Homeఎంటర్టైన్మెంట్Allu Arjun and Atlee : అల్లు అర్జున్ కి జంటగా గ్లోబల్ బ్యూటీ, అట్లీ...

Allu Arjun and Atlee : అల్లు అర్జున్ కి జంటగా గ్లోబల్ బ్యూటీ, అట్లీ మూవీపై మైండ్ బ్లోయింగ్ అప్డేట్!

Allu Arjun and Atlee : అల్లు అర్జున్ క్రేజ్ ఎల్లలు దాటేసింది. పుష్ప, పుష్ప 2 చిత్రాలతో ఆయన ఇండియన్ బాక్సాఫీస్ షేక్ చేశాడు. గత ఏడాది డిసెంబర్ లో విడుదలైన పుష్ప 2 ఏకంగా రూ. 1800 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ముఖ్యంగా నార్త్ లో అల్లు అర్జున్ ఇమేజ్ ని అమాంతం పెంచేసింది. ఒక్క హిందీ వెర్షన్ రూ. 800 కోట్ల వరకు వసూలు చేయడం విశేషం. బాలీవుడ్ స్టార్స్ పేరిట ఉన్న రికార్డ్స్ అల్లు అర్జున్ సోలో గా లేపేశాడు. ట్రేడ్ వర్గాలను నివ్వెరపాటుకు గురి చేశాడు. దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన క్రైమ్ అండ్ యాక్షన్ డ్రామా నార్త్ ఆడియన్స్ కి విపరీతంగా నచ్చేసింది.

ఇండియన్ ఇండస్ట్రీ హిట్ నమోదు చేసిన అల్లు అర్జున్ తదుపరి చిత్రం ఏమిటనే చర్చ జరుగుతుండగా, దర్శకుడు అట్లీతో మూవీ దాదాపు కన్ఫర్మ్ అయినట్లు విశ్వసనీయ సమాచారం అందుతుంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. ఏప్రిల్ 8న అల్లు అర్జున్ జన్మదినం. ఈ సందర్భంగా అట్లీ-అల్లు అర్జున్ మూవీని ప్రకటిస్తారట. పూజ కార్యక్రమం కూడా ఆ రోజు ఏర్పాటు చేయనున్నారని సమాచారం.

Also Read : అల్లు అర్జున్ అట్లీ ప్రాజెక్ట్ కి ముహూర్తం ఫిక్స్ అయిందా..?

దాదాపు రూ. 500 కోట్ల బడ్జెట్ తో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ మూవీ రూపొందనుందట. కాగా అల్లు అర్జున్ కి జంటగా హీరోయిన్ ప్రియాంక చోప్రా నటిస్తుందని సమాచారం. ప్రియాంక చోప్రాతో దర్శకుడు అట్లీ చర్చలు జరిపాడట. ఆమె పచ్చ జెండా ఊపింది అంటూ కథనాలు వెలువడుతున్నాయి. ప్రియాంక చోప్రా ప్రస్తుతం హాలీవుడ్ చిత్రాలు చేస్తుంది. ఆమెకు గ్లోబల్ ఫేమ్ ఉంది. పెద్ద ఎత్తున అల్లు అర్జున్ మూవీని ప్లాన్ చేస్తున్న క్రమంలో ప్రియాంక చోప్రాను ఎంచుకున్నారని టాక్.

కాగా మహేష్ బాబు-రాజమౌళి మూవీలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ మూవీలో ప్రియాంక చోప్రా నటిస్తే ఆమెకు వరుసగా ఇది రెండో తెలుగు చిత్రం అవుతుంది. గతంలో రామ్ చరణ్ కి జంటగా ప్రియాంక చోప్రా జంజీర్ మూవీ చేసింది. ఇది డిజాస్టర్ కావడంతో మరలా తెలుగులో నటించలేదు. ఇక అల్లు అర్జున్ అట్లీ ప్రాజెక్ట్ అనంతరం దర్శకుడు త్రివిక్రమ్ తో మూవీ చేయాల్సి ఉంది. త్రివిక్రమ్ మూవీని పక్కన పెట్టి అట్లీతో ఆయన సినిమా చేస్తున్నారు.

Also Read : అల్లు అర్జున్ అట్లీ తో చేస్తున్న సినిమా పునర్జన్మల కాన్సెప్ట్ తో వస్తుందా..?

RELATED ARTICLES

Most Popular