Homeఎంటర్టైన్మెంట్Arvind Trivedi: విషాదం : ఆ గొప్ప నటుడు ఇక లేరు !

Arvind Trivedi: విషాదం : ఆ గొప్ప నటుడు ఇక లేరు !

Arvind Trivedi: ‘రామాయణ్’ సీరియల్ లో రావణుడిగా నటించి మెప్పించిన ప్రముఖ నటుడు ‘అరవింద్ త్రివేది‘ ఇకలేరు. 1980వ దశకంలో బుల్లితెర పై ఎంతగానో అలరించిన ఆయన రావణుడి పాత్రకు ప్రాణం పోశారు. అరవింద్ త్రివేది ప్రస్తుత వయస్సు 82 సంవత్సరాలు. అయితే పెరిగిన వయసు రీత్యా ఆయన గత కొంతకాలంగా గుండె సంబంధిత అనారోగ్యంతో తీవ్రంగా బాధ పడుతున్నారు.
Arvind Trivedi
ఈ నేపథ్యంలో ఆయనకు గత వారం హార్ట్ ఎటాక్‌ వచ్చింది. వెంటనే కుటుంబ సభ్యులు తేరుకుని హుటాహుటిన హాస్పిటల్ లో జాయిన్ చేశారు. అయితే, ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో గత రాత్రి ఆయన కన్నుమూశారు. అరవింద్ త్రివేది మరణవార్తను ఆయన సహ నటుడు సుశీల్ లహిరి సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులకు తెలియజేశారు.

సుశీల్ లహిరి ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ.. ‘ఇది చాలా విచారకరమైన వార్త, మా ప్రియమైన అరవింద్ భాయ్ ఇక లేరనే విషయాన్ని మేము జీర్ణించుకోలేకపోతున్నాం’ అంటూ సుశీల్ లహిరి పేర్కొన్నారు. ఇతర సినీ ప్రముఖులు కూడా అరవింద్ త్రివేది ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. అరవింద్ తన 40 ఏళ్ల సుదీర్ఘ కెరీర్ లో హిందీ, గుజరాతీ సినిమాలు, టీవీ సీరియళ్లలో నటించారు.

అలాగే ఆయన గొప్ప నటుడిగా దాదాపు 300 సినిమాల్లో నటించారు. అదే విధంగా ఆయన పార్లమెంటు సభ్యుడిగా పనిచేయడం విశేషం. సినీ ప్రముఖులు అరవింద్ త్రివేది మృతి పట్ల తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. మా ‘ఓకేతెలుగు.కామ్’ తరఫున అరవింద్ త్రివేది మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ, శోహార్తులైన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము.

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Related News

Most Popular

Kajal Aggarwal birthday

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
The Odyssey 3 Day Collections

The Odyssey : ‘ది ఒడిస్సీ’ లో క్రేజీ రోల్ ని మిస్ చేసుకున్న మన హీరో.. పెద్ద...

రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం , బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ వసూళ్ల సునామీ ని సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తుందో మన...
Akhil Lenin Movie Release Date

Lenin Movie : 11వ రోజు ఊహించని రికార్డు నెలకొల్పిన ‘లెనిన్’.. ఇప్పట్లో ఈ సునామీ ఆగేలా లేదు..

Lenin Movie : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన 'లెనిన్' చిత్రం వసూళ్లు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని కైవసం చేసుకున్న...
Team India Bowling

Team India : జింబాబ్వే టూర్ కు టీమిండియా ఇదే.. వాళ్ల మీద మనోళ్ళ రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Team India : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలో టి20.. వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత టీమిండియా పూర్తిగా నిరాశలో కూరుకుపోయింది. బౌలింగ్ దారుణంగా ఉంది. బ్యాటింగ్ చెత్తగా ఉంది....
TTD Trust Board Meeting

TTD : చంద్రబాబు జైల్లో చనిపోతే పొట్టేళ్ల విందు.. అటువంటి అధికారికి తిరుమలలో ఏఈఈ పోస్ట్..

TTD : రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తుంటారు. వాళ్లలో వాళ్లకు వ్యూహాలు ఉంటాయి. ఎత్తులు ఉంటాయి. వాటిని చిత్తు చేసే ఎత్తుగడలు కూడా ఉంటాయి. ఇవన్నీ రాజకీయంలో ఒక భాగం. కానీ ఉద్యోగులు...
Oktelugu Epaper