Nayanthara Twin Boys: సౌత్ ఇండియా లో లేడీ సూపర్ స్టార్ ఎవరు అని అడిగితె టక్కుమని మన అందరికి గుర్తుకు వచ్చే పేరు నయనతార..ఎందుకంటే ఆమె కేవలం గ్లామర్ రోల్స్ కి మాత్రమే పరిమితం అవ్వలేదు..కెరీర్ ప్రారంభం నుండి నటనకి ప్రాధాన్యం ఉన్న పాత్రలనే పోషిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకొని యూత్ నుండి ఫామిలీ ఆడియన్స్ వరుకు అన్ని వర్గాల ప్రేక్షకుల ఆధారణని దక్కించుకుంది..అందుకే ఆమెకి సూపర్ స్టార్ స్టేటస్ దక్కింది..అయితే ఈ ఏడాది ఆమె తన ప్రియుడు విఘ్నేష్ ని పెళ్లాడిన సంగతి మన అందరికి తెలిసిందే..ఇప్పుడు వీళ్లిద్దరికీ కవల పిల్లలు కూడా పుట్టేసారట..ఈ విషయాన్నీ నయనతార భర్త విఘ్నేష్ ట్విట్టర్ లో అభిమానులతో పంచుకున్నాడు..’నయనతార నేను ఇద్దరు కవలపిల్లలకు తల్లితండ్రులయ్యాము..ఈ ఫీలింగ్ ని నేను జీవితంలో మర్చిపోలేను’ అంటూ ఒక ఫోటో పెట్టి ఆయన వేసిన ట్వీట్ కి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది..ఇంత తొందరగా పిల్లలు ఎలా పుట్టారంటూ అభిమానులు సైతం ఆశ్చర్యపోయారు.

ఇక సోషల్ మీడియా అన్న తర్వాత కొంతమంది నెటిజెన్స్ తమ టైమింగ్ తో ప్రతి సందర్భం లో కామెడీ చేస్తూ ఉండే విషయం మన అందరికి తెలిసిందే..అలా ఒక నెటిజెన్ నయనతార ని ఉద్దేశిస్తూ జూనియర్ ఎన్టీఆర్ వీడియో ని వెయ్యగా అది సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది..నయనతార మరియు జూనియర్ ఎన్టీఆర్ కలిసి గతం లో అదుర్స్ అనే సూపర్ హిట్ చిత్రం లో నటించిన సంగతి మన అందరికి తెలిసిందే..ఈ సినిమా లో స్విమ్మింగ్ పూల్ లో నయనతార దూకినప్పుడు ఎన్టీఆర్ కూడా స్విమ్మింగ్ పూల్ లో దూకి నయనతార ని పైకి లాగుతాడు.

అప్పుడు నయనతార తో వాగ్వివాదం చేస్తున్న సమయంలో ఎన్టీఆర్ ‘మీకు ఆ మాత్రం కోపం ఉంటుంది లేండి..మీ ఎడమ నడుము మడత దగ్గర పుట్టుమచ్చ ఉంది..మచ్చ శాస్త్రం ప్రకారం మీకు కవలపిల్లలు పుడతారు’ అంటూ ఎన్టీఆర్ ఒక డైలాగ్ చెప్తాడు..సరిగ్గా ఇప్పుడు నయనతార కి కవల పిల్లలు పుట్టడం తో ఆ నెటిజెన్ వేసిన ఈ వీడియో తెగ వైరల్ గా మారిపోయింది.