Kubera First Day Collections: ప్రముఖ డైరెక్టర్ శేఖర్ కమ్ముల(Sekhar Kammula) బ్రాండ్ పవర్ ఎలాంటిదో ‘కుబేర'(Kubera Movie) చిత్రం తో మరోసారి తెలిసింది. నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమాకు మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ వచ్చింది. టాక్ కి తగ్గట్టుగానే భారీ ఓపెనింగ్ వసూళ్లు వచ్చాయి. మార్నింగ్ షోస్ మరియు మ్యాట్నీ షోస్ ఆంధ్ర ప్రదేశ్ లో కాస్త డల్ గా అనిపించింది. కానీ ఫస్ట్ షోస్ నుండి ఈ చిత్రం బాక్స్ ఆఫిస్ వద్ద వీరంగం సృష్టించింది. ఇంతటి ఓపెనింగ్స్ ఇప్పటి వరకు నాగార్జున కి కానీ, ధనుష్ కి కానీ ఇప్పటి వరకు రాలేదు. ఇక ఈ ఏడాది బుక్ మై షో యాప్ లో ఇప్పటి వరకు విడుదలైన సినిమాల్లో మొదటి రోజు అత్యధిక టిక్కెట్లు అమ్ముడుపోయిన సినిమాగా ఈ చిత్రం చరిత్ర సృష్టించింది. కేవలం టాలీవుడ్ లోనే కాదు, సౌత్ లో కూడా ఈ ఏడాది విడుదలైన సినిమాల్లో ‘కుబేర’ దే పై చెయ్యి.
ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి ప్రాంతాల వారీగా ఎంత వసూళ్లు వచ్చాయో ఒకసారి చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు ఈ చిత్రానికి పది కోట్ల రూపాయలకు పైగానే గ్రాస్ వసూళ్లు వచ్చాయి. షేర్ దాదాపుగా 5 కోట్ల 85 లక్షలు ఉంటుందని అంచనా. రిటర్న్ జీఎస్టీ కలిపితే 6 కోట్ల 60 లక్షల రూపాయిల షేర్ ఉంటుంది. నైజాం ప్రాంతం నుండి రెండు కోట్ల 26 లక్షలు, సీడెడ్ నుండి 80 లక్షలు, ఉత్తరాంధ్ర నుండి 81 లక్షలు, ఈస్ట్ గోదావరి నుండి 48 లక్షలు, కృష్ణ జిల్లా నుండి 42 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే తమిళనాడు లో కేవలం ఈ చిత్రానికి 5 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు మాత్రమే వచ్చాయి.
Also Read: Kubera Vs 8 Vasanthalu: కుబేర vs 8 వసంతలు ఈ రెండు సినిమాల్లో ఏది హిట్? ఏది ఫట్..?
తెలుగు వెర్షన్ నుండి నాగార్జున(Akkineni Nagarjuna) భారీ వసూళ్లను తీసుకొని రాగలిగాడు కానీ, ధనుష్(Dhanush) అలాంటి మ్యాజిక్ ని తమిళనాడు లో క్రియేట్ చేయలేకపోయాడు. ఇక ఓవర్సీస్ లో ఈ చిత్రానికి కేవలం ప్రీమియర్స్ నుండి 5 లక్షల డాలర్లను రాబట్టింది. ఓవరాల్ గా వరల్డ్ వైడ్ గా ఈ చిత్రానికి 30 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. రెండవ రోజు కూడా అన్నీ ప్రాంతాల్లో చాలా బలమైన ఓపెనింగ్ తో ఈ చిత్రం మొదలైంది. కేవలం వీకెండ్ తో అత్యధిక ప్రాంతాల్లో ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇదే ఊపు ని వర్కింగ్ డేస్ లో కూడా కొనసాగిస్తే కచ్చితంగా ఈ చిత్రం ఫుల్ రన్ లో 200 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను అందుకునే అవకాశాలు ఉన్నాయి. చూడాలి మరి ఈ సినిమా రేంజ్ ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుంది అనేది.