Athadu Re Release : మన టాలీవుడ్ లో ప్రస్తుతం కొత్త సినిమాలకంటే ఎక్కువ గా రీ రిలీజ్ చిత్రాలకే మంచి గిరాకీ నడుస్తుంది. స్టార్ హీరోల సినిమాలు విడుదల అయ్యేందుకు బాగా ఆలస్యం అవుతుండడంతో, వాళ్ళు హీరోలుగా నటించిన పాత సినిమాలను సరికొత్త టెక్నాలజీలోకి మార్చి, థియేటర్స్ లో గ్రాండ్ గా రీ రిలీజ్ చేస్తున్నారు. వాటికి బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డు స్థాయి వసూళ్లు వస్తున్నాయి. ముఖ్యంగా ఈ ట్రెండ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan), సూపర్ స్టార్ మహేష్ బాబు(Superstar Mahesh Babu) పాత సినిమాలు ఆల్ టైం రికార్డ్స్ నెలకొల్పాయి. వీళ్లిద్దరికీ దరిదాపుల్లో మరో హీరో లేడు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ప్రస్తుతానికి మొదటి రోజు రికార్డు ‘గబ్బర్ సింగ్’ చిత్రంతో ఉండగా, ఫుల్ రన్ రికార్డు మురారి ఖాతాలో ఉన్నది. అయితే ఈ ఏడాది మహేష్ పుట్టినరోజు సందర్భంగా ‘అతడు'(#Athadu4k) చిత్రాన్ని గ్రాండ్ గా రీ రిలీజ్ చేయబోతున్నారు.
Also Read : మహేష్ బాబు కోసం 4 కథలు రాసుకున్నప్పటికి ఒక్క సినిమా కూడా చేయలేకపోయిన స్టార్ డైరెక్టర్…
నిర్మాత నుండి ఈ సినిమా రైట్స్ ని రీసెంట్ గానే కొనుగోలు చేశారు. ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ దాదాపుగా 3 కోట్ల 8 లక్షల రూపాయలకు జరిగిందని సమాచారం. ఇది రీ రిలీజ్ చరిత్రలోనే ఆల్ టైం రికార్డు అని అంటున్నారు. అంటే ఈ చిత్రం కచ్చితంగా 12 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టాలి అన్నమాట. మహేష్ బాబు అభిమానులు కేవలం మొదటి రోజునే పది కోట్ల రూపాయిల గ్రాస్ ని కొల్లగొట్టాలనే కసితో ఉన్నారు. అదే జరిగితే ఈ చిత్రం ఫుల్ రన్ లో పాతిక కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టి సెన్సేషన్ సృష్టించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు ట్రేడ్ పండితులు. మహేష్ బాబు కొత్త సినిమా విడుదలైతే ఎలాంటి క్రేజ్ ఉంటుందో, అతడు చిత్రానికి కచ్చితంగా అలాంటి క్రేజ్ ఉంటుంది అని బలంగా నమ్ముతున్నారు.
ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే, ఈ చిత్రాన్ని జయభేరి ఆర్ట్స్ పై సీనియర్ నటుడు మురళి మోహన్ నిర్మించాడు. ఆరోజుల్లో ఈ చిత్రం కమర్షియల్ గా పెద్ద హిట్ అవ్వలేదు. నిర్మాతకు నష్టాలను మిగిలించింది. కానీ టీవీ టెలికాస్ట్ లో మాత్రం ఒక సెన్సేషన్ ని సృష్టించింది అనే చెప్పాలి. టీవీ టెలికాస్ట్ లో అత్యధిక సార్లు టెలికాస్ట్ అయినా ఏకైక ఇండియన్ సినిమాగా సరికొత్త చరిత్ర ని సృష్టించింది ఈ చిత్రం. ఇప్పటికీ ఈ సినిమా టీవీ లో టెలికాస్ట్ అయితే మంచి టీఆర్ఫీ రేటింగ్స్ నమోదు అవుతూ ఉంటాయి. అందుకే స్టార్ మా ఛానల్ తమ వద్ద ఉన్న అత్యధిక సినిమాలను వేరే చానెల్స్ కి అమ్మేసింది కానీ, ‘అతడు’ చిత్రాన్ని మాత్రం వదులుకోలేదు. ఇప్పటికీ టెలికాస్ట్ చేస్తూనే ఉంది. త్రివిక్రమ్, మహేష్ కెరీర్స్ లో ఆల్ టైం క్లాసిక్ గా నిల్చిన ఈ చిత్రం రీ రిలీజ్ లో ఎన్ని వండర్స్ ని క్రియేట్ చేస్తుంది చూడాలి.
Also Read : 1500 సార్లు టీవీలో టెలికాస్ట్..వరల్డ్ రికార్డు నెలకొల్పిన మహేష్ బాబు!