ప్రధాని మోదీ `దీపం’ పిలుపుపై మరో దుమారం

కరోనాపై యుద్ధంలో భారతీయులంతా గెలుస్తారని ధీమా వ్యక్తం చేయడంతో పాటు మరోసారి దేశ పౌరులంతా కరోనాను తరిమికొట్టేందుకు ఈ ఆదివారం రాత్రి దీపాలు వెలిగించడానికి ముందుకు రావాలని ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపుపై మరో రాజకీయ దుమారం చెలరేగుతుంది. రాజకీయాలను అటుంచితే, ఇప్పటికే లాక్ డౌన్ కారణంగా పారిశ్రామిక, వాణిజ్య, ఇతర కార్యక్రమాలు ఆగిపోవడంతో 40 శాతం కూడా విద్యుత్ వినియోగం మాత్రమే జరుగుతున్నని, ఇప్పుడు ప్రధాని పిలుపు అందుకొని దేశంలోని దీపాలు అన్నిన్నిట్నీ ఒకేసారి […]

Written By: Neelambaram, Updated On : April 4, 2020 5:22 pm
Follow us on


కరోనాపై యుద్ధంలో భారతీయులంతా గెలుస్తారని ధీమా వ్యక్తం చేయడంతో పాటు మరోసారి దేశ పౌరులంతా కరోనాను తరిమికొట్టేందుకు ఈ ఆదివారం రాత్రి దీపాలు వెలిగించడానికి ముందుకు రావాలని ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపుపై మరో రాజకీయ దుమారం చెలరేగుతుంది.

రాజకీయాలను అటుంచితే, ఇప్పటికే లాక్ డౌన్ కారణంగా పారిశ్రామిక, వాణిజ్య, ఇతర కార్యక్రమాలు ఆగిపోవడంతో 40 శాతం కూడా విద్యుత్ వినియోగం మాత్రమే జరుగుతున్నని, ఇప్పుడు ప్రధాని పిలుపు అందుకొని దేశంలోని దీపాలు అన్నిన్నిట్నీ ఒకేసారి ఆర్పివేస్తే విద్యుత్ గ్రిడ్లు దెబ్బతినే అవకాశం ఉన్నదంటూ వివాదం లేవనెత్తుతున్నారు.

మొదటగా మహారాష్ట్ర విద్యుత్ మంత్రి నితిన్ రౌత్ ఈ పిలుపుపై ప్రధాని మోదీ పునరాలోచించాలని విజ్ఞప్తి చేశారు. ఒకేసారి లైట్లన్నీ ఆర్పేయడం వల్ల విద్యుత్ గ్రిడ్ల దెబ్బతినే అవకాశంతో పాటు ఎమర్జెన్సీ సర్వీసులపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేస్తూ విద్యుత్ దీపాలను ఎవరూ ఆర్పవద్దని పిలుపునిచ్చారు.

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ సహితం అంటీముట్టన్నట్లు స్పందించారు. తాను కరోనాను నియంత్రించాలా? లేదా రాజకీయాలు చేయాలా? అని సూటిగా ప్రశ్నిస్తూ ప్రధాని, తనకు మధ్య రాజకీయుద్ధానికి ఎందుకు తెర లేపుతున్నారు? దయచేసి రాజకీయ యుద్ధానికి తెరలేపకండని మీడియాకు ఆమె విజ్ఞప్తి చేశారు.

ప్రధాని ఇచ్చిన పిలుపును ‘వ్యక్తిగత అంశం’ గా బెనర్జీ అభివర్ణించారు. మీరు పాటించాలనుకుంటే పాటించండని, నన్నెందుకు అడుగుతున్నారని ఆమె విలేకరులను ఎదురు ప్రశ్నించారు.

ఒకేసారి దేశం మొత్తం లైట్లు ఆఫ్‌ చేస్తే విద్యుత్‌ గ్రిడ్‌ కుప్పకూలే ప్రమాదం ఉందని విద్యుత్‌ నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో తెలంగాణ పవర్‌గ్రిడ్‌ సురక్షితంగా ఉందని ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌ రావు భరోసా వ్యక్తం చేశారు.

ఆదివారం రాత్రి 9 గంటలకు లైట్లు ఆర్పేయడం వల్ల తెలంగాణ పవర్‌గ్రిడ్‌పై ఎలాంటి ప్రభావం ఉండదు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం..గ్రిడ్‌కు ఎలాంటి సమస్యా ఉండదు. లైట్లు ఆపితే గ్రిడ్‌ కుప్పకూలుతుందన్న ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేశారు.

కాగా, ఈ నేప‌థ్యంలో రాష్ట్రాల విద్యుత్ సంస్థ‌ల‌కు కేంద్రం తాజాగా ఆదేశాలు జారీచేసింది. దీపం వెలిగించే కార్య‌క్ర‌మం వ‌ల్ల ఎలాంటి విద్యుత్ అవాంత‌రాలు త‌లెత్త‌కుండా చూడాల‌ని విద్యుత్ సంస్థ‌ల‌కు సూచించింది. విద్యుత్ ఉద్యోగులు విద్యుత్ కేంద్రాల ద‌గ్గ‌ర విధుల్లో ఉండాల‌ని, అత్య‌వ‌స‌ర ప‌రిస్థితి త‌లెత్తినా దాన్ని ప‌రిష్క‌రించేందుకు సిద్ధంగా ఉండాల‌ని కోరింది.