Athadu Super 4K Movie Re-Release: తెలుగు సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబుకి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఆయన చేసే సినిమాలు అతనికి గొప్ప గుర్తింపును సంపాదించి పెట్టడమే కాకుండా సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తన వైపు తిప్పుకునేలా చేశాయి. ఇక ప్రస్తుతం ఆయన రాజమౌళితో చేస్తున్న సినిమాతో పాన్ వరల్డ్ లోకి ఎంట్రీ ఇస్తున్న విషయం మనకు తెలిసిందే…ఇక ఈ క్రమంలోనే ఆయన షూటింగ్లో పాల్గొంటూ ఆ సినిమాకు సంబంధించిన వ్యవహారాలను చూసుకుంటున్నాడు. ఇక ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోల సినిమాలన్నీ రీ రిలీజ్ చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇప్పటికే మహేష్ బాబు హీరోగా వచ్చిన పోకిరి, ఒక్కడు, బిజినెస్ మేన్ లాంటి సినిమాలు ఇప్పుడు 4k లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 9వ తేదీన ఈ సినిమాను రీ రిలీజ్ చేస్తున్నామంటూ సినిమా యూనిట్ ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు. మొత్తానికైతే ఈ సినిమా ప్రేక్షకులందరికి ఒక మధురానుభూతిని అందిస్తుంది అంటూ వాళ్ళు చెబుతుండడం విశేషం…2005వ సంవత్సరంలో వచ్చిన ఈ సినిమా ఏడు కోట్లకు పైన బడ్జెట్ తో తెరకెక్కింది.
Also Read: హృతిక్ కంటే ఎన్టీఆర్ కే ఎక్కువ.. వార్ 2 రెమ్యూనరేషన్స్ ఇవే!
మొత్తానికైతే ఈ సినిమా అప్పట్లో ఒక పెను సంచలనాన్ని క్రియేట్ చేసింది. మహేష్ బాబు కెరియర్ లో సూపర్ సక్సెస్ గా నిలిచిన సినిమాల్లో ఈ సినిమా కూడా ఒకటని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…అయితే ఈ సినిమా రీ రిలీజ్ ద్వారా వచ్చే కలెక్షన్స్ ని మహేష్ బాబు ఫౌండేషన్ కి ఉపయోగిస్తామంటూ జయభేరి ఆర్ట్స్ అధినేత మురళి మోహన్ తెలియజేయడం విశేషం…
ఇక గతంలో మహేష్ బాబు హీరోగా చేసిన సినిమాలు రీ రిలీజ్ చేసిన సందర్భంలో వచ్చిన కలెక్షన్స్ ని సైతం మహేష్ బాబు ఫౌండేషన్ కి కేటాయించారు. ముఖ్యంగా మహేష్ బాబు ఫౌండేషన్ కింద చిన్నపిల్లలకు హార్ట్ సర్జరీలు చేస్తూ ఉంటాడు. దాని కోసమే ఆ డబ్బులను కేటాయించినట్టుగా తెలుస్తోంది. ఇక ఆగస్టు 9వ తేదీన ఈ సినిమాని చూడడానికి మహేష్ బాబు అభిమానులతో పాటు సగటు ప్రేక్షకులు కూడా ఆసక్తిని చూపిస్తున్నారు.
Also Read: దయచేసి పవన్ కళ్యాణ్ సినిమాను కాపాడండి.. నాదెండ్ల వేడుకోలు.. ఆడియో లీక్
ఇక ఇప్పటికే అతడు సినిమాని మాటీవీలో కొన్ని వేల సార్లు వేశారు. అయినప్పటికి ఆ సినిమాను చూసే అభిమానులు ఇంకా ఉన్నారు అంటే నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి. మరి ఈ సినిమా ఎలాంటి కలెక్షన్స్ సాధిస్తోంది. ఇప్పటి వరకు రీ రిలీజ్ లో ఉన్న అన్ని రికార్డులను బ్రేక్ చేస్తుందా? లేదా అనేది తెలియాలంటే ఆగస్టు 9వ తేదీ వరకు వెయిట్ చేయాల్సిందే…