Ashu Reddy: అషురెడ్డికి షాకిచ్చిన అసిస్టెంట్.. ఫొటోల బండారం బట్టబయలు..!

Ashu Reddy: టిక్ టాక్, సోషల్ మీడియా పుణ్యమా అని చాలామంది తెలుగుమ్మాయిలు భారీగా క్రేజ్ సంపాదించుకున్నారు. టిక్ టాక్ ఇండియాలో బ్యాన్ అయినప్పటికీ ఏదో ఒక ప్లాట్ ఫామ్ ను ఉపయోగించుకుంటూ కొందరు సినిమా అవకాశాలను దక్కించుకుంటున్న సంగతి తెల్సిందే. అప్పట్లో డబ్ స్మాష్ వీడియోల ద్వారా అషు రెడ్డి ఫేమస్ అయింది. ఈక్రమంలోనే పలు టీవీ షోలతోపాటు సినిమాల్లోనూ అవకాశాలు దక్కించుకుంది. బిగ్ బాస్-4 విన్నర్ రాహుల్ సింప్లిగంజ్ తో కొన్నాళ్లపాటు లవ్ ట్రాక్ […]

Written By: Raghava Rao Gara, Updated On : January 8, 2022 4:12 pm
Follow us on

Ashu Reddy: టిక్ టాక్, సోషల్ మీడియా పుణ్యమా అని చాలామంది తెలుగుమ్మాయిలు భారీగా క్రేజ్ సంపాదించుకున్నారు. టిక్ టాక్ ఇండియాలో బ్యాన్ అయినప్పటికీ ఏదో ఒక ప్లాట్ ఫామ్ ను ఉపయోగించుకుంటూ కొందరు సినిమా అవకాశాలను దక్కించుకుంటున్న సంగతి తెల్సిందే. అప్పట్లో డబ్ స్మాష్ వీడియోల ద్వారా అషు రెడ్డి ఫేమస్ అయింది. ఈక్రమంలోనే పలు టీవీ షోలతోపాటు సినిమాల్లోనూ అవకాశాలు దక్కించుకుంది.

బిగ్ బాస్-4 విన్నర్ రాహుల్ సింప్లిగంజ్ తో కొన్నాళ్లపాటు లవ్ ట్రాక్ నడిపి పాపులారిటినీ సంపాదించుకుంది. డేటింగ్ లు, పార్టీలంటూ వీరిద్దరు నిత్యం హల్చల్ చేసేవాళ్లు. ఆ తర్వాత వీరిద్దరు బ్రేకప్ చెప్పుకున్నట్లు వార్తలు వచ్చారు. ఆ తర్వాత జబర్దస్త్ షోతో ఫేమస్ అయిన హరితో లవ్ ట్రాక్ నడిపింది. ఈ షోలోనే ఓ కాస్లీ బైక్ అతడికి గిప్ట్ ఇచ్చి లవ్ చేస్తున్నట్లు కలరింగ్ ఇచ్చింది.

ఈక్రమంలోనే ‘కామెడీ స్టార్స్’లో హరితో కలిసి స్కిట్లు చేస్తూనే యాంకర్ రవితో కలిసి ఈవెంట్స్ చేస్తోంది. పవన్ కల్యాణ్ పై అభిమానాన్ని చాటుకునే అషూ రెడ్డి సోషల్ మీడియాలో తన అభిమానులతో నిత్యం టచ్లోనే ఉంటూ తన ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటోంది. ఈక్రమంలోనే ఆమె తన ఫోటోలు, వీడియోస్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది.

తాజాగా తన ఇన్ స్ట్రాలో అషూ రెడ్డి ఓ వీడియోను పోస్టు చేసింది. లంగావోణిలో షొటో షూట్ చేస్తున్నట్లు చూపించారు. క్లీవేజ్ షో చేస్తూ దిగిన ఫొటో షూట్‌ను సైతం షేర్ చేసింది. కాగా ఆమె కింద కూర్చుని ఉన్న ఫొటోలపై నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. వీటిపై మీమ్స్ క్రియేట్ చేస్తూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.

దీనిపై యాంకర్ రవి స్పందిస్తూ యాంకర్ రవి తాజా స్పందిస్తూ తన ఇన్‌స్టాలో ఓ వీడియోను షేర్ చేశాడు. ‘హ్యాపీ డేస్ షో’లో గ్యాప్‌లో అషు రెడ్డి లంగావోణీలో ఫొటోషూట్ చేస్తున్నది చూపించాడు. ఈ సందర్భంగా ‘ఇది సార్ అరాచకం.. ఈ ఫోజులేంటో కానీ, మేడం.. ఈ డ్రెస్ మీద కూడా ఆ ఫోజులేంటి మేడం?.. చెప్పొచ్చు కదరా.. నువ్వైనా మంచి ఫోజులు పెట్టమని’ అంటూ కెమెరామెన్‌కు రవి క్లాస్ పీకాడు.

అంతేకాదు ‘సోషల్ మీడియాలో మీ ఫొటోలకు పిచ్చపిచ్చ మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు’ అంటూ కామెంట్ చేశాడు. దీంతో అషు రెడ్డి పక్కనే ఉన్న అసిస్టెంట్.. ‘మీమ్స్ పెట్టాలనే కదా.. ఈ ఫొటోలు అప్‌లోడ్ చేసేది’ అంటూ ఆమె బండారం బయటపెట్టేశాడు. ఆ వెంటనే అషు రెడ్డి ఫొటోలు చూస్తూ రవి ‘మరో దరిద్రం రెడీ అయింది’ అంటూ ఆమె గాలి మొత్తం తీసేశాడు.