Avanthika Martial Arts Heroine: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు తీసుకెళుతున్న విషయం మనకు తెలిసిందే. హీరోలకు పోటీగా కొంతమంది హీరోయిన్లు అప్పుడప్పుడు లేడీ ఓరియంటెడ్ సినిమాలను చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే ఫణింద్ర నరిశెట్టి (Phanidra Narishetti) దర్శకత్వంలో వచ్చిన ‘8 వసంతాలు’ (8 Vasanthalu) సినిమా రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అవంతిక (Avanthika) అనే నటి మెయిన్ లీడ్ లో చేయడం విశేషం… 2023 వ సంవత్సరంలో వచ్చిన ‘మ్యాడ్ ‘ సినిమాతో నటిగా మారిన తను ఆ సినిమాతో సూపర్ సక్సెస్ ని అందుకుంది.ఇక ఆమెకి చాలా ఆఫర్స్ వచ్చినప్పటికి 8 వసంతాలు సినిమా కోసం తన పూర్తి డేట్స్ ని కేటాయించింది. ఈ మూవీ టీమ్ మార్షల్ ఆర్ట్స్ తెలిసిన అమ్మాయి కోసం తిరుగుతున్న సందర్భంలో వాళ్లకు కనిపించిన ఒకే ఒక నటి అనంతిక కావడం విశేషం…ఇక తను 19 ఏళ్లకే 13 కళల్లో ప్రావీణ్యం సంపాదించింది. డాన్స్, మార్షల్ ఆర్ట్స్ లాంటి 33 కళల్లో తనకి గొప్ప నైపుణ్యం అయితే ఉంది. 8 వసంతాలు సినిమాలో తన హార్డ్ వర్క్ అయితే మనకు కనిపిస్తూ ఉంటుంది. మార్షల్ ఆర్ట్స్ తెలిసిన అమ్మాయిగా తను కనిపించడమే కాకుండా సెల్ఫ్ డిఫెన్స్ చేసుకుంటూ వచ్చిన ప్రాబ్లమ్స్ మీద పోరాటం చేస్తూ సినిమాను ముందుకు నడిపించింది.
ఇక తను రీసెంట్ గా మాట్లాడుతూ ప్రతి అమ్మాయి సెల్ఫ్ డిఫెన్స్ చేసుకునే విధంగా మార్షల్ ఆర్ట్స్ లో ప్రావీణ్యాన్ని సంపాదిస్తే బాగుంటుంది అంటూ తన అభిప్రాయాన్ని తెలియజేసింది. ఇక ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసిన కూడా అనంతిక పేరే ఎక్కువగా వినిపిస్తుంది. సినిమా ఇండస్ట్రీలో ఆమెకు మంచి ఆదరణ లభిస్తోంది.
ఇకమీదట ఆమె మంచి సినిమాలు చేయడానికి ఆస్కారం అయితే ఉంది. 8 వసంతాలు సినిమా మొదటి షో నుంచి పాజిటివ్ టాక్ ను సంపాదించుకోవడంతో ఆమె చేసిన పాత్రకి మంచి గుర్తింపైతే వచ్చింది. ఇక ఈ సినిమా క్రాఫ్ట్ లలో భాగమైన సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ నేర్చుకుంటానని కూడా తను చెబుతోంది. ఆమె కేరళలో పుట్టినప్పటికి తెలుగులో చాలా స్పష్టంగా మాట్లాడుతూ అందరిని ఆకర్షిస్తోంది.
A teaser of the talent @Ananthika108 possesses ❤
Her performance as Shuddhi Ayodhya in #8Vasantalu will be spellbinding #8Vasantalu grand release worldwide on June 20th. pic.twitter.com/dipV0vkXKT
— Mythri Movie Makers (@MythriOfficial) June 18, 2025
మరి ఏది ఏమైనా కూడా 8 వసంతాలు సినిమాతో తన ప్రతిభను బయటకు తీసిన ఆమె పెద్ద సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా మారాలని అనుకుంటుంది. ఇక ఈమెను చూసి ఇంకా చాలా మంది అమ్మాయిలు పలు కళల్లో ప్రావీణ్యం సంపాదించాలని కోరుకుందాం…