Bigg Boss 9 Telugu Asha Saini: మరికొద్ది గంటల్లో ప్రారంభం కానున్న ‘బిగ్ బాస్ 9′(Bigg Boss 9 Telugu) గ్రాండ్ లాంచ్ విశేషాలు సోషల్ మీడియా లో లీకై బాగా వైరల్ అయ్యింది. నిన్న జరిగిన ఈ ఎపిసోడ్ షూటింగ్ లో 14 మంది కంటెస్టెంట్స్ హౌస్ లోపలకు అడుగుపెట్టేశారు. అందులో 9 మంది సినీ సెలబ్రిటీలు ఉండగా 5 మంది ‘అగ్నిపరీక్ష’ ద్వారా ఎంపికైన సామాన్యులు ఉన్నారు. సెలబ్రిటీస్ లిస్ట్ లో ఆశా షైనీ(Asha Saini) అలియాస్ ఫ్లోరా షైనీ(Flora Saini) కూడా ఉంది. ఈమె ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘నరసింహా నాయుడు’ వంటి చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ముఖ్యంగా ‘లక్స్ పాపా..లక్స్ పాపా’ పాటలో ఈమె బాలయ్య తో కలిసి వేసిన చిందులను ప్రేక్షకులు అంత తేలికగా మర్చిపోలేరు. తెలుగు లో ఈమె దాదాపుగా 50 సినిమాల్లో నటించిందట. ఇప్పుడు ఈమె బిగ్ బాస్ 9 లో ఒక కంటెస్టెంట్ గా అడుగుపెట్టింది. ఈమె బ్యాక్ గ్రౌండ్ ఏంటో ఒకసారి చూద్దాం.
ఫ్లోరా షైనీ తండ్రి ఒక ఇండియన్ ఆర్మీ ఆఫీసర్. ఇంటికి ఒక్కగానొక్క బిడ్డ అన్నమాట. సినిమాల మీద మక్కువ తో ఈమె 1999 వ సంవత్సరం లో ప్రేమ కోసం అనే చిత్రం ద్వారా వెండితెర అరంగేట్రం చేసింది. ఆమె అసలు పేరు ఫ్లోరా షైనీ అయినప్పటికీ, ఆ చిత్ర నిర్మాత ఆశా షైనీ గా మార్చాడట. ఈ విషయం తనకు కూడా తెలియదట. పక్కరోజు న్యూస్ పేపర్ లో ఆశా షైనీ అనే పేరు కనపడడం తో నిర్మాతని అడగ్గా, ఆయన తన పేరు మార్చానని చెప్పినట్టు ఆమె ఈ సందర్భంగా చెప్పుకొచ్చింది. అలా మొదలైన ఫ్లోరా షైనీ కెరీర్ ఈవీవీ సత్యనారాయణ తెరకెక్కించిన ‘చాలా బాగుంది’ అనే చిత్రం తో ఆడియన్స్ దృష్టిలో పడింది. ఈ సినిమా కమర్షియల్ గా పెద్ద హిట్ అవ్వడం తో ఆశా షైనీ కి వరుసగా అవకాశాలు వచ్చాయి.
తెలుగు లో ఈమెకు ‘చాలా బాగుంది’ తర్వాత ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘నరసింహా నాయుడు’ చిత్రాలు మాత్రమే మంచి గుర్తింపు తెచ్చింది. ఆ తర్వాత అనేక సినిమాల్లో నటించినప్పటికీ కావాల్సినంత బ్రేక్ మాత్రం ఈమెకు దొరకలేదు. అంతే కాదు ఈమె బాలీవుడ్ లో కూడా అనేక సినిమాల్లో నటించింది. 2004 వ సంవత్సరం లో ఈమె బాలీవుడ్ లోని ఒక టాప్ నిర్మాత తో ప్రేమలో పడింది. అతనితో ప్రేమాయణం నడుస్తున్న రోజుల్లో ఈమెని ప్రతీ చిన్న విషయానికి కొట్టేవాడట. గృహ హింస తట్టుకోలేక ఆయన నుండి విడిపోయింది. తన నుండి విడిపోయిన తర్వాత ఆ నిర్మాత ఈమెని అనేక విధాలుగా టార్చర్ పెట్టాడట. సినిమా అవకాశాలు రానివ్వకుండా చేసాడట . కానీ వాటి అన్నిటిని ఎదురుకొని ఈమె సక్సెస్ గా తన సినీ కెరీర్ ని ఇప్పటి వరకు నెట్టుకొచ్చింది. మరి ఈమె బిగ్ బాస్ లో ఎన్ని రోజులు కొనసాగగలదో చూడాలి.