71st National Film Awards 2025 Baby Movie: మన టాలీవుడ్ లో చిన్న సినిమాగా విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచి, పోటీకి వచ్చిన పెద్ద సినిమాలను కూడా డామినేట్ చేసిన సినిమాలు చాలానే ఉన్నాయి. అలాంటి సినిమాల్లో ఒకటి ‘బేబీ ‘(Baby Movie). విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) సోదరుడు ఆనంద్ దేవరకొండ(Anand Devarakonda) హీరో గా, షార్ట్ ఫిలిమ్స్ చేసుకునే అమ్మాయి వైష్ణవి చైతన్య(Vaishnavi Chaitanya) హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం కేవలం మూడు కోట్ల రూపాయిల బడ్జెట్ తో తెరకెక్కి 40 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. యూత్ ఆడియన్స్ ని టార్గెట్ గా చేసుకొని ఈ చిత్రాన్ని తెరకెక్కించారు డైరెక్టర్ సాయి రాజేష్(Sai Rajesh). మెగా ఫ్యామిలీ అభిమాని గా సోషల్ మీడియా లో పాపులారిటీ ని సంపాదించుకున్న SKN ఈ చిత్రానికి నిర్మాత. ఈ సినిమా ఇప్పుడు కమర్షియల్ గా మాత్రమే కాదు, నేషనల్ అవార్డ్స్ లో కూడా సత్తా ని చాటింది.
Also Read: బాలకృష్ణ సినిమాకు నేషనల్ అవార్డు..నందమూరి ఫ్యాన్స్ కాలర్ ఎగరేసే సమయం!
వివరాల్లోకి వెళ్తే ఈ సినిమాకు అద్భుతమైన స్క్రీన్ ప్లే ని అందించిన సాయి రాజేష్ కి ఉత్తమ స్క్రీన్ ప్లే రైటర్ అవార్డు, అదే విధంగా ఈ సినిమాలో ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ ని పాడిన రోహిత్ PVS కి ఉత్తమ సింగర్ అవార్డు(మేల్) దక్కింది. ఈ సందర్భంగా ఆ చిత్రం డైరెక్టర్ సాయి రాజేష్ మాట్లాడుతూ ’71 వ నేషనల్ అవార్డ్స్ ని ఇప్పుడే ప్రకటించారు. అందులో మా బేబీ చిత్రానికి రెండు ముఖ్యమైన క్యాటగిరీస్ లో అవార్డులు దక్కాయి. ఇది నా కెరీర్ కి ఒక గేమ్ ఛేంజింగ్ మూమెంట్ గా అనుకోవచ్చు. చాలా సంతోషంగా ఉంది, నా నిర్మాత SKN నన్ను నమ్మకపోయుంటే ఇదంతా జరిగేది కాదు, ఒక చిన్న సినిమా డైరెక్టర్ ని నమ్మి, ప్రొడ్యూస్ చేసి నాకు ఈ గౌరవం దక్కేలా చేసాడు’ అంటూ చెప్పుకొచ్చాడు.
అదే విధంగా ఈ సినిమాలో పాటలు పాడిన PVS రోహిత్ గురించి మాట్లాడుతూ ‘కెరీర్ లో రోహిత్ ఎన్నో కష్టాలను అనుభవించాడు. అలాంటి వ్యక్తికి సినిమా ద్వారా ఇంత మంచి పేరు రావడం చాలా సంతోషం గా ఉంది’ అంటూ చెప్పుకొచ్చాడు. ఈ చిత్రం తో పాటు ఉత్తమ తెలుగు చిత్రం క్యాటగిరీ లో భగవంత్ కేసరి, ఉత్తమ VFX చిత్రం గా హనుమాన్ చిత్రాలకు కూడా నేషనల్ అవార్డ్స్ దక్కాయి. కానీ మన తెలుగు సినిమాల్లో అన్నిటికంటే బేబీ చిత్రమే ఎక్కువ అవార్డ్స్ తో టాప్ స్థానం లో ఉండడం విశేషం. రాబోయే రోజుల్లో ఈ సినిమాకు ఇంకా ఎలాంటి పురస్కారాలు దక్కుతాయో చూడాలి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే బేబీ దర్శకుడు సాయి రాజేష్ నిర్మాతగా వ్యవహరించిన ‘కలర్ ఫోటో’ చిత్రానికి కూడా అప్పట్లో ఉత్తమ చిత్రం క్యాటగిరీ లో నేషనల్ అవార్డు వచ్చింది.
Congratulations National Award Winning Team @SKNonline & Sai Razesh
BABY film wins two prestigious National awards
Best Screenplay – Neelam Sai Razesh
Best male singer – Rohith PVS #Baby pic.twitter.com/LYq3eoesXC
— Telugu360 (@Telugu360) August 1, 2025