https://oktelugu.com/

Dil Raju : దిల్ రాజును దివాళా తీయించిన అరుంధతి మూవీ.. తర్వాత వేసిన ఆ స్టెప్ తోనే నిలబడ్డాడట.!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ ప్రొడ్యూసర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నిర్మాత దిల్ రాజు...ప్రస్తుతం భారీ బడ్జెట్ సినిమాలను కూడా నిర్మిస్తూ స్టార్ ప్రొడ్యూసర్ గా మారిపోయాడు.

Written By:
  • Gopi
  • , Updated On : January 16, 2025 / 09:06 AM IST

    Dil Raju

    Follow us on

    Dil Raju : తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ ప్రొడ్యూసర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నిర్మాత దిల్ రాజు…ప్రస్తుతం భారీ బడ్జెట్ సినిమాలను కూడా నిర్మిస్తూ స్టార్ ప్రొడ్యూసర్ గా మారిపోయాడు. ఇక ఏది ఏమైనా కూడా దిల్ రాజు మొదట డిస్ట్రిబ్యూటర్ గా తన కెరీర్ ని మొదలుపెట్టి ఆ తర్వాత ప్రొడ్యూసర్ గా మారి ప్రస్తుతం టాప్ ప్రొడ్యూసర్ గా ముందుకు దూసుకెళ్లడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి.

    దిల్ రాజు లాంటి ప్రొడ్యూసర్ సైతం కెరియర్ మొదట్లో చాలా ఇబ్బందులు పడ్డడానే విషయం మనలో చాలా మందికి తెలియదు…ఇక మొదటిసారి సౌందర్య లీడ్ రోల్ లో వచ్చిన ‘అరుంధతి ‘ అనే సినిమాకి డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరించిన దిల్ రాజు ఆ సినిమా కోసం 32 లక్షలు పెట్టి డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరించాడు. అయితే ఆ 32 లక్షలు కూడా మొత్తం పోయాయని రీసెంట్ గా ఆయన ఒక ఇంటర్వ్యూలో తెలియజేశాడు. అయితే మొదట 30 లక్షలు కట్టి సినిమాని రిలీజ్ చేసుకున్నారు. సినిమా డిజాస్టర్ అవ్వడంతో ఒక్క రూపాయి లేకుండా మొత్తం డబ్బులన్ని పోయాయి. ఇక అప్పుడు ఏం చేయాలో తెలియలేదట. అయినప్పటికి మరో రెండు లక్షల రూపాయలను కవర్లో పట్టుకుని నిర్మాత కాస్ట్యూమ్ కృష్ణ గారి దగ్గరికి వెళ్లి ఆ కవర్ అతనికి ఇచ్చారట. దాంతో కాస్ట్యూమ్ కృష్ణ దిల్ రాజు బిహేవియర్ కి మురిసిపోయారట…కారణం ఏంటి అంటే ఒక సినిమా ఫ్లాప్ అయింది అంటే డిస్ట్రిబ్యూటర్లు మిగిలిన బ్యాలెన్స్ మొత్తాన్ని కూడా ప్రొడ్యూసర్లకు ఇవ్వడానికి ఇష్టపడరు. దానికి తోడుగా వాళ్ళు ఇచ్చిన డబ్బుల్లో కొంత మొత్తాన్ని కూడా వెనక్కి ఇచ్చేయమని ప్రొడ్యూసర్ మీద ఒత్తిడి తెస్తూ ఉంటారు. ఇక దిల్ రాజు మాత్రం అలా చేయలేదు. ఇక ఇదిలా ఉంటే అప్పటికే దిల్ రాజు వాళ్ళ అన్నయ్యలు డిస్ట్రిబ్యూషన్ ఆపేసి బిజినెస్ పనులు చూసుకోమని చెప్పారట. దాంతో కొద్దిరోజుల పాటు ఆయన బిజినెస్ పనులు చూస్తున్న సమయంలో కాస్ట్యూమ్ కృష్ణ నుంచి ఒకసారి ఫోన్ వచ్చిందట. వెంటనే దిల్ రాజు వెళ్లి ఆయన్ని కలిస్తే తమిళంలో సూపర్ హిట్ అయిన ఒక సినిమాకి సిడిని ఇచ్చి ఈ సినిమా చూడమని దిల్ రాజు కి చెప్పారట. ఆయన ఆ సినిమా చూసి సినిమా బాగుంది అని చెప్పాడట. వెంటనే ఈ సినిమా మనం తెలుగులో రీమేక్ చేస్తున్నాము. డబ్బులు అరెంజ్ చేసుకో డిస్ట్రిబ్యూషన్ నువ్వే చేస్తూన్నావ్ అని చెప్పారట. దాంతో దిల్ రాజుకు ఒక అంత సంతోషం ఉన్నప్పటికీ ఆయన దగ్గర పెట్టడానికి డబ్బులు అయితే లేవని ఎలా అని అనుకుంటున్నా సందర్భంలో అన్నలతో చెబితే డిస్ట్రిబ్యూషన్ లేదు ఏమీ లేదు బిజినెస్ పనులు చూసుకోవాలి అని వాళ్ళు మరోసారి గట్టిగా చెప్పారట.

    అప్పటీకే దిల్ రాజు కాస్ట్యూమ్ కృష్ణ గారితో 60 లక్షల కి సినిమా డిస్ట్రిబ్యూషన్ ని తీసుకుంటున్నానని డీల్ సెట్ చేసుకుని వచ్చారు. అయితే మొదట ఆరు లక్షలు కట్టి ఆ తర్వాత షూటింగ్ అయిపోయేలోపు మొత్తం 24 లక్షలు కట్టాలని చెప్పారట. ఇక రిలీజ్ సమయంలో మిగతావి కట్టాల్సి ఉంటుందని చెప్పడంతో దిల్ రాజు ఓకే చేశాడు.

    ఇక మొత్తానికైతే వాళ్ళ దగ్గర ఒక రూపాయి కూడా లేని సమయంలో దిల్ రాజు బిజినెస్ లో నుంచి ఆరు లక్షల రూపాయలైతే కట్టి అలా ఆ సినిమాకి డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరించాడు. ఇక మొత్తానికైతే పెళ్లి పందిరి సినిమా సూపర్ సక్సెస్ అవ్వడంతో భారీగా లాభం వచ్చిందనే చెప్పాలి.

    60 లక్షల రూపాయలు పెడితే దాదాపు రెండు కోట్ల వరకు డబ్బులు అయితే వచ్చాయట. ఇక దాంతో మెల్లిమెల్లిగా గాడిన పడ్డ దిల్ రాజు కథల విషయంలో చాలా వరకు ఆచితూచి ముందుకు సాగుతూ వచ్చాడు. అందువల్ల ఈరోజు టాప్ నుండి ప్రొడ్యూసర్ గా ఇండస్ట్రీలో వెలుగొందుతున్నాడనే చెప్పాలి…