Aluminum: అల్యూమినియం పాత్రల్లో వంట చేస్తున్నారా?

అల్యూమినియం పాత్రల్లో వంట చేసుకొని తినే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. అయితే వీటి ధర కాస్త తక్కువ ఉండటం. ఎక్కువ అందుబాటులో ఉండటంతో వీటిని కొనుగోలు చేసే వారి సంఖ్య పెరుగుతుంది.

Written By: Swathi, Updated On : June 21, 2024 11:15 am

Aluminum

Follow us on

Aluminum: ఒకప్పుడు కేవలం మట్టి పాత్రల్లో మాత్రమే వంట చేసుకొని తినే వారు. ఇప్పుడు రకరకాల వస్తువులు పెరిగిపోయాయి. దీంతో ఎలాంటి వాటిలో వండకూడదో అలాంటి పాత్రల్లోనే వండుతున్నారు. స్టైల్ గా వంటిల్లు కనిపించాలని కూడా చాలా వస్తువులను తీసుకొని వస్తున్నారు. ఇలాంటి వాటితో ముప్పు పెరుగుతుంది అంటున్నారు నిపుణులు. అయితే మీరు అల్యూమినియం పాత్రల్లో వంట చేస్తున్నారా?

అల్యూమినియం పాత్రల్లో వంట చేసుకొని తినే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. అయితే వీటి ధర కాస్త తక్కువ ఉండటం. ఎక్కువ అందుబాటులో ఉండటంతో వీటిని కొనుగోలు చేసే వారి సంఖ్య పెరుగుతుంది. కానీ వీటిలో వంట చేయకూడదు అంటున్నారు నిపుణులు. ఈ పాత్రలను ముందుగా ఆంగ్లేయులు పరిచయం చేశారాట. ఇక దీన్ని సీమండి సీమండి అంటారు ప్రజలు. అంటే సీమ వెండి అని అర్థం. కేవలం వెండి రంగులో ఉండే ఫారిన్ పాత్రలు అని అర్థం. అంటే ఇవి వెండి పాత్రలు కావు.

అల్యూమినియం పాత్రల్లో వంట చేయడం నేర్పింది కేవలం ఆంగ్లేయులు అంటారు నిపుణులు. ఇందులో వంటలు చేసుకొని తినడం వల్ల శరీరంలో ఉండే పూర్తి శక్తి నశిస్తుందట. అందుకే మట్టి పాత్రలను ఉపయోగించాలి అంటున్నారు నిపుణులు. మంటి పాత్రల వాడకం పెరిగితే చాలా ప్రయోజనాలు కూడా ఉంటాయట. అయితే మీరు ఒక విషయం గమనిస్తే చాలా మంది శ్రామికులు బలంగా ఉంటారు. వీరి ఇప్పటికి కూడా మట్టి పాత్రల్లోనే వంట చేస్తుంటారు.

మరి అల్యూమినియం కాకుండా ఎలాంటి పాత్రలు వాడాలి అని ఆలోచిస్తున్నారా? రాగి, ఇత్తడి, మట్టి , స్టెయిన్ లెస్ స్టీల్ వంటి పాత్రలను వంట చేయడానికి ఉపయోగించడం వల్ల మీకు ఎలాంటి హానీ ఉండదు. కాబట్టి ఇకనైనా మీ వంటిట్లో కాస్త చేంజ్ చేసుకోవడం అవసరం అంటున్నారు నిపుణులు. థింక్ అండ్ ఛేంజ్

ఈ వార్త కేవలం సోషల్ మీడియాలో ఉన్న సమాచారం, నిపుణుల సలహాల మేరకు మాత్రమే మీకు అందిస్తున్నాము. దీన్ని ఒకే తెలుగు నిర్దారించదు.