https://oktelugu.com/

Drug case: ఆర్యన్​ ఖాన్​ కేసులో కీలక మలుపు.. దర్యాప్తు చేసే అధికారి తొలగింపు!

Drug case: ముంబయి క్రూయిజ్​ షిప్​ డ్రగ్​ కేసులో రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా, ఎన్సీబీ ఈ కేసులో కీలక నిర్ణయం తీసుకుంది. అవినీతి ఆరోపణల కారణంగా ఈ కేసు దర్యాప్తు నుంచి ఎన్సీబీ జోనల్​ డైరెక్టర్​ సమీర్​ వాంఖడను తప్పిస్తున్నట్లు డీజీ ఉత్తర్వులు జారీ చేశారు. అతని స్థానంలో సంజయ్​ సింగ్​ను విచారణ నిమిత్తం నియమించారు. వాంఖడేను ఢిల్లీలో ఎన్సీబీ కేంద్ర కార్యాలయానికి బదిలీ చేశారు. ఇకపై ఆర్యన్‌ఖాన్‌ కేసు సహా మొత్తం ఆరు డ్రగ్‌ […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : November 6, 2021 / 09:59 AM IST
    Follow us on

    Drug case: ముంబయి క్రూయిజ్​ షిప్​ డ్రగ్​ కేసులో రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా, ఎన్సీబీ ఈ కేసులో కీలక నిర్ణయం తీసుకుంది. అవినీతి ఆరోపణల కారణంగా ఈ కేసు దర్యాప్తు నుంచి ఎన్సీబీ జోనల్​ డైరెక్టర్​ సమీర్​ వాంఖడను తప్పిస్తున్నట్లు డీజీ ఉత్తర్వులు జారీ చేశారు. అతని స్థానంలో సంజయ్​ సింగ్​ను విచారణ నిమిత్తం నియమించారు. వాంఖడేను ఢిల్లీలో ఎన్సీబీ కేంద్ర కార్యాలయానికి బదిలీ చేశారు. ఇకపై ఆర్యన్‌ఖాన్‌ కేసు సహా మొత్తం ఆరు డ్రగ్‌ కేసులను సంజయ్‌ సింగ్‌ నేతృత్వంలో ఎన్‌సీబీ సెంట్రల్‌ యూనిట్‌ దర్యాప్తు చేయనుంది.సమీర్‌ వాంఖడే చుట్టూ ఎన్నో వివాదాలు చుట్టుముట్టాయి.

     

    బాలీవుడ్​ హీరో షారుఖ్​ఖాన్​ తనయుడు ఆర్యన్​ ఖాన్​ ఈ కేసులో జైలుకు వెళ్లిన సంగతి అందరికి తెలిసిందే. అయితే, ఈ కేసు నుంచి ఆర్యన్​ను తప్పించేందుకు వాంఖడే 25 కోట్లు లంచం అడిగినట్లు ఆరోపణలు చేశారు. మరోవైపు ఎన్సీపీ నేత మహారాష్ట్ర మంత్రి నవాబ్​ మాలిక్​ వాంఖడేను టార్గెట్​ చేస్తూ విమర్శలు గుప్పిస్తూ వచ్చారు. వాంఖడే నకిలీ సర్టిఫికేట్లతో ఉద్యోగం సంపాదించారని ఆరోపించారు. కోట్లకు పడగలెత్తాడని అన్నారు. దీంతో వెంటనే రంగంలోకి దిగిన సెంట్రల్​ ఎన్సీబీ.. వాంఖడేతో పాటు మరికొంత మందిపై విచారణకు ఆదేశించారు. ఆర్యన్​ కేసు దర్యాప్తు జరుగుతుండగానే.. ఆయన్ని కేసను నుండి తప్పించడం ప్రస్తుతం చర్చణీయాంశమైంది. మరోవైపు ఆర్యన్​తో సహా ఆరు డ్రగ్​ కేసులను విచారించేందుకు నేటి నుండి ఎన్సీబీ ప్రత్యేక బృందం దిల్లీ నుంచి ముంబయికి ప్రయాణం కానుంది.