Godfather- Salman Khan: మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన గాడ్ ఫాదర్ చిత్రం ఇటీవలే విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సంగతి మన అందరికి తెలిసిందే..మెగాస్టార్ చిరంజీవి ని సరికొత్త కోణం లో చూపించి తన అభిమానం ని చాటుకున్నాడు ఆ చిత్ర దర్శకుడు మోహన్ రాజా..ఇక ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్ర ద్వారా తళుక్కుమని మెరిసిన బాలీవుడ్ మెగాస్టార్ సల్మాన్ ఖాన్ సీన్స్ కి థియేటర్స్ లో అదిరిపొయ్యే రెస్పాన్స్ వచ్చింది..వాస్తవానికి సల్మాన్ ఖాన్ లాంటి బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ మన తెలుగు స్టార్ హీరో సినిమాల్లో ఇలాంటి పాత్రలు చెయ్యడానికి ఇష్టపడరు..కానీ దశాబ్దాల నుండి చిరంజీవి కుటుంబం తో సల్మాన్ ఖాన్ కి ఉన్న అనుబంధం వల్ల చిరంజీవి గారు అడగగానే వెంటనే ఒప్పుకొని ఆ పాత్రలో నటించాడు సల్మాన్ ఖాన్..మరో గొప్ప విషయం ఏమిటి అంటే ఈ పాత్ర చేసినందుకు గాను ఆయన ఒక్క రూపాయి రెమ్యూనరేషన్ కూడా తీసుకోలేదట..ఈ విషయాన్నీ స్వయంగా మెగాస్టార్ చిరంజీవి గారే చెప్పుకొచ్చారు.

అయితే ఈ సినిమా మలయాళం లో సూపర్ హిట్ గా నిలిచిన మోహన్ లాల్ లూసిఫెర్ సినిమాకి రీమేక్ అనే విషయం మన అందరికి తెలిసిందే..మలయాళం లో సల్మాన్ ఖాన్ పాత్రని అక్కడి స్టార్ హీరో పృద్వి రాజ్ సుకుమారన్ చేసాడు..అయితే తెలుగు లో ఈ సినిమా రీమేక్ చేసే ముందు ఈ పాత్రకి ఎవరైతే బాగుంటారు అని ఇద్దరు ముగ్గురు హీరోల పేర్లు అనుకున్నారట..చివరికి ఆ పాత్ర ని వరుణ్ తేజ్ తో చేయిస్తే బాగుంటుందని చిరంజీవి గారు వరుణ్ తేజ్ ని సంప్రదించేందుకు సిద్ధం అయ్యారట..ఇదే విషయాన్నీ డైరెక్టర్ మోహన్ రాజా కి చెప్పగా..ఈ పాత్ర కి మీతో సరిసమానమైన ఇమేజి ఉన్న హీరో చేస్తేనే బాగుంటుంది..ఒక్కసారి సల్మాన్ ఖాన్ గారిని అడిగి చూడండి అని డైరెక్టర్ మోహన్ రాజా చిరంజీవి గారిని కోరారట.

ఆ తర్వాత సల్మాన్ ఖాన్ ఒప్పుకొని ఈ పాత్ర చెయ్యడం ..చివర్లో ఒక సాంగ్ కూడా చెయ్యడం అన్ని చకచకా జరిగిపోయాయి..సల్మాన్ ఖాన్ పాత్ర వల్ల ఈ చిత్రానికి బాలీవుడ్ లో కూడా అదిరిపొయ్యే వసూళ్లు వచ్చాయి..కేవలం వీకెండ్ నుండే ఈ సినిమాకి సుమారు 20 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు వచుంటాయని అంచనా వేస్తున్నారు బాలీవుడ్ ట్రేడ్ పండితులు.