Visakhapatnam : బంగాళాఖాతంలో( day of Bengal ) వరుసగా తుఫాన్లు సంభవిస్తున్నాయి. అల్పపీడనాల ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తూ వచ్చాయి. తాజాగా మరో అల్పపీడనం హెచ్చరిక వచ్చింది. సరిగ్గా ఇదే సమయంలో విశాఖ తీర ప్రాంతంలో అలజడి నెలకొంది. అలల ఉధృతి పెరిగింది. కెరటాలు ఎగసిపడుతున్నాయి. పలుచోట్ల సంద్రం ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో విశాఖ ఆర్కే బీచ్ సమీపంలో తీర ప్రాంతంలో ఏర్పాటు చేసిన రిటైనింగ్ వాల్ కొంత భాగం కుప్పకూలింది. అర్ధరాత్రి ఈ సంఘటన చోటుచేసుకుంది. అలల ఉధృతికి ఈ రిటైనింగ్ వాల్ పేక మేడలా కూలిపోవడం విశేషం. దాదాపు 200 మీటర్లకు పైగా పొడవు గల రిటైనింగ్ వాల్ ఇది. ఆర్కే బీచ్ లో ఇసుక కోతకు గురి కావడం వల్ల తొలుత రిటైనింగ్ వాల్ లో పగుళ్లు ఏర్పడ్డాయి. అర్ధరాత్రి పెద్ద శబ్దంతో వాల్ కొంత భాగం కూలిపోయింది.
* అప్పట్లో అలా
జీవీఎంసీ పార్కు( gvmc Park ) సైతం దెబ్బతింది. గతంలో కూడా ఇటువంటి ఘటనలు జరిగిన సందర్భాలు ఉన్నాయి. 2021లో జవాన్ తుఫాన్ దాటికి రిటైనింగ్ వాల్ కొంత భాగం కుప్పకూలింది. 70 మీటర్ల మేర రిటైనింగ్ వాల్ కూలిపోయింది. అప్పట్లో తీరంలో భూమి కొంత కుంగిపోయింది. చిల్డ్రన్స్ పార్క్ దెబ్బతింది. బీచ్ రోడ్డులో భూమి కోతకు గురైంది. ఆంధ్ర యూనివర్సిటీ సివిల్ ఇంజనీర్లు కోతకు గల కారణాలపై అప్పట్లో అధ్యయనం చేశారు. ఇప్పుడు మరోసారి అటువంటి పరిస్థితి కనిపించడంతో నగరవాసుల్లో భయాందోళన వ్యక్తం అవుతోంది.
* మారిన పరిస్థితులతో
సాధారణంగా ఆటు, పోటు సమయంలో సముద్రం ముందుకు రావడం సర్వసాధారణం. కానీ ఇటీవల వరుసగా విపత్తులు, తుఫాన్లు సంభవిస్తున్నాయి. దీంతో బంగాళాఖాతం( Bay of Bengal ) ఉగ్రరూపం దాల్చుతోంది. ఎక్కడికక్కడే తీరం కోతకు గురవుతోంది. ప్రధానంగా కాకినాడ ఉప్పాడ తీరంలో తరచూ కెరటాలు ఎగసిపడుతుంటాయి. ఎంతటి నెలలో విశాఖ అనకాపల్లి తీరం పెద్ద ఎత్తున కోతకు గురైంది. సుమారు 50 మీటర్ల వరకు సముద్రం ముందుకు వచ్చింది. దీంతో మత్స్యకారులు ఆందోళనకు గురయ్యారు. ప్రస్తుతం విశాఖ ఘటనకు సంబంధించి అధికారులు అధ్యయనం చేయడం ప్రారంభించారు.
* సుదీర్ఘ తీర ప్రాంతం
ఏపీలో( Andhra Pradesh) సుదీర్ఘ తీరప్రాంతం ఉంది. నెల్లూరు జిల్లా తడ నుంచి శ్రీకాకుళం జిల్లా డొంకూరు వరకు వెయ్యి కిలోమీటర్ల వరకు తీరం విస్తరించి ఉంది. గత కొద్ది రోజులుగా సముద్రం ముందుకు వస్తోంది. అయితే అది మానవ తప్పిదం వల్లేనని నిపుణులు చెబుతున్నారు. తీరం పొడవునా పరిశ్రమలు ఉన్నాయి. వ్యర్ధాలతోపాటు రసాయనాలు విడిచి పెడుతున్నారు. మరోవైపు నదుల సంగమం వద్ద పెద్ద ఎత్తున చెత్త వచ్చి కలుస్తోంది. ఇంకోవైపు వరుసగా తుఫాన్లు సంభవిస్తున్నాయి. భారీ వర్షాలకు సముద్రం పోటెత్తుతోంది. అందుకే కెరటాలు పెరుగుతున్నాయి. తీరం కోతకు గురవుతోంది. అయితే తీరం వెంబడి ఉండే మత్స్యకారులకు మాత్రం ఆందోళన తప్పడం లేదు