
Ram Gopal Varma: జనాల్లో 90 శాతం గొర్రెలే అంటాడు వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. వాళ్లంతా ఏ కామెంట్ చేస్తే.. ఎలా రియాక్ట్ అవుతారన్నది తనకు పూర్తిగా తెలుసు అంటాడు. అతను చెప్పింది అక్షరాలా నిజమనేలా.. ఆర్జీవీ విషయంలో రియాక్ట్ అవుతుంటారు జనం. వర్మ ఓ ట్వీట్ చేసినా.. ఓ సినిమా తీసినా.. మరో ఇంటర్వ్యూ ఇచ్చినా.. ఏదైనా వీడియో వదిలినా.. ప్రతి దానికీ జనాల్లో అటెన్షన్ క్రియేట్ అవుతుంది. అందుకే.. ఆర్జీవీతో ఇండస్ట్రీకి పరిచయమైన దర్శకులు ఫేడౌట్ అయి వెళ్లిపోయారు. ఆర్జీవీ శిష్యులుగా ఆయన కంపెనీ నుంచి వచ్చిన వారు కూడా అస్త్రసన్యాసం చేశారు. కానీ.. వర్మ మాత్రం పాపులారిటీ పెంచుకుంటూ ముందుకే సాగుతున్నాడు. అలాంటి ఆర్జీవీ ఇప్పుడు ఇంటర్వ్యూలతో రచ్చ చేస్తున్నాడు.
మొన్నటికి మొన్న బిగ్ బాస్ బ్యూటీ అరియానాతో.. జిమ్ సెంటర్లో నడిపించిన బోల్డ్ ఇంటర్వ్యూ ఏ స్థాయిలో రచ్చ చేసిందో తెలిసిందే. ఆ తర్వాత మరో బిగ్ బాస్ బ్యూటీ అషూ రెడ్డి కూడా వర్మతో ఇంటర్వ్యూకు సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పటికే దుమారం రేపాయి. ఆ తర్వాత విడుదల చేసిన టీజర్ కూడా వైరల్ అయ్యింది. వర్మ చేసిన ప్రైవేటు కామెంటుకు.. చెంప పగలగొట్టింది అషూరెడ్డి. దీంతో.. ఈ ఇంటర్వ్యూ రిలీజ్ కాకుండానే కావాల్సినంత ఫేమ్ వచ్చేసింది.
అషూ-వర్మ ఇంటర్వ్యూ నేటి నుంచి ప్రసారం కానుంది. ఈ నేపథ్యంలో మరో వీడియోను రిలీజ్ చేశాడు వర్మ. ‘నీ థైస్ నాకు ఇష్టం’ అని చెప్పడంతో.. ఆగ్రహించిన అషూ చెంప మీద కొడుతుంది. ఒక అమ్మాయితో అలా ఎలా మాట్లాడతారు అని ప్రశ్నించగా.. తన లక్ష్యం నెరవేరిందని చెబుతాడు వర్మ. అదేమంటే.. చెంప దెబ్బ కొట్టడం ద్వారా.. నీ చేతి స్పర్శ నాకు తగిలింది అంటాడు. ప్రస్తుతం ఈ వీడియో బిట్ కూడా వైరల్ అవుతోంది.
మొత్తానికి.. అషూరెడ్డి, ఆర్జీవీ ఇంటర్వ్యూ రిలీజ్ కాకుండానే వార్తల్లో నిలుస్తోంది. మొన్న ఓ ఫొటో రిలీజ్ చేసిన ఆర్జీవీ.. తామిద్దరం ఐస్ క్రీమ్ తింటూ.. శృంగారం గురించి మాట్లాడుకున్నాం అని ట్వీట్ చేశాడు. ఆ తర్వాత ఫస్ట్ లుక్ ప్రోమోలో చెంప దెబ్బ తిన్నాడు. ఇప్పుడు దానికి రీజన్ ఏం చెప్పాడు. ఈ విధంగా.. తనదైన ప్రమోషన్ తో ఇంటర్వ్యూపై ఆసక్తి పెంచుతున్నాడు వర్మ. ఇవాళ సాయంత్రం 6 గంటల తర్వాత వీరి ఇంటర్వ్యూ ఆన్ లైన్లో రచ్చ చేయనుంది. మరి, ఆ ఇంటర్వ్యూలో ఇంకెలాంటి బోల్డ్ డిస్కషన్ కొనసాగిందో చూడాలి.