Bigg Boss 9 Telugu Ramu Rathod: మరి కాసేపట్లో బిగ్ బాస్ 9(Bigg Boss 9 Telugu) గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్ స్టార్ మా ఛానల్ లో టెలికాస్ట్ కానుంది. నిన్న షూటింగ్ కూడా పూర్తి అవ్వడంతో, హౌస్ లోపలకు అడుగుపెట్టిన కంటెస్టెంట్స్ లిస్ట్ బయటకు వచ్చేసింది. ఆ కంటెస్టెంట్స్ లో ఒకరు రాము రాథోడ్(Ramu Rathod). ‘రాను బొంబాయి కి రాను’ అంటూ సంచలనం సృష్టించిన తెలంగాణ ఫోక్ సాంగ్ రచయత ఇతను. యూట్యూబ్ లో ఈ పాటకు 530 మిలియన్ కి పైగా వ్యూస్ వచ్చాయి. ఈ పాటకు ముందు ఆయన కంపోజ్ చేసిన ‘సొమ్మసిల్లిపోతున్నావే’ పాట కూడా సెన్సేషనల్ హిట్ అయ్యింది. ఈ పాటకు కూడా యూట్యూబ్ లో 340 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఇలా తెలంగాణ ఫోక్ సాంగ్స్ తో జనాలను ఉర్రూతలూ ఊగించిన రామ్ రాథోడ్ గురించి ఎవరికీ తెలియని కొన్ని ఆసక్తి కరమైన విషయాలు ఇప్పుడు మీ ముందు ఉంచబోతున్నాము.
ఈయన ఒక పేద కుటుంబానికి చెందిన వ్యక్తి. ఇంట్లో ఇతనికంటే అందరూ పెద్ద వాళ్ళే. అయితే చిన్నతనం నుండి రాము రాథోడ్ కి డ్యాన్స్ మీద విపరీతమైన మక్కువ ఉండేది. గ్రామం లెవెల్ లో, స్టేట్ లెవెల్ లో ఎన్నో డ్యాన్స్ పోటీలలో పాల్గొని ట్రోఫీలు సంపాదించిన చరిత్ర ఉంది. కానీ తల్లి తండ్రులకు భారం అవుతున్నాను, వాళ్ళకోసం పని చేసి ఎంతో కొంత ఇంటికి నేను సహాయపడాలి అనే తపన తో కేవలం మూడు వేల రూపాయిల జీతానికి ఆయన పని చేసేవాడట. 2020 వ సంవత్సరం తర్వాత కరోనా ఎంతో మంది జీవితాన్ని మార్చినట్టు రాజు రాథోడ్ జీవితాన్ని కూడా మార్చేసింది అట. ఖాళీగా ఇంట్లో కూర్చుంటే ఏమొస్తాది, పాటలు రాయడం నేర్చుకుంటే బెటర్ ని పాటలు రాయడం నేర్చుకున్నాడట. ఆ రోజుల్లో టిక్ టాక్ ద్వారా తానూ రాసుకున్న పాటలను పాడి వాటిని అప్లోడ్ చేయగా అది బాగా వైరల్ అయ్యిందట.
అలా చిన్నగా పాపులారిటీ ని సంపాదించుకుంటూ వెళ్లిన రాము రాథోడ్ కెరీర్ ని మలుపు తిప్పిన పాట ‘సొమ్మసిల్లి పోతున్నావే ఓ చిన్నా రాములమ్మా’. లాక్ డౌన్ సమయం లో రాసుకున్న ఈ పాట తో ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. ఇక ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఈ పాట తర్వాత ఆయన కంపోజ్ చేసిన ‘రాను బొంబాయి కి రాను’ అనే పాట ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు పుట్టించి ఇప్పుడు ఆయన్ని కోట్లాది మంది ప్రేక్షకులు వీక్షించే బిగ్ బాస్ సీజన్ 9 లాంటి రియాలిటీ షో వైపు వరకు అడుగులు వేసేలా చేసింది. మరి ఈ షో ద్వారా ఆయన ఎలా ఆడియన్స్ ని అలరిస్తాడో చూడాలి.