Fun Bucket Bhargav: యూట్యూబర్ ఫన్ బకెట్ భార్గవ్ కు బెయిల్ రద్దు… సెంట్రల్ జైలుకు తరలింపు

Fun Bucket Bhargav: ఫన్ బకెట్ భార్గవ్ సోషల్ మీడియా ద్వారా పాపులారిటీ సంపాదించిన వాళ్ళలో ఇతను కూడా ఒకడు. టిక్ టాక్ లో కామెడీ వీడియోలు చేస్తూ ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు భార్గవ్. ఆ తర్వాత ఫన్ బకెట్ అనే పేరుతో యూట్యూబ్ ప్రారంభించి మరింత చేరువయ్యాడు. అయితే  14 ఏళ్ల బాలికపై అఘాయిత్యానికి ఒడిగట్టి జైలు పాలైన విషయం తెలిసిందే. చెల్లి చెల్లి అని ఓ బాలికను లోబరుచు కోవడంతో ఆ బాలిక […]

Written By: Raghava Rao Gara, Updated On : November 6, 2021 9:55 am
Follow us on

Fun Bucket Bhargav: ఫన్ బకెట్ భార్గవ్ సోషల్ మీడియా ద్వారా పాపులారిటీ సంపాదించిన వాళ్ళలో ఇతను కూడా ఒకడు. టిక్ టాక్ లో కామెడీ వీడియోలు చేస్తూ ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు భార్గవ్. ఆ తర్వాత ఫన్ బకెట్ అనే పేరుతో యూట్యూబ్ ప్రారంభించి మరింత చేరువయ్యాడు. అయితే  14 ఏళ్ల బాలికపై అఘాయిత్యానికి ఒడిగట్టి జైలు పాలైన విషయం తెలిసిందే. చెల్లి చెల్లి అని ఓ బాలికను లోబరుచు కోవడంతో ఆ బాలిక గర్భం దాల్చింది. దీంతో ఏప్రిల్ 16న బాలిక తల్లి పెందుర్తి పోలీసులను ఆశ్రయించారు. ఆ తర్వాత విశాఖ సిటీ దిశ ఏసీపీ ప్రేమ్ కాజల్ ఆదేశాలతో పోలీసులు విచారణ జరిపారు. ‘దిశ’, ఫోక్సో చట్టం కేసు నమోదు చేసి భార్గవ్‌ను హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకుని రిమాండ్‌కి పంపారు. అయితే సుమారు 62 రోజులు జైల్లో ఉండి బెయిల్ పై బయటికి వచ్చాడు.

ఇక బెయిల్ పై బయటకు వచ్చిన భార్గవ్ ప్రస్తుతం కేసు విచారణలో ఉండగా బాధితులను ప్రభావితం చేసేలా ప్రకటనలు చేసినట్లు పోలీసులు తెలిపారు. దాంతో కోర్టు ఆదేశాల మేరకు భార్గవ్ బెయిల్ ను కోర్టు రద్దు చేస్తూ తీర్పు నిచ్చింది. అతన్ని వెంటనే అరెస్ట్ చేసి సెంట్రల్ జైలుకు తరలించాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. అతడు చేసిన పనికి సిగ్గు పడాల్సింది పోయి … ఇంకా ఇంటర్వ్యూ లు ఇస్తూ తానెం చేయలేదు అన్నట్లు బిల్డప్ లు ఇస్తున్నాడు. కోర్టు తీర్పు ఇంకా రాలేదని, తనకి సపోర్ట్ లేదని… ఇండే నిజం అంటూ వీడియో లు చూస్తూ భార్గవ్ చేసిన హడావిడి  అంతా ఇంతా కాదు. ఈ తరుణంలో అతనికి ఇప్పుడు సరైన గుణపాఠం జరిగిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతహ్మ్ ఈ వార్తా సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.