Shekhar Master : ఇండియా లోనే టాప్ మోస్ట్ కొరియోగ్రాఫర్స్ లిస్ట్ తీస్తే అందులో శేఖర్ మాస్టర్(shekar master) పేరు కచ్చితంగా టాప్ 3 లో ఎదో ఒక స్థానంలో ఉంటుంది. మన టాలీవుడ్ లో ఆయన పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) తో తప్ప దాదాపుగా అందరి హీరోలతో పని చేశాడు. చిన్న హీరోల దగ్గర నుండి, పాన్ ఇండియన్ స్టార్స్ వరకు, తమ సినిమాల్లో కచ్చితంగా శేఖర్ మాస్టర్ ఉండాల్సిందే అని పట్టుబడుతున్నారు. కారణం శేఖర్ మాస్టర్ కంపోజ్ చేసే హుక్ స్టెప్స్ కి అలాంటి క్రేజ్ ఉంటుంది మరీ. ఈ మధ్య కాలంలో విడుదల అవుతున్న పాటలు యూట్యూబ్ లో వందల కొద్దీ మిలియన్ వ్యూస్ రావాలంటే కచ్చితంగా హూక్ స్టెప్ ఉండాల్సిందే. లేకపోతే పాట ఎంత అద్భుతంగా ఉన్నా, అనుకున్న రేంజ్ కి చేరుకోలేకపోతున్నాయి. కేవలం మెలోడీ పాటలకు మాత్రం హుక్ స్టెప్స్ అవసరం లేదు.
Also Read : మారని శేఖర్ మాస్టర్ తీరు, అవే బూతు స్టెప్స్, ఈ సాంగ్ చూస్తే మీరే ఒప్పుకుంటారు!
ఈ విషయాన్నీ స్వయంగా మ్యూజిక్ డైరెక్టర్ థమన్(SS Thaman) ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు. అందుకే కొరియోగ్రాఫర్స్ తమ సినిమాలకు శేఖర్ మాస్టర్, లేకపోతే జానీ మాస్టర్(Jani Master) ని ఎంచుకుంటూ ఉంటారు. అయితే ఈమధ్య కాలం లో శేఖర్ మాస్టర్ కంపోజ్ చేస్తున్న హూక్ స్టెప్స్ వివాదాలకు దారి తీస్తున్నాయి. శేఖర్ మాస్టర్ కంపోజ్ చేస్తున్న హూక్ స్టెప్పులు హద్దులు దాటుతున్నాయని, చూసేందుకు ఆ స్టెప్పులు చాలా అసభ్యకరంగా ఉన్నాయని పలువురు తీవ్రమైన విమర్శలు చేయడం మొదలు పెట్టారు. నెటిజెన్స్ కూడా ఈ స్టెప్స్ ని ఎంజాయ్ చేసేవాళ్ళు ఉన్నారు, అదే సమయంలో విమర్శించే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. వివాదం బాగా ముదరడం తో ఏకంగా మహిళా కమిషన్ స్పందిస్తూ, సినిమా నుండి ఆ అసభ్యకరమైన హూక్ స్టెప్ ని తొలగించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో మూవీ టీం కూడా ఆ హూక్ స్టెప్పులు కనపడకుండా థియేటర్ వెర్షన్ లో జూమ్ చేసారు.
ఈ పాటలో నర్తించిన కేతిక శర్మ(Kethika Sharma) తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో ఈ పాటపై కొన్ని రీల్స్ చేసింది. అవి బాగా వైరల్ అయ్యాయి కూడా, కానీ మహిళా కమిషన్ వార్నింగ్ ఇవ్వడంతో ఆమె ఆ రీల్స్ ని తొలగించాల్సి వచ్చింది. ఇకపోతే ఈ వివాదం పై మొట్టమొదటిసారి శేఖర్ మాస్టర్ స్పందించాడు. రీసెంట్ గానే ఆయన స్టార్ మా ఛానల్ లో ప్రసారమైన ‘కిరాక్ బాయ్స్..కిలాడీ లేడీస్ 2′(Kiraak Boys..Khiladi Ladies 2) ప్రోగ్రాం లో ‘గేమ్ చేంజర్’ గా పాల్గొంటున్నాడు. ఇప్పటికే రెండు వారలను దిగ్విజయం గా పూర్తి చేసుకున్న ఈ షోకి సంబంధించి మూడవ వారం ఎపిసోడ్ ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమో చివర్లో శేఖర్ మాస్టర్ ‘అది దా సర్ప్రైజ్'(Adhi Dha Surprise) పాట గురించి స్పందిస్తూ ‘పాటకు తగ్గట్టుగా స్టెప్పులను కంపోజ్ చేస్తుంటాం.. అది అర్థం చేసుకోకుండా ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారు..దాని వల్ల మా కుటుంబం చాలా ఎఫెక్ట్ అయ్యింది’ అంటూ శేఖర్ మాస్టర్ కన్నీళ్లు పెట్టుకున్నాడు.
Also Read : హీరోయిన్ తో ఎఫైర్ బయటపెట్టాడు.. శేఖర్ మాస్టర్ సీరియస్ గా వెళ్లిపోయాడు.. వైరల్ వీడియో…