Ekaki Trailer Talk: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు గొప్ప సినిమాలను చేస్తూన్నారు. ఇక అదే విధంగా కొత్త హీరోలు, కొత్త దర్శకులు సైతం సినిమాలను చేయడానికి ఆసక్తి చూపిస్తూ ఉండడం విశేషం… ప్రస్తుతం థియేటర్లోనే కాకుండా ఓటిటిలో కూడా ఎక్కువ సినిమాలు సందడి చేస్తున్నాయి. ఇక ఓటీటీతో పాటు యూట్యూబ్ లో కూడా చాలా సిరీస్ లు రిలీజ్ అవుతూ ప్రేక్షకులందరికి ఎంటర్ టైన్ మెంట్ ను అందిస్తున్నాయి. ఇక ఇలాంటి క్రమంలోనే ఈనెల 27వ తేదీ నుంచి ‘ఏకాకి’ అనే ఒక సిరీస్ యూట్యూబ్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇక ఇలాంటి క్రమంలోనే ఈ సిరీస్ లో ఏడుగురు స్నేహితుల జీవితంలోకి ఒక దెయ్యం ఎంటరైతే ఎలా ఉంటుంది. వాళ్ల కెరియర్ లో ఆ దెయ్యం ఎలాంటి కీలకపాత్ర పోషించబోతోంది. ఆ ఏడుగురికి ఆ దెయ్యానికి మధ్య ఉన్న సంబంధమేంటి? ఎవరు దానికి అన్యాయం చేశారు. ఎవరికోసం ఆ దెయ్యం తిరుగుతోందనే ఒక క్యూరియాసిటీ రేకెత్తించే విషయంతో ట్రైలర్ రిలీజ్ చేశారు.
ఇక మొత్తానికైతే ఈ ట్రైలర్ ని కనక మనం అబ్జర్వ్ చేసినట్లయితే విజువల్స్ ఓకే అనిపించినప్పటికి డబ్బింగ్ మాత్రం అంత ఎఫెక్టివ్ గా అనిపించలేదు. మొత్తానికైతే ఫ్రీగా దొరికే కంటెంట్ అయినప్పటికి ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఇంకాస్త ఎఫెక్టివ్ గా వర్క్ చేస్తుంటే బాగుండేదేమో అనిపించేలా ట్రైలర్ ను చూస్తే అనిపిస్తోంది…
ఇక ట్రైలర్ ను చూస్తే ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో డిఫరెంట్ థాట్ తో ముందుకు దూసుకెళ్లే వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతున్నారు. అలాంటి విషయాలను దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగితే మంచిది. లేకపోతే మాత్రం చాలా వరకు విమర్శలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి రావచ్చు.
ఇక ఏకాకి ట్రైలర్ ఎంగేజింగ్ గా అనిపించినప్పటికి సినిమాలో పెద్దగా మ్యాటర్ ఉన్నట్టుగా అయితే అనిపించట్లేదు… ఎందుకంటే ఇలాంటి కథతో చాలా మంది చాలా సినిమాలు చేశారు…అన్ని కూడా హార్రర్ నేపథ్యంలో తెరకెక్కినవే కావడం విశేషం… దీంట్లో ఏదైనా కొత్త పాయింట్ చెబితే సినిమా ప్రేక్షకులకు నచ్చుతోంది లేకపోతే మాత్రం ఫెయిలై పోతోంది…
