలాగ్స్ ని మినహాయిస్తే పెద్దగా ఏమీ ఉండదు ఆ స్టోరీ కూడా చాలా బోరింగ్ గా ఉంటుంది.కానీ ఆ సినిమా అప్పటి వరకు బాలయ్య బాబు కెరియర్ లో ఫస్ట్ టైం 50 కోట్లు సాధించిన సినిమాగా హిస్టరీ క్రియేట్ చేసింది.అయినా బాలయ్య సినిమాలు అంటే మినిమమ్ ఉంటాయి.. కానీ ఎందుకో ఈ సినిమా నెగటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. సినిమా కలెక్షన్లు బాగానే రాబట్టినా.. మంచి టాక్ మాత్రం రాబట్టలేకపోయింది.

పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన భీమ్లా నాయక్ సినిమా కూడా సగటు ప్రేక్షకుడికి అంత పెద్దగా నచ్చదు. కానీ ఏ రేంజ్ లో కలెక్షన్లు రాబట్టిందో తెలిసిందే. ఈ సినిమా కోసం ఎంతో మంది ఎదురుచూశారు. పవన్ కళ్యాణ్ స్టైల్ సూపర్ గా ఉంటుంది. కానీ స్టోరీ పెద్దగా పండినట్టుగా అనిపించలేదు అనే కామెంట్లు కూడా వచ్చాయి. కానీ థియేటర్లలో మాత్రం ఫుల్ గా జనాలు గుమిగూడారు. అయితే ఈ సినిమా వాస్తవానికి మలయాళం సినిమా అయిన అయ్యప్పనం కోషియన్ సినిమాకి రీమేక్ గా వచ్చింది. కానీ ప్రేక్షకుల్ని మెప్పించడంలో సక్సెస్ కాలేదు. పవన్ కళ్యాణ్ రేంజ్ సినిమా కాదు అనే టాక్ కూడా వచ్చింది. పవన్ కళ్యాణ్ సినిమాలో ఉండే మ్యాజిక్ ఈ సినిమాలో మిస్ అయిందని చాలామంది చెప్తూ ఉంటారు…ఇలా ఇండస్ట్రీ లో కొంత మందికి ఆ సినిమా నచ్చకపోయినా కూడా సూపర్ హిట్ గా నిలిచాయి.