Athadu Re Release: టాలీవుడ్ లో మహేష్ బాబు(Superstar Mahesh Babu) పాత సినిమాలకు ఉన్నంత క్రేజ్, ఏ హీరో కి కూడా లేదు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఒక్కటా రెండా, ఆయన చేసిన ప్రతీ సినిమా క్లాసిక్ నే. ఫ్లాప్ సినిమాలు సైతం కాలం గడిచే కొద్దీ కల్ట్ క్లాసిక్స్ గా నిలిచిపోతుంటాయి, అందుకు రీసెంట్ ఉదాహరణ ‘ఖలేజా’. అప్పట్లో ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చిన ఈ చిత్రం, రీ రిలీజ్ లో పది కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది. మహేష్ కెరీర్ లో యావరేజ్ గా నిల్చిన ‘అతడు'(Athadu Movie) చిత్రం బుల్లితెర పై సృష్టించిన ప్రభంజనం ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. టీవీ లలో అత్యధిక సార్లు ప్రదర్శితమైన తెలుగు సినిమా ఇది. దీనిపై గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు కూడా ఉంది. అలాంటి సినిమాని, ఈ నెల 9న మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా గ్రాండ్ రీ రిలీజ్ చేయబోతున్నారు.
Also Read: బాలకృష్ణ సినిమాకు నేషనల్ అవార్డు..నందమూరి ఫ్యాన్స్ కాలర్ ఎగరేసే సమయం
త్వరలోనే అన్ని యాప్స్ లో అడ్వాన్స్ బుకింగ్స్ ని కూడా ప్రారంభించనున్నారు. రీ రిలీజ్ హిస్టరీ లో ఎన్నడూ లేని విధంగా ఈ సినిమాని ఐమాక్స్ వెర్షన్ లోకి మార్చి రిలీజ్ చేయబోతున్నారు. ఓవర్సీస్ లో ఈ కారణం చేత సునామీ లాంటి వసూళ్లను మనం చూడొచ్చు. రీ రిలీజ్ రికార్డ్స్ ని ఈ చిత్రం కచ్చితంగా బద్దలు కొడుతుంది, అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ ఈ చిత్రం క్రేజీ కొత్త సినిమాలను కూడా డామినేట్ చేస్తుంది అంటే నమ్ముతారా?. హైదరాబాద్ లొకేషన్ లో బుక్ మై షో యాప్ ని తెరిచి చూస్తే అతడు చిత్రం ఆగష్టు 14 న విడుదల కాబోయే ‘కూలీ'(Coolie Movie), ‘వార్ 2′(War2 Movie) సినిమాలకంటే టాప్ స్థానం లో ట్రెండ్ అవుతుంది. దీనిని బట్టీ ఈ రీ రిలీజ్ కోసం జనాలు ఎంతలా ఎదురు చూస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.
ప్రస్తుతం రీ రిలీజ్ చిత్రాల్లో మొదటి రోజు రికార్డు పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ‘గబ్బర్ సింగ్’ ఖాతాలో ఉండగా, ఫుల్ రన్ రికార్డు ‘ఖలేజా’ ఖాతాలో ఉంది. ‘గబ్బర్ సింగ్’ రికార్డు ని కొట్టడం అంత తేలికైన విషయం కాదు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆంధ్ర ప్రదేశ్ లో కనీవినీ ఎరుగని రేంజ్ గ్రాస్ నంబర్స్ ని పెట్టారు. ఆంధ్ర ప్రదేశ్ లో మొదటి రోజు గబ్బర్ సింగ్ రికార్డ్స్ ని కొట్టడం కష్టమే కానీ, తెలంగాణ మరియు ఓవర్సీస్ ప్రాంతాలతో ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్నటువంటి గబ్బర్ సింగ్ మార్జిన్ ని దాటేయొచ్చు అని అభిమానులు లెక్కలు వేసుకుంటున్నారు. మరి అది ఎంత వరకు ఆచరణలోకి వస్తుందో చూడాలి.