High Court: మందుబాబులకు ఇంతకంటే ఊరట ఉంటుందా?

High Court: మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ ఇబ్బందుల పాలవుతున్నారు. దీంతో ట్రాఫిక్ పోలీసులు నూతన మార్గదర్శకాలు ప్రవేశపెడుతున్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వ్యక్తుల ద్విచక్రవాహనాలను సీజ్ చేస్తూ జరిమానా విధిస్తున్నారు దీంతో రోడ్డు ప్రమాదాల నివారణకు నడుం బిగిస్తున్నారు. డ్రంక్ డ్రైవ్ నిర్వహిస్తూ మద్యం సేవించిన వారిని అదుపులోకి తీసుకుని కోర్టుకు పంపిస్తున్నారు. దీంతో వారు జరిమానాలు కడుతూ మరోసారి తాగమని చెబుతున్నారు. మద్యం తాగి వాహనాలు నడుపుతూ అనేక ప్రమాదాలకు కారకులవుతున్నారు. మితిమీరిన […]

Written By: Srinivas, Updated On : November 6, 2021 11:50 am
Follow us on

High Court: మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ ఇబ్బందుల పాలవుతున్నారు. దీంతో ట్రాఫిక్ పోలీసులు నూతన మార్గదర్శకాలు ప్రవేశపెడుతున్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వ్యక్తుల ద్విచక్రవాహనాలను సీజ్ చేస్తూ జరిమానా విధిస్తున్నారు దీంతో రోడ్డు ప్రమాదాల నివారణకు నడుం బిగిస్తున్నారు. డ్రంక్ డ్రైవ్ నిర్వహిస్తూ మద్యం సేవించిన వారిని అదుపులోకి తీసుకుని కోర్టుకు పంపిస్తున్నారు. దీంతో వారు జరిమానాలు కడుతూ మరోసారి తాగమని చెబుతున్నారు.

మద్యం తాగి వాహనాలు నడుపుతూ అనేక ప్రమాదాలకు కారకులవుతున్నారు. మితిమీరిన వేగంతో వెళుతూ ఎదుటివారిని సైతం ఇబ్బందులకు గురిచేస్తున్నారు. దీంతో వారి వల్ల పక్కనున్న వారికి కూడా సమస్యలే. దీనిపై హైకోర్టు కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. జస్టిస్ కెఎల్ లక్ష్మణ్ సారధ్యంలోని హైకోర్టు బెంచ్ ఈమేరకు మార్గదర్శకాలు జారీ చేసింది.

మద్యం తాగి వాహనం నడిపే వ్యక్తి తనిఖీ చేసే ప్రదేశంలో పట్టుబడినా వాహనాన్ని మాత్రం సీజ్ చేసే అధికారం ఉండదు. అతడితో పాటు వేరే వ్యక్తి వస్తే అతడిని వాహనం నడపాలని సూచించొచ్చు. లేకుంటే బైక్ ను పక్కన పెట్టి వారి బంధువులకు సమాచారం అందజేసి వారు వచ్చి తీసుకెళ్లేలా చేయొచ్చు. కానీ వాహనాన్ని మాత్రం పోలీసులు సీజ్ చేసే అధికారం లేకుండాపోయింది. దీంతో మద్యం ప్రియులకు ఇది నిజంగా మంచి వార్తే.

Also Read: ప్ర‌జ‌ల‌న్నీ చూస్తూ ఉంటారు.. స‌మ‌యమొచ్చిన‌ప్పుడే చెప్తారు..

ఈ నేపథ్యంలో మద్యం సేవించిన వారికి హైకోర్టు ఇచ్చిన మార్గం మంచిదే. దీంతో వారు సులభంగా తప్పించుకునేందుకు అవకాశం ఏర్పడనుంది. ఎవరు అందుబాటులో లేకపోతే వాహనాన్ని పోలీసులు తాత్కాలికంగా అదుపులోకి తీసుకోవచ్చు. ఇక వాహనాన్ని నడిపిన వ్యక్తిని మూడు రోజుల్లో చార్జీషీటు దాఖలు చేసి మెజిస్రేట్ ముందు హాజరు పరచాలని సూచించింది.

Also Read: Bjp Politics: ఉప ఎన్నికల్లో ఇచ్చిన షాక్ తోనే బీజేపీ తేరుకుందా?

Tags