Sreeleela Arundhati remake firstlook: తెలుగు చలన చిత్ర పరిశ్రమలో సువర్ణాక్షరాలతో రాయదగ్గ చిత్రాల్లో ఒకటి ‘అరుంధతి’. కోడిరామకృష్ణ దర్శకత్వం లో మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ పై తెరకెక్కించిన ఈ చిత్రం ఆరోజుల్లో సృష్టించిన ప్రభంజనాన్ని ఆడియన్స్ అంత తేలికగా మర్చిపోలేరు. ఒక లేడీ ఓరియెంటెడ్ చిత్రం ఇన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తుందా? అని ట్రేడ్ మొత్తం ఆశ్చర్యపోయిన రోజులవి. అప్పటి సూపర్ స్టార్స్ పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్ వంటి వారు కూడా ఈ సినిమా కలెక్షన్స్ అని అందుకోవడానికి ఎన్నో ఏళ్ళు ఎదురు చూడాల్సి వచ్చింది. ఇప్పటికీ ఈ సినిమాని రీ రిలీజ్ చేస్తే బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల కనకవర్షం కురుస్తుంది అందులో ఎలాంటి సందేహం లేదు. అయితే ఇలాంటి హిస్టారికల్ బ్లాక్ బస్టర్ ని రీమేక్ చేయడానికి అప్పట్లో చాలామంది ప్రయత్నం చేశారు. కానీ అనుష్క క్రియేట్ చేసిన మ్యాజిక్ ని రిపీట్ చేయడం అంత తేలికైన విషయం కాదని చివరి నిమిషం లో డ్రాప్ అయ్యారు.
ఈ చిత్రం లో హారర్ ఎలిమెంట్స్ మరియు గ్రాఫిక్స్ అద్భుతమే, అందులో ఎలాంటి సందేహం లేదు, కానీ అంతకంటే అద్భుతంగా ఈ చిత్రం లో అనుష్క్ , సోను సూద్ పోటీ పడి మరీ నటించారు. వాళ్ళు కూడా మళ్లీ అలాంటి మ్యాజిక్ ని రిపీట్ చేయలేరేమో ఇప్పుడు. అయితే ఈ చిత్రాన్ని బాలీవుడ్ లో రీమేక్ చెయ్యాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. అనుష్క పాత్రని పోషించబోయేది మరెవరో కాదు, శ్రీలీల అట. ఈ విషయం తెలిసినప్పటి నుండి సోషల్ మీడియా లో శ్రీలీల పై వస్తున్న ట్రోల్స్ మామూలు రేంజ్ లో లేవు. డ్యాన్స్ తప్ప, నటనలో ఓనమాలు కూడా తెలియని శ్రీలీల ఈ క్యారెక్టర్ చేస్తుందా?, ఒకవేళ అదే నిజమైతే ఆల్ టైం క్లాసిక్ చిత్రాన్ని సర్వనాశనం చేసినవాళ్లు అవుతారు అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: ‘విశ్వంభర’ లేటెస్ట్ విడుదల తేదీ ఇదే.. ఈసారి కూడా మిస్ అయితే ఇక ఓటీటీ నే దిక్కు..
అంతే కాకుండా ‘అరుంధతి’ గెటప్ లో శ్రీలీల ఉన్న కొన్ని ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియా లో లీకై బాగా వైరల్ అయ్యింది. ఇది AI ద్వారా క్రియేట్ చేశారా ?, లేకపోతే ఏదైనా యాడ్ షూట్ కి సంబంధించిన షాట్స్ అనేది తెలియదు కానీ, ఇందులో శ్రీలీల గెటప్ ని చూసి సోషల్ మీడియా లో నెటిజెన్స్ మామూలు రేంజ్ లో ర్యాగింగ్ చేయడం లేదు. అరుంధతి చిత్రం లో అనుష్క ని ఫ్లాష్ బ్యాక్ లో కొబ్బరి కాయలతో కొట్టి చంపేశారు, కానీ శ్రీలీల ని నిమ్మకాయలతో కొట్టి చంపేయొచ్చు అంటూ సోషల్ మీడియా లో ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో వైరల్ అవుతున్న ఈ లుక్ కి సంబందించిన ఫోటోలు మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి. చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్స్ రూపం లో తెలియజేయండి.