Ramanaidu Studios: ఏపీలో పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. తాజాగా విశాఖలో రామానాయుడు స్టూడియోస్ కు( ramanaidu studios ) కేటాయించిన భూములను వెనక్కి తీసుకునేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాదాపు 15 ఎకరాల భూమిని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు సిద్ధపడింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. కొద్ది రోజుల కిందటే ఏపీ శాసనసభలో విశాఖ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు ఇదే అంశాన్ని ప్రస్తావించారు. రామానాయుడు స్టూడియోలో వినియోగించని భూములను వెనక్కి తీసుకోవాలని కోరారు. దీంతో ఈ అంశం తెరపైకి వచ్చింది. అయితే వెనువెంటనే ప్రభుత్వం స్పందించి చర్యలు చేపట్టడం విశేషం. ఇది ఒక్క విధంగా రామానాయుడు స్టూడియో యాజమాన్యానికి షాక్ ఇచ్చినట్టే.
Also Read: పవన్ నీడలా వెంటాడుతున్న ప్రకాష్ రాజ్.. తాజాగా సంచలన ట్వీట్!
* రామానాయుడు విన్నపం మేరకు..
1999లో తెలుగుదేశం పార్టీ( Telugu Desam Party) అధికారంలోకి వచ్చింది. ఆ సమయంలో టిడిపి ఎంపీగా రామానాయుడు( TDP MP Raman Naidu ) ప్రాతినిధ్యం వహించేవారు. ఆయన బాపట్ల నుంచి ఎంపీగా గెలిచారు. అయితే విశాఖలో సినీ పరిశ్రమ అభివృద్ధికి స్టూడియో కడతానని.. భూములు కేటాయించాలని కోరడంతో అప్పటి టిడిపి ప్రభుత్వం.. రుషికొండ బీచ్ సమీపంలో భూమిని మంజూరు చేసింది. అయితే అప్పట్లో కొంత మేర స్టూడియో ను నిర్మించారు. అయితే స్టూడియో కట్టగా మిగులు భూమిగా మరో 15 ఎకరాలు ఉండిపోయింది. అయితే విశాఖ రామానాయుడు స్టూడియోలో అడపాదడపా సినిమా షూటింగులు జరుగుతున్నాయి. విశాఖలో ఎక్కువగా అవుట్ డోర్ షూటింగులు జరుగుతుంటాయి. ఈ తరుణంలో రామానాయుడు స్టూడియోలో ఖాళీ భూములు అలానే ఉండిపోయాయి. అయితే అక్కడ నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు ప్రారంభం కావడంతో టిడిపి, జనసేన నేతలు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో యధావిధిగా ఆ నిర్మాణాలు అక్కడే ఉండిపోయాయి. ఇప్పుడు అదే భూమిని ప్రభుత్వం వెనక్కి తీసుకోవడానికి నిర్ణయం తీసుకుంది.
* తెర వెనుక వైయస్సార్ కాంగ్రెస్ నేతలు.
వాస్తవానికి గత వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) ప్రభుత్వ హయాంలో రామానాయుడు స్టూడియోస్ భూములు వెనక్కి తీసుకునేందుకు ప్రయత్నాలు జరిగినట్లు తెలుస్తోంది. అయితే అప్పట్లో యాజమాన్యాన్ని బెదిరించి కొందరు వైయస్సార్ కాంగ్రెస్ నేతలు ఆ మిగులు 15 ఎకరాలను స్వాధీనం చేసుకుని విల్లాలు కట్టడానికి నిర్ణయించారు. అయితే 2022లో రామానాయుడు స్టూడియోస్ యాజమాన్యంతో గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కు దరఖాస్తు చేయించారు. ఆ మిగులు భూమి గృహ అవసరాల నిమిత్తం వాడుకుంటామని ఆ వినతి లో పేర్కొన్నారు. దీంతో జీవీఎంసీ అనుమతి ఇచ్చింది. అయితే వాస్తవానికి రామానాయుడు స్టూడియోస్ యాజమాన్యానికి బెదిరించి ఆ పదిహేను ఎకరాలు ఓ వైయస్సార్ కాంగ్రెస్ నేత లాక్కున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనిపైనే కోర్టును ఆశ్రయించారు విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు. రామానాయుడు కుటుంబం టిడిపి పట్ల సానుకూలంగా ఉంటుంది. కానీ ఆ ఫ్యామిలీ జోలికి కూటమి ప్రభుత్వం వెళ్లే పరిస్థితి లేదు. కానీ ఆ మిగులు భూమి వెనుక వైసీపీ నేతలు ఉండడంతోనే ప్రభుత్వం ఈ చర్యలకు దిగినట్లు తెలుస్తోంది.
* మిగులు భూమి స్వాధీనం..
అయితే రామానాయుడు స్టూడియో లో సినిమా షూటింగ్ లు అంతంత మాత్రమే. అయితే ఈ మిగులు భూమి వరకే కూటమి ప్రభుత్వం( Alliance government ) ఫోకస్ పెట్టింది. ఆ మిగులు భూమి స్వాధీనం వెనుక వైయస్సార్ కాంగ్రెస్ నేతల హస్తం ఉందన్నది అనుమానం. అందుకే కూటమి ప్రభుత్వం ఈ చర్యలకు దిగినట్లు తెలుస్తోంది. అయితే రామానాయుడు పూర్వాశ్రమంలో తెలుగుదేశం ఎంపీ. టిడిపిలో చాలా కాలం పాటు కొనసాగారు. రామానాయుడు కుటుంబం సైతం టిడిపి తో కానీ, చంద్రబాబుతో కానీ ఎటువంటి విభేదాలు లేవు. కానీ ఆ స్టూడియో భూములను వెనక్కి తీసుకోవడం మాత్రం ఇప్పుడు సంచలనంగా మారుతోంది. వారిని సంప్రదించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.