Sobhita Dhoolipalla: సౌత్ ఇండియాలో చూడముచ్చటగా అనిపించే జంటలలో ఒకటి నాగ చైతన్య, శోభిత జంట. సమంత తో విడాకులు తీసుకున్న తర్వాత కొన్నాళ్ళు శోభిత తో డేటింగ్ చేసిన నాగచైతన్య, ఆ తర్వాత పెద్దలని ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు. శోభిత అచ్చ తెలుగు అమ్మాయి. పుట్టింది తెనాలి లో, పెరిగింది వైజాగ్ లో. కానీ సినిమాలు ఎక్కువగా హిందీ లోనే చేసేది. తెలుగు లో ఈమె కేవలం మేజర్, గూఢచారి చిత్రాల్లో మాత్రమే నటించింది. ఈ రెండు సినిమాలు కూడా కమర్షియల్ గా పెద్ద హిట్ అయ్యాయి. అయినప్పటికీ ఆమె బాలీవుడ్ వైపే ఎక్కువ మొగ్గు చూపించింది. నాగ చైతన్య తో కలిసి ఇప్పటి వరకు ఈమె ఒక్క సినిమా కూడా చేయలేదు. అయినప్పటికీ వీళ్ళ మధ్య పరిచయం ఏర్పడి పెళ్లి వరకు వ్యవహారం ఎలా వచ్చింది అనేది ఇప్పటికీ మిస్టరీ లాగానే మిగిలిపోయింది. ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గా శోభిత తన ఇంస్టాగ్రామ్ లో అప్లోడ్ చేసిన ఫోటోలు వివాదాస్పదంగా మారాయి.
పూర్తి వివరాల్లోకి వెళ్తే శోభిత అనేక సందర్భాల్లో తనకి తెలుగు సంప్రదాయాలు తూచా తప్పకుండా అనుసరించడం ఎంతో ఇష్టమని, చిన్నప్పటి నుండి మా అమ్మానాన్నలు అలా అలవాటు చేసారని చెప్పుకొచ్చేది. ఆమె పెళ్లి కూడా అదే పద్దతి లో చేసుకుంది. పెళ్ళికి ముందు జరిపించుకోవాల్సిన పనులన్నీ ఆమె హిందూ సంప్రదాయాలతోనే జరిపించుకుంది. ఈ కాలం లో సెలెబ్రిటీలు మన హిందూ సంప్రదాయాలను ఇంత కచ్చితంగా అనుసరించే వాళ్ళు ఎక్కడ ఉంటారు చెప్పండి?, అందుకే శోభిత ని నెటిజెన్స్ అప్పట్లో ప్రశంసలతో ముంచి ఎత్తారు. ఈ సంక్రాంతి పండుగ కూడా ఆమె తెలుగుదనం ఉట్టిపడేలా చేసుకుంది. దానికి సంబంధించిన ఫొటోలో సోషల్ మీడియా లో అప్లోడ్ చేయగా, అవి వైరల్ గా మారింది. అయితే ఆ ఫొటోలలోనే శోభిత ఒక విషయంలో అడ్డంగా దొరికిపోయింది.
హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్ళైన అమ్మాయి కాళ్ళ వేళ్ళకు మెట్టెలు ఉండాలి. కానీ శోభిత వేళ్ళకు ఆ మెట్టెలు కనిపించలేదు. ఈ విషయంపై సోషల్ మీడియా లో నెటిజెన్స్ చాలా తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. పెళ్లి జరిగి సరిగ్గా రెండు కూడా అవ్వలేదు, అప్పుడే మెట్టెలను తీసి పక్కన పడేస్తావా..?, ఇదేనా నువ్వు అనుసరించే హిందూ సాంప్రదాయం అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ శోభిత ని నిలదీస్తున్నారు. మరి దీనికి ఆమె రియాక్షన్ ఇస్తుందా లేదా అనేది చూడాలి. ఇక ఆమె చేస్తున్న సినిమాల సంగతికి వస్తే ఈమె రీసెంట్ గానే బాలీవుడ్ లో పలు సినిమాలను, వెబ్ సిరీస్ లను పూర్తి చేసింది. ప్రస్తుతానికి ఈమె చేతిలో ఎలాంటి ప్రాజెక్ట్ లేదు. పెళ్లి తర్వాత అసలు ఈమె సినిమాలు చేస్తుందా లేదా అనే దానిపై కూడా ఎలాంటి క్లారిటీ లేదు. చూస్తుంటే సినిమాలకు దూరంగా ఉండేందుకే ప్రయత్నం చేస్తున్నట్టుగా అనిపిస్తుంది.