Avatar 3 Twitter Talk: మన ఇండియన్ ఆడియన్స్ అమితంగా ఇష్టపడిన హాలీవుడ్ చిత్రాల్లో ఒకటి ‘అవతార్’. ముఖ్యంగా మన తెలుగు ఆడియన్స్ కూడా ఈ చిత్రానికి బ్రహ్మరథం పట్టారు. ఓపెనింగ్స్ దగ్గర నుండి క్లోజింగ్ వరకు భారీ వసూళ్లను అందించారు. హైదరాబాద్ లోని ప్రసాద్ ఐమాక్స్ లో ‘అవతార్’ చిత్రం సింగల్ స్క్రీన్ నుండి 7 కోట్ల 50 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇప్పటి వరకు ఒక్క ఇండియన్ చిత్రం కూడా ఈ రికార్డు కి దరిదాపుల్లో కూడా రాలేదు. అంతే కాకుండా 304 రోజుల పాటు ఆ థియేటర్ లో ప్రదర్శితమైంది. అలాంటి హిస్టారికల్ బ్లాక్ బస్టర్ కి సీక్వెల్ గా వచ్చిన ‘అవతార్ 2 : ది వే ఆఫ్ వాటర్’ కూడా సంచలన విజయం సాధించింది. కేవలం తెలుగు రాష్ట్రాల నుండే ఈ సినిమాకు వంద కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి అంటేనే అర్థం చేసుకోండి ఏ రేంజ్ బ్లాక్ బస్టర్ అనేది.
HOO LEE FUCK!!!
This is definitely my last cinema experience this year. Nothing will ruin this experience for me. I won’t allow it! 2025 couldn’t have ended on a better cinematic note! #AvatarFireAndAsh https://t.co/EyvpEDtP6H— ZADAYY (@IAmZadayy) December 19, 2025
అలా రెండు సినిమాలను ఈ ఫ్రాంచైజ్ నుండి ఆదిరంచారు జనాలు. నేడు ఈ ఫ్రాంచైజ్ నుండి ‘అవతార్ 3 : ది ఫైర్ & యాష్'(Avatar 3 : The Fire & Ash) అనే చిత్రం విడుదల అవుతోంది. ఆశ్చర్యానికి గురి చేసే విషయం ఏమిటంటే, ఈ సినిమాకు ఆడియన్స్ లో ఇసుమంత హైప్ కూడా క్రియేట్ అవ్వలేదు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అయితే ఈ సినిమా విడుదల అవుతుంది అనే విషయం కూడా చాలా మందికి తెలియదు . కానీ అవతార్ చిత్రానికి వీరాభిమానులు ఉంటారు కదా. వాళ్ళ కారణంగా హైదరాబాద్ వంటి ప్రాంతాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ పర్వాలేదు అనే రేంజ్ లో జరిగాయి. మరి నేడు థియేటర్స్ ముందుకు వచ్చిన ఈ చిత్రానికి సోషల్ మీడియా నుండి ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో ఒకసారి వివరంగా చూద్దాం. ట్విట్టర్ ఆడియన్స్ నుండి వచ్చిన రెస్పాన్స్ ని చూస్తే ఈ సినిమా డిజాస్టర్ అనే చెప్పాలి.
Avatar Fire And Ash Review
-Better than part 2 and not impactful as part 1
-visuals are stunning and Pandora world is expanded even more
-Best action scenes but less emotional
-7/10 #AvatarFireAndAsh pic.twitter.com/fFF7SPQ0Ow
— Movie Bot (@TheIronySociety) December 19, 2025
మొదటి రెండు భాగాల్లో ఏదైతే స్టోరీ లైన్ మీద సినిమాని జేమ్స్ కెమరూన్ తెరకెక్కించాడో, మూడవ భాగం లో కూడా అదే తరహా స్టోరీ లైన్ తో తెరకెక్కించాడు. స్క్రీన్ ప్లే ఆసక్త్కారంగా లేదని, సినిమా మధ్యలోనే పైకి లేచి వెళ్లిపోవాలనే భావన కలిగిందని అంటున్నారు. మూడు గంటల నిడివి ఉన్న ఈ సినిమాలో కనీసం ఒక్కటంటే ఒక్క సన్నివేశం కూడా అద్భుతం అని అనిపించినా దాఖలాలు లేవని అంటున్నారు నెటిజెన్స్. జేమ్స్ కెమరూన్ తన విలువైన సమయాన్ని ఎందుకు ఈ సినిమా మీద పెట్టి వృధా చేస్తున్నాడు?, కేవలం కమర్షియల్ గా ఆలోచించే ఈ సిరీస్ ని కొనసాగిస్తున్నట్టే ఉంది కానీ, నిజాయితీగా ఆడియన్స్ కి సరికొత్త అనుభూతిని కలిగించాలి అనే దృక్పధం తో ఈ చిత్రాన్ని తీసినట్టుగా అనిపించలేదని ఆడియన్స్ అంటున్నారు. ట్విట్టర్ ఆడియన్స్ ఈ సినిమా గురించి ఏమని అనుకుంటున్నారో కొన్ని ట్వీట్స్ మీకోసం క్రింద అందిస్తున్నాము, చూసి ఎంజాయ్ చేయండి.