Viva Harsha : ఇప్పటివరకు టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో చాలామంది తమ కామెడీతో ప్రేక్షకులను అలరించారు. అలా తన కామెడీతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న వాళ్లలో నటుడు వైవా హర్ష కూడా ఒకరు. వైవా హర్ష గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. హర్ష కెరీర్ ప్రారంభంలో షార్ట్ ఫిలిమ్స్ తో బాగా పాపులారిటీని సంపాదించుకున్నాడు. ఫన్నీ వీడియోలు చేస్తూ అందరిని ఆకట్టుకోవడంతో పాటు మంచి ఫాలోయింగ్ కూడా సంపాదించుకున్నాడు. తన కామెడీతో అందరిని మెప్పించి మంచి గుర్తింపు సొంతం చేసుకున్నాడు. ముఖ్యంగా హర్ష చేసిన వైవా షార్ట్ ఫిలిం ఈయనకు మంచి క్రేజ్ ను, ఫాలోయింగ్ ను తెచ్చి పెట్టాయి. ఆ తర్వాత నుంచి అతని పేరు వైవా హర్షాగా మారిపోయింది. సినిమాలలో అవకాశాలు రావడంతో ప్రస్తుతం సినిమాలలో నటుడిగా రాణిస్తున్నాడు వైవా హర్ష. సినిమాలలో ఎక్కువగా హీరో ఫ్రెండ్ పాత్రలలో కనిపించి తన కామెడీతో అందరిని అలరించాడు. లేటెస్ట్ గా వైవా హర్ష సుందరం మాస్టర్ అనే సినిమాలో ప్రధాన పాత్రలో నటించాడు. సినిమాలతో పాటు సోషల్ మీడియాలో కూడా వైవా హర్ష చాలా యాక్టివ్ గా ఉంటాడు. అభిమానులను ఆకట్టుకుంటూ ఫన్నీ వీడియోస్ ను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటాడు. ఎప్పుడు కామెడీ వీడియోలను షేర్ చేస్తూ ప్రేక్షకులను అలరించే వైవా హర్ష ఇటీవల ఒక ఎమోషనల్ వీడియోను షేర్ చేశాడు. దయచేసి సాయం చేయండి అంటూ వైవా హర్ష అభ్యర్థించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోలో హర్ష మాట్లాడుతూ… హాయ్ అందరికీ.. నేను మీ అందరిని ఒక సహాయం అడగడానికి ఈ వీడియోను చేస్తున్నాను.
మన చుట్టుపక్కల వాళ్లకు ఒక సమస్య వస్తే ఒకలా ఉంటుంది, ఆ సమస్య మన వరకు వస్తే వేరేలా ఉంటుంది. ప్రస్తుతం అలాంటి ఒక పరిస్థితిలో నేను, నా కుటుంబ సభ్యులు, స్నేహితులు ఉన్నాము. మా అంకుల్ ఏ పాపారావు. 91 ఏళ్ల వయస్సు ఉన్న అతనికి అల్జీమర్స్ ఉంది. ఆయన నాలుగు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయారు. వైజాగ్ లో ఇంటి నుంచి ఆయన బయటకు వెళ్లారు. చివరిసారిగా ఆయన కంచరపాలెం ఏరియాలో కనిపించారు. అది కూడా రెండు రోజుల క్రితం ఒక సీసీటీవీ ఫుటేజ్ లో ఆయన కనిపించడం జరిగింది.
నా రిక్వెస్ట్ ఏంటంటే నా స్నేహితులు, కుటుంబ సభ్యులు, స్టూడెంట్స్ ఎవరైనా ఆ చుట్టుపక్కల ఏరియా లో ఉంటే కుదిరితే సర్చ్ గ్రూప్ లలో వెళ్లి మా అంకుల్ ని వెతకడంలో సహాయం చేయండి. ఆయన ఎవరికైనా కనిపిస్తే వెంటనే మొదట ఆయనకు ఫుడ్ పెట్టండి. ఆయన చాలా నీరసంగా ఉన్నారు. ఆయనకు 91 ఏళ్లు కావడంతో చాలా బలహీనంగా ఉన్నారు. మీలో ఎవరికైనా మా అంకుల్ కనిపిస్తే వీడియోలో ఇచ్చిన నెంబర్స్ కు కాల్ చేసి చెప్పండి అంటూ వైవా హర్ష రిక్వెస్ట్ చేశాడు.