https://oktelugu.com/

Article 370 Movie Reviews: ఆర్టికల్ 370 మూవీ రివ్యూస్: ప్రేక్షకులు ఏమంటున్నారంటే..?

ఈ సినిమా ఈరోజు రిలీజ్ అయి పాజిటివ్ టాక్ తో ముందుకు దూసుకెళ్తుంది. అయితే ఈ సినిమాను చూసిన ప్రతి ఒక్కరు ఈ సినిమా మీద పాజిటివ్ గా స్పందించడం నిజంగా చాలా ఆసక్తికరమైన విషయమనే చెప్పాలి.

Written By:
  • Gopi
  • , Updated On : February 23, 2024 / 03:35 PM IST
    Follow us on

    Article 370 Movie Reviews:ఈమధ్య వాస్తవ సంఘటనలను ఆధారంగా చేసుకొని వచ్చిన సినిమాలు మంచి విజయాలను అందుకుంటున్నాయి. అందులో భాగంగానే ‘ఆర్టికల్ 370 రద్దు ‘ ను అధారంగా చేసుకొని తీసిన ఆర్టికల్ 370 సినిమా ఈరోజు రిలీజ్ అయింది. ఇక ఈ సినిమాలో యామి గౌతమ్, ప్రియమణి, అరుణ్ గోవిల్ లు ముఖ్యపాత్రలు పోషించారు. ఇక ఈ సినిమా కి నేషనల్ అవార్డ్ విన్నర్ అయిన ‘ఆదిత్య సుహస్ ‘ డైరెక్టర్ గా వ్యవహరించాడు.

    ఈ సినిమా ఈరోజు రిలీజ్ అయి పాజిటివ్ టాక్ తో ముందుకు దూసుకెళ్తుంది. అయితే ఈ సినిమాను చూసిన ప్రతి ఒక్కరు ఈ సినిమా మీద పాజిటివ్ గా స్పందించడం నిజంగా చాలా ఆసక్తికరమైన విషయమనే చెప్పాలి. ఇక ఇప్పటికే ఈ సినిమాను చూసిన ఒక్కొక్క ప్రేక్షకుడు ఆ సినిమా చూస్తున్న టైం లో ఒక డిఫరెంట్ అనుభూతిని పొందడమే కాకుండా చాలా వైవిధ్యంగా తమ అనుభవాలను వివరిస్తున్నారు.

    ఇక ట్విట్టర్ వేదికగా కెనడా లో ఈ సినిమాను చూసిన ఒక వ్యక్తి ఈ సినిమా చూస్తున్నంత సేపు ఆయన పొందిన అనుభూతిని తెలియజేశాడు. ఈ సినిమాలో నటించిన యామి గౌతమ్ , ప్రియమణి, అరుణ్ గోవిల్ నటన చాలా అద్భుతంగా ఉందని చెబుతున్నాడు. అలాగే ఈ సినిమా థియేటర్లో చూస్తున్నంత సేపే కాకుండా, సినిమా అయిపోయిన తర్వాత మనం ఇంటికి వెళ్ళినా కూడా మనల్ని ఆ క్యారెక్టర్లు వెంటాడుతూనే ఉంటాయని అలాంటి ఒక దృశ్య కావ్యంగా ఈ సినిమాని దర్శకుడు మలిచాడు అంటూ తను తన అభిప్రాయాన్ని తెలియజేస్తున్నాడు… ఇక ఈ సినిమా కోసం ఆదిత్య సుహాస్ రాసుకున్న స్క్రీన్ ప్లే కూడా చాలా బాగుందని చివరి వరకు ప్రేక్షకులను చాలా ఉత్కంఠకు గురి చేస్తూనే ఎక్కడ కూడా బోర్ కొట్టించకుండా సాగుతూ ఉంటుంది అంటూ ఆయన తెలియజేయడం విశేషం…

    ఇక ట్రేడ్ అనలిస్టుగా తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకున్న ‘సుమిత్ కాడెల్’ ఎక్స్ లో ఈ సినిమా గురించి ఇలా రాసుకోచ్చాడు. ఈ సినిమా టాప్ నాచ్ పొలిటిక్రిటికల్లి జమ్ము కాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు ను చాలా గొప్పగా చూపిస్తుంది. జమ్మూ కాశ్మీర్ ని ఇండియాలో భాగం చేయడాన్ని చాలా స్పష్టంగా చూపించారు. అలాగే దర్శకుడు ఎంచుకున్న స్క్రీన్ చాలా గ్రిప్పింగ్ గా ఉంది. దానివల్ల సినిమా ఎక్కడ కూడా బోర్ లేకుండా వాస్తవికతని తెలియజేస్తూ సాగింది.అలాగే భయంకరమైన తీవ్రవాది అయిన బుర్హాన్ వనీని హతమార్చడం, పూల్వమా దాడుల గురించి చాలా నీటుగా కవర్ చేస్తూ వాస్తవికతని తెలియజేయడానికి ఒక గొప్ప ప్రయత్నం చేశారు అంటూ తను ట్విట్టర్ వేదికగా రాసుకోచ్చాడు…