Avatar 2 OTT: ప్రముఖ హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కెమరూన్ తెరకెక్కించిన వెండితెర అద్భుతం ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’ చిత్రం గత ఏడాది డిసెంబర్ నెలలో విడుదలై ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్నీ బాషలలో ప్రభంజనం సృష్టించిన సంగతి తెలిసిందే.ఒక హాలీవుడ్ చిత్రానికి తెలుగు లో దాదాపుగా 60 కోట్ల రూపాయిలు షేర్ వసూళ్లు రావడం కేవలం అవతార్ కి మాత్రమే జరిగింది.
ప్రపంచవ్యాప్తంగా అనీ భాషలకు కలిపి అవతార్ పార్ట్ 1 వసూళ్లను దాటలేకపోయినప్పటికీ, కమర్షియల్ గా మాత్రం సూపర్ హిట్ గా నిల్చింది. అవతార్ పార్ట్ 1 సుమారుగా 3 బిలియన్ డాలర్లు వసూలు చేస్తే, అవతార్ 2 కేవలం 2.3 బిలియన్ డాలర్స్ మాత్రమే వసూలు చేసింది.పార్ట్ 1 స్థాయిలో పార్ట్ 2 ఆకట్టుకోలేకపోయినా, కేవలం హైప్ కారణంగా సూపర్ హిట్ అయిపోయింది. ఈ చిత్రాన్ని అమెరికన్ ట్రేడ్ వర్గాలు బాక్స్ ఆఫీస్ వద్ద 5 మిలియన్ డాలర్స్ ని వసూలు చేస్తుందని అంచనా వేశారు.
కానీ అందులో సగం కూడా రాబట్టలేకపోయింది ఈ చిత్రం.ఇది ఇలా ఉండగా ఈ సినిమా ఇప్పుడు అతి త్వరలోనే ఓటీటీ లోకి అందుబాటులో రానుంది. జూన్ 7 వ తారీఖు నుండి ఈ సినిమా డిస్నీ + హాట్ స్టార్ లో ఇంగ్లీష్ తో పాటుగా అన్నీ ఇండియన్ ప్రాంతీయ బాషలలో అందుబాటులోకి రానుంది.
మార్చి 28 వ తారీఖు నుండే అమెజాన్ ప్రైమ్ , యాపిల్ టీవీ , గూగుల్ ప్లే మరియు మైక్రో సాఫ్ట్ వంటి టీవీ లలో అద్దె రూపం లో అందుబాటులో ఉంది. కానీ జూన్ 7 వ తారీఖు నుండి డిస్నీ + హాట్ స్టార్ వినియోగదారులందరికీ ఈ చిత్రం ఉచితంగానే అందుబాటులోకి రానుంది. ఈ సమ్మర్ లో కుటుంబ సభ్యులందరూ కలిసి ఒక చోట కూర్చొని ఎంజాయ్ చేయదగ్గ చిత్రం ఇది. తప్పక మిస్ కాకుండా చూడండి.