Athadu Movie 1500 times Telecast on TV
Athadu Movie : సూపర్ స్టార్ మహేష్ బాబు(Super Star Mahesh Babu) కి కేవలం బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డ్స్ మాత్రమే కాదు, టీవీలో కూడా ఆయనకు సంచలన రికార్డ్స్ ఉన్నాయి. ఆయన సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద హిట్ అయినా, ఫ్లాప్ అయినా, టీవీ టెలికాస్ట్ లో మాత్రం బంపర్ రెస్పాన్స్ ని దక్కించుకుంటూ ఉంటాయి. ‘గుంటూరు కారం’ చిత్రం అందుకు ఒక ఉదాహరణ. గత ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం కమర్షియల్ గా ఎంత పెద్ద ఫ్లాప్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. కానీ ఈ సినిమాకి ఓటీటీ లో మంచి రెస్పాన్స్ వచ్చింది, అదే విధంగా టీవీ టెలికాస్ట్ లో కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇలాంటి సినిమాలు మహేష్ కెరీర్ లో ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా ఆయన కెరీర్ లో కల్ట్ క్లాసిక్ గా పిలవబడే ‘అతడు'(Athadu Movie) చిత్రం గురించి మాట్లాడుకోవాలి.
Also Read : మహేష్ బాబు కోసం 4 కథలు రాసుకున్నప్పటికి ఒక్క సినిమా కూడా చేయలేకపోయిన స్టార్ డైరెక్టర్…
ఈ సినిమా అప్పట్లో థియేటర్స్ లో పెద్దగా ఆడలేదు, యావరేజ్ రేంజ్ లో ఆడింది. కానీ టీవీ టెలికాస్ట్ లో మాత్రం ఈ చిత్రం ఒక సునామీ అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎన్నిసార్లు టెలికాస్ట్ చేసినా టీఆర్ఫీ రేటింగ్స్ అదిరిపోతూ ఉంటాయి. స్టార్ మా ఛానల్ తమ వద్ద ఉన్నటువంటి అత్యధిక సినిమాలను మిగతా చానెల్స్ కి అమ్మేసిన సందర్భాలు ఉన్నాయి కానీ, అతడు చిత్రాన్ని మాత్రం ఇప్పటి వరకు అమ్మలేదు. ఈ సినిమాని ఇప్పటి వరకు స్టార్ మా ఛానల్ గ్రూప్స్ లో 1500 సార్లు టెలికాస్ట్ చేశారట. ఇది ఇండియన్ రికార్డు కాదు, వరల్డ్ రికార్డు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఒక సినిమాని ఇన్ని సార్లు టెలికాస్ట్ చేయడం అనేది ఇప్పటి వరకు ప్రపంచం లో ఎక్కడా జరగలేదు. అలాంటి అద్భుతమైన రిపీట్ వేల్యూ కలిగిన చిత్రమిది. ఈ సినిమా రీ రిలీజ్ కోసం మహేష్ అభిమానులే కాదు, టాలీవుడ్ మొత్తం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తుంది.
మహేష్ పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 9న ఈ సినిమాని గ్రాండ్ గా రీ రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అదే కనుక జరిగితే టాలీవుడ్ లోనే కాదు, ఆల్ ఇండియా లెవెల్ లో ఆల్ టైం రికార్డుని నెలకొల్పే అవకాశం ఉంది. ఒకప్పుడు థియేటర్స్ లో ఈ చిత్రానికి కేవలం 18 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు, 30 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇప్పుడు ఈ చిత్రం కచ్చితంగా మొదటి రిలీజ్ ని బీట్ చేస్తుందని బలమైన నమ్మకం తో ఉన్నారు ఫ్యాన్స్. ప్రపంచవ్యాప్తంగా తమిళ హీరో విజయ్ నటించిన ‘గిల్లీ’ చిత్రం రీ రిలీజ్ కి దాదాపుగా 50 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. దీనిని ‘అతడు’ చిత్రం బ్రేక్ చేస్తుందనే నమ్మకం తో ఉన్నారు ఫ్యాన్స్.
Also Read : 5 ఆస్కార్లు గెలిచిన మూవీ..ఓటీటీ లోకి వచ్చేసింది..ఎందులో చూడాలంటే!